దేత్తడి హారిక కన్నీళ్ల వెనక గుండె పగిలే కథ..వింటే ఎమోషనల్‌ అవ్వాల్సిందే!

Published : Oct 16, 2020, 05:39 PM IST

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ 39వ రోజు షో ఆద్యంతం భావోద్వేగభరితంగా సాగింది. ఇంటిసభ్యులకు బిగ్‌బాస్‌ చిన్ననాటి ఫోటోలను చూపించి సర్‌ప్రైజ్‌ చేశారు. దీంతో తమ పాత జ్ఞాపకాలను, జీవితంలో చేదు విషయాలను గుర్తు చేసుకుని ఎమోషనల్‌ అయ్యారు. 

PREV
17
దేత్తడి హారిక కన్నీళ్ల వెనక గుండె పగిలే కథ..వింటే ఎమోషనల్‌ అవ్వాల్సిందే!

అందులో దేత్తడి హారిక లైఫ్‌ ఆద్యంతం కన్నీళ్లు పెట్టిస్తుంది. ఆమె చెప్పిన డైలాగులు తోటి సభ్యుల చేతే కాదు, ఆడియెన్స్ నుంచి కన్నీళ్ళు పెట్టించాయి. 

27

ఈ సందర్భంగా హారిక కదిలించిన ఘటనలు పంచుకుంటూ, జీవితంలో సంతోషం వచ్చినా, బాధ వచ్చినా ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానని తెలిపింది. తాను ఇంటర్‌లో ఉన్నప్పుడు అమ్మ కాల్‌ చేసి, బిడ్డా అమ్మమ్మ ఇంటికి రా అని చెప్పిందట. దీంతో అమ్మమ్మ వాళ్ళింట్లో మటన్‌, చికెన్‌ తినొచ్చని సంబరపడిందట. కాలేజ్‌ అయిపోయిన తర్వాత ఎంతో సంతోషంతో ఇంటికి వెళితే, అమ్మ షాక్‌ ఇచ్చిందట. 

37

ఇకపై డాడీ, నేను కలిసి ఉండాలని అనుకోవడం లేదని, విడిపోతున్నామని, కొన్ని రోజులు అమ్మమ్మ ఉంటానని, తమని డాడీ వద్ద ఉండమని చెప్పిందట. అప్పుడు పెద్దగా బాధ అనిపించలేదట. ఫ్రెండ్స్ తో తిరుగుతుండటంతో ఆ బాధ తెలియలేదట. కారు, డ్రైవర్‌, ట్రిబుల్‌ బెడ్‌ రూం, తన ఒక్కదానికి సపెరేట్‌గా డిజైన్‌ చేయించిన బెడ్‌ ఉండేది. ఏది కావాలంటే అది వచ్చేదట. తల్లిదండ్రులు విడిపోయినప్పుడు వాళ్ళమ్మ కేవలం బ్యాగ్‌, పదివేలు మాత్రమే తీసుకుని వచ్చిందట. బంగారం, క్రెడిట్‌ కార్డ్ ఏదీ తీసుకోలేదట. ఆ బ్యాగ్‌తో బయటకు వచ్చిన అమ్మ ఇప్పటి వరకు ఏనాడు వెనక్కి తిరిగి చూడలేదని తెలిపింది. 
 
47

`కొన్ని రోజుల తర్వాత అన్నయ్య అమ్మమ్మ వాళింటికి వెళ్లిపోడు. నేను డాడీ వద్దే ఉన్నా. నాన్న ఉదయం వెళితే రాత్రికి వచ్చేవారు. అమ్మమ్మ ఫోన్‌ చేసి తిన్నావా అని అడిగేది. సమ్మర్‌లో ఆవకాయ పచ్చడి మాత్రమే ఉండేదని, అది తినడం వల్ల గ్యాస్‌ ఫామ్‌ అయి రాత్రి మూడు గంటలకు నొప్పి వచ్చేసింది. నా బైక్‌ మీదే డాక్టర్ దగ్గరకు పోయి ట్రీట్ మెంట్ చేయించుకున్నా. అప్పుడు అమ్మ నన్ను తన వద్దకి రమ్మని చెప్పింది. ఆ సమయంలో అమ్మ ఎంతో కష్టపడి మమ్మల్ని పెంచింది. ఆమె లేకపోతే మేం చనిపోయేవాళ్ళం` అని చెప్పి ఎమోషనల్‌ అయ్యింది. 

57

`బిగ్‌బాస్‌కి వచ్చే ముందు ఇచ్చిన ఫామ్‌లో డాడీ పేరు రాసేటప్పుడు రెండు మూడు సెకన్లు ఆలోచించా. ఆయన పేరు మర్చిపోయా. అప్పుడు అనుకున్నా. ఈ ఐదేళ్లలో డాడీ.. నీ దగ్గర నుంచి చాలా దూరం వచ్చేశాం. మీరు ఎప్పుడూ తిరిగి చూడలేదు. మీమూ తిరిగి చూడలేదు. తిరిగి చూసిన రోజున మేం ఆగిపోతాం. అందుకే మేం తిరగం.. నువ్వు ఎక్కడ ఉన్నా మేం ప్రేమిస్తూనే ఉంటాం, హెల్తీగా ఉండండి` అని చెప్పి సభ్యులచేత కన్నీళ్ళు పెట్టించింది. 

67

ఇంకా హారిక చెబుతూ, `మమ్మీ.. మా అన్నయ్యలు చూడట్లేదు.. మా అమ్మ పట్టించుకోవడం లేదు అన్న ప్రతిసారి చెప్తూనే ఉన్నా. ఇప్పుడు కూడా చెప్తున్నా. నీకు నేను, అన్నయ్య ఉన్నాం. మా ఇద్దరికీ నువ్వు ఉన్నావ్‌. మన ముగ్గురుకి మన ముగ్గురమే. నువ్వు లేని రోజు నేను లేను` అని మరింత ఎమోషనల్‌ అయ్యింది. 

77

అన్నయ్య గురించి చెబుతూ, అన్నయ్య మొదట్లో అల్లరిగా ఉండేవాడని, నాన్న నుంచి దూరమయ్యాక తను బాధ్యత తీసుకున్నాడని, మా కో్సం చిన్న వయసులో ఎంతో కష్టపడ్డాడని తెలిపింది. అందుకే తన ఫోన్‌లో అన్నయ్య పేరు `బ్రో@డాడీ` అని ఉంటుంది. అన్నయ్య వల్ల నాకు ఫాదర్ లేని లోటు తెలియలేదు. నేను ట్రబుల్‌లో ఉన్న ప్రతిసారి నన్ను అందులో నుంచి తీసుకుని వస్తావ్.. అన్నయ్య నా బ్యాక్ బోన్` అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది. దీంతో సభ్యులంతా చాలా ఎమోషనల్‌ అయిపోయారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories