Dhurandhar 2 vs Pushpa 2: రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2' సినిమా విడుదలై 27 రోజులు పూర్తయింది. ప్రస్తుతం నాలుగో వారంలో ఉన్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డీలా పడింది.
డైరెక్టర్ ఆదిత్య ధర్ తీసిన 'ధురంధర్ 2' సినిమా పరిస్థితి ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద కాస్త నెమ్మదించింది. అయినా, ఈ సినిమా ఇంకా గట్టిగానే నిలబడుతోంది. ఈ ఏడాది ఈ సినిమా సాధించినన్ని వసూళ్లు బహుశా మరే సినిమా సాధించలేకపోవచ్చు.
27
27వ రోజు ధురంధర్ 2 మూవీ బాక్సాఫీసు
'ధురంధర్ 2' విడుదలై 27 రోజులు పూర్తయ్యాయి. ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయింది. 27వ రోజున ఈ సినిమా 4.85 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇది సాయంత్రం 6 గంటల వరకు వచ్చిన లెక్క. ప్రస్తుతం ఈ సినిమాకు 6755 షోలు నడుస్తున్నాయి.
37
ధురంధర్ నాలుగో వారం కలెక్షన్లు
'ధురంధర్ 2' సినిమా నాలుగో వారంలోకి ప్రవేశించింది. 23వ రోజున రూ.7 కోట్లు, 24వ రోజున రూ.13.50 కోట్లు వసూలు చేసింది. ఇక 25వ రోజున రూ.14.50 కోట్ల బిజినెస్ చేయగా, 26వ రోజున రూ.5.20 కోట్లు, 27వ రోజున 4.85 కోట్లు సంపాదించింది. ఈ రోజు ఐదు కోట్లు దాటే ఛాన్స్ ఉంది.
'ధురంధర్ 2' సినిమా 27 రోజుల్లో ఇండియాలో నెట్‌గా 1093.47 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. దీని గ్రాస్ కలెక్షన్ 1309.09 కోట్లకు చేరింది. ఇండియాలో నెట్ కలెక్షన్ల పరంగా 'ధురంధర్ 2' రెండో అతిపెద్ద హిట్‌గా నిలిచింది. మొదటి స్థానంలో ఇప్పటికీ అల్లు అర్జున్ 'పుష్ప 2' ఉంది. ఆ సినిమా 1234.10 కోట్లు వసూలు చేసింది.
57
పుష్ప 2 రికార్డులకు బీటలు
రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2' సినిమా వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.1718.62 కోట్ల రూపాయలు రాబట్టింది. ఓవర్సీస్ కలెక్షన్ 415.25 కోట్లకు చేరుకుంది. త్వరలో ఇది `పుష్ప 2` రికార్డుని బ్రేక్ చేయబోతుంది. ఈ వారంలోనే అల్లు అర్జున్ మూవీని దాటే ఛాన్స్ కనిపిస్తోంది. `పుష్ప 2` ప్రపంచ వ్యాప్తంగా రూ. 1742కోట్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాల అంచనా.
67
ధురంధర్ 2 మూడు వారాల కలెక్షన్లు
'ధురంధర్ 2' సినిమా విడుదలైనప్పటి నుంచే బాక్సాఫీస్‌పై తన ఆధిపత్యాన్ని చూపింది. పెయిడ్ ప్రివ్యూల ద్వారా 43 కోట్లు సంపాదించింది. మొదటి రోజు 102.55 కోట్లు, రెండో రోజు 80.72 కోట్లు వసూలు చేసింది. మూడో రోజు 113 కోట్లు, నాలుగో రోజు 114.85 కోట్లు, ఐదో రోజు 65 కోట్ల వ్యాపారం చేసింది. ఆరు, ఏడో రోజుల్లో వరుసగా 56.60 కోట్లు, 48.75 కోట్లు సంపాదించింది. 8వ రోజున 49.70 కోట్ల బిజినెస్ చేసింది. మొదటి వారాంతంలో 674.17 కోట్లు, రెండో వారాంతంలో 263.65 కోట్లు, మూడో వారాంతంలో 110.60 కోట్ల వ్యాపారం చేసింది.
77
ధురంధర్ 2 టీమ్ ఇదే
'ధురంధర్: ది రివెంజ్' ఒక స్పై యాక్షన్-థ్రిల్లర్ సినిమా. దీనికి ఆదిత్య ధర్ కథ, దర్శకత్వం అందించారు. జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధర్, లోకేష్ ధర్, జ్యోతి దేశ్‌పాండే ఈ సినిమాను నిర్మించారు. ఇది 2025లో వచ్చిన 'ధురంధర్' సినిమాకు సీక్వెల్. ఇందులో రణ్‌వీర్ సింగ్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్, సారా అర్జున్, రాకేష్ బేడీ, గౌరవ్ గెరా, డానిష్ పండోర్, మానవ్ గోహిల్ ప్రధాన పాత్రల్లో నటించారు. 26/11 దాడులకు ప్రతీకారం తీర్చుకోవడానికి కరాచీలోని క్రిమినల్ గ్యాంగ్‌లు, పాకిస్తానీ రాజకీయాల్లోకి చొరబడిన ఒక భారతీయ ఇంటెలిజెన్స్ ఏజెంట్ కథ ఇది. ఏజెంట్‌గా రణ్‌వీర్ సింగ్ అదరగొట్టారు.