షణ్ముఖ్ తో బ్రేకప్‌పై ఫస్ట్ టైమ్‌ స్పందించిన దీప్తి సునైనా .. రోబోలా మారిపోయానంటూ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్

Published : Feb 14, 2023, 09:35 AM ISTUpdated : Feb 14, 2023, 11:37 AM IST

బిగ్‌ బాస్‌ ఫేమ్‌ షణ్ముఖ్‌ జస్వంత్‌, దీప్తిసునైనా తమ లవ్‌ స్టోరీకి బ్రేకప్‌ చెప్పుకుని ఏడాది దాటింది. తాజాగా దీనిపై దీప్తిసునైనా స్పందించింది. ఓ ఇంట్రెస్టింగ్‌, షాకింగ్‌ కామెంట్‌ చేసింది. 

PREV
15
షణ్ముఖ్ తో  బ్రేకప్‌పై ఫస్ట్ టైమ్‌ స్పందించిన దీప్తి సునైనా ..  రోబోలా మారిపోయానంటూ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్

యూట్యూబ్‌ ద్వారా పాపులర్‌ అయ్యారు షణ్ముఖ్‌, దీప్తి సునైనా. వీడియో సాంగ్‌లు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. యూట్యూబ్‌ స్టార్స్ గా రాణిస్తున్నారు. దీంతోపాటు దాదాపు ఐదేళ్లుగా ఈ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. ఓ వైపు డాన్సు వీడియోలు చేస్తూ, మరోవైపు ప్రేమ పాఠాలు చెప్పుకుంటూ తమ బాండింగ్‌ని బలంగా మార్చుకుంటూ వచ్చారు. 

25

బిగ్‌ బాస్‌రెండో సీజన్‌లో దీప్తి సునైనా కంటెస్టెంట్‌గా పాల్గొని పాపులర్‌ అయ్యింది. ఆ ఐదో సీజన్‌లో షణ్ముఖ్‌ పాల్గొన్నారు. కానీ షణ్ముఖ్‌ బిగ్‌ బాస్‌ షో ని పూర్తి చేసుకుని బయటకు వచ్చాక అనూహ్యంగా ఆయనకు బ్రేకప్‌ చెప్పింది దీప్తి సునైనా. షాకిచ్చేలా వీరి బ్రేకప్‌ జరిగింది. అయితే దీనిపై షణ్ముఖ్‌ దీప్తిని రాజీకుదిర్చే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేదు. ఆమె ఎందుకు బ్రేకప్‌ చెప్పిందనేది మాత్రం సస్పెన్స్. కానీ బిగ్‌ బాస్‌ షోలో షణ్ముఖ్‌ ప్రవర్తన విషయంలో, అలాగే సిరితో వ్యవహరించిన తీరు విషయంలో ఆమె హర్ట్ అయినట్టు, అందుకే బ్రేకప్ చెప్పినట్టు బయట చర్చ నడుస్తుంది. 

35

ఇదిలా వీరిద్దరు బ్రేకప్‌ చెప్పుకుని ఏడాదిపైనే అవుతుంది. తాజాగా సోషల్‌ మీడియాలో అభిమానులతో చాట్‌ చేసింది దీప్తి. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు సమాధానం చెప్పింది. అయితే షణ్ముఖ్‌తో బ్రేకప్‌ విషయంచర్చకు వచ్చింది. ఓ నెటిజన్‌ ఆమెని బ్రేకప్‌ తర్వాత ఎలా ఉందనే ప్రశ్న సందించారు. బ్రేకప్‌ తర్వాత మీలో వచ్చిన మార్పేంటి ? అని తన ఫాలోవర్‌ ప్రశ్నించగా, దీనికి దీప్తి స్పందించింది. ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌ చేసింది. 
 

45

ఆమె ఈ ప్రశ్నకి రియాక్ట్ అవుతూ, రోజు రోజుకి రోబోలా తయారవుతున్నా అంటూ ఆన్సర్‌ ఇచ్చింది. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. `ఒక వ్యక్తిని మీ జీవితంలోకి ఆహ్వానించాలంటే అతనిలో ఏం చూస్తారనే ప్రశ్నకి దీప్తి స్పందిస్తూ, `నన్ను నవ్విస్తే చాలు` అని చెప్పడం విశేషం. దీంతో ఇది చర్చనీయాంశం అవుతుంది. షణ్ముఖ్‌ తనని బాగా నవ్వించే వాడని, ఇప్పుడు ఆ నవ్వు లేక రోబోలా వర్క్ చేసుకుంటూ వెళ్తుందా అనే అభిప్రాయాన్ని నెటిజన్లు పంచుకుంటున్నారు. అంతేకాదు మళ్లీ కలవాలని కోరుకుంటున్నారు. 
 

55

మరి అభిమానుల కోరికని నెరవేరుస్తారా? అనేది చూడాలి. ఇటీవల ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఇద్దరు ఒకరినొకరు చూసుకుని స్మైల్‌ ఇచ్చుకోవడం హాట్‌ టాపిక్‌ అయిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం షణ్ముఖ్‌, దీప్తి ఎవరికి వారు కెరీర్‌ పరంగా బిజీగా ఉన్నారు. ఇద్దరు వీడియో సాంగ్స్ చేస్తున్నారు. షణ్ముఖ్ హీరోగా `ఏజెంట్‌ ఆనంద్‌ సంతోష్‌` అనే ఆహా కోసం వెబ్‌ సిరీస్‌ చేస్తున్నాడు. దీప్తి సునైనా సైతం వీడియో సాంగ్‌లతో బిజీగా ఉంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories