Naga Chaitanya: నాగ చైతన్యకు పరువు సమస్య... కొంచెం అటూ ఇటూ అయితే సమంతకు లోకువైపోడు! 

Published : Apr 29, 2022, 03:32 PM IST

ఈ ఏడాది తన బర్త్ డే భర్త లేకుండా జరుపుకుంది సమంత. కోరి చేసుకున్న నాగ చైతన్య ఇప్పుడు మాజీ ఐపోయాడు. బలమైన కారణంగా పెద్ద గొడవ జరిగి విడిపోయిన ఈ జంట మధ్య ఇంకా అగ్గి చల్లారలేదు. దానికి సమంత సోషల్ మీడియా పోస్ట్స్ రుజువు.

PREV
16
Naga Chaitanya: నాగ చైతన్యకు పరువు సమస్య... కొంచెం అటూ ఇటూ అయితే సమంతకు లోకువైపోడు! 

విడాకుల ప్రకటన చేసి ఆరు నెలలు దాటిపోయినా సమంత, చైతూ(Naga Chaitanya)ల గొడవ వేడిగానే ఉంది. ఇటీవల సమంత నా సహనాన్ని పరీక్షించవద్దు, మౌనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దంటూ ఓ వార్నింగ్ నోట్ పోస్ట్ చేసింది. ఆ ఇండైరెక్ట్ వార్నింగ్ నాగ చైతన్యను లేదా ఆయన ఫ్యాన్స్ ని ఉద్దేశించేనని సోషల్ మీడియాలో టాక్ నడిచింది.

26
Dhootha-Naga Chaitanya

ఇదిలా ఉంటే డివోర్స్ తర్వాత ఇద్దరు కెరీర్ ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. సమంత(Samantha), చైతూ పలు ప్రాజెక్ట్స్ కి సైన్ చేశారు. నాగ చైతన్య నటిస్తున్న ప్రాజెక్ట్స్ లో దూత ఆయనకు చాలా ప్రత్యేకం. అలాగే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. దూత వెబ్ సిరీస్ కాగా దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. నాగ చైతన్య ఫస్ట్ డిజిటల్ సిరీస్ దూత కావడం మరొక విశేషం.

36
Dhootha-Naga Chaitanya

అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తున్న ఈ సిరీస్ సక్సెస్ చైతన్యకు చాలా అవసరం. పరువుతో కూడుకున్న మేటర్. కారణం తన మాజీ భార్య సమంత డెబ్యూ వెబ్ సిరీస్ సూపర్ సక్సెస్ కొట్టింది. ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ లో సమంత నటించారు. దర్శకులు రాజ్ అండ్ డీకే టెర్రరిజం నేపథ్యంలో సాగే పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. దేశవ్యాప్తంగా ది ఫ్యామిలీ మాన్ 2 (The Family Man 2) సిరీస్ సక్సెస్ సాధించింది. సమంత ఇమేజ్ మరో మెట్టుకు తీసుకెళ్లింది.

46
Dhootha-Naga Chaitanya

దూత (Dhootha) సైతం అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్స్ గా రూపొందుతోంది. దూత క్రైమ్ థ్రిల్లర్ అని తెలుస్తుండగా, సమంత మాదిరి నాగ చైతన్య నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తున్నారు. తాజాగా దూత ఫస్ట్ లుక్ విడుదల చేశారు. నాగ చైతన్య ఇంటెన్స్ లుక్ ఆకట్టుకుంది. సో దూత సిరీస్ తో నాగ చైతన్య ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందనేది ప్రాధానత్య సంతరించుకుంది. 
 

56
Dhootha-Naga Chaitanya

ది ఫ్యామిలీ మాన్ 2 రేంజ్ సక్సెస్ ఆశించడం అత్యాశే అవుతుంది. దూత కనీసం సక్సెస్ టాక్ తెచ్చుకున్నా సమంత ముందు నాగ చైతన్య పరువు నిలబడినట్లే. అందుకే నాగ చైతన్య ఈ సిరీస్ ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని సమాచారం. దూత సిరీస్ తో డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో తన మార్క్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు.

66
Dhootha-Naga Chaitanya


దూత సిరీస్ తో పాటు థాంక్యూ చిత్రానికి విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. దూత కారణంగా థాంక్యూ మూవీపై ఆయన ఫోకస్ తగ్గిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. షూటింగ్ పూర్తయినా... నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసి విడుదల చేయాలనే ప్రయత్నాలు చేయడం లేదట. మొత్తంగా నాగ చైతన్య డెబ్యూ వెబ్ సిరీస్ ఈ స్థాయి విజయం సాధిస్తుందో చూడాలి. 
 

Read more Photos on
click me!

Recommended Stories