Deepika Padukone: ఆ సీన్స్ చేస్తే తప్పేముంది.. వయస్సుతో సంబంధం లేదన్న దీపికా పదుకొనే

Published : Jan 28, 2022, 09:30 AM IST

బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్లలో ఇప్పటికీ మంచి ఫామ్ ను మెయింటేన్ చేస్తన్న స్టార్ దీపికా పదుకొనే(Deepika Padukone). రీసెంట్ గా ముద్దు సీన్లతో రెచ్చిపోయిన బ్యూటీ.. వాటిగురించి ఫ్యాన్స్ కు క్లారిటీ ఇచ్చింది.

PREV
17
Deepika Padukone: ఆ సీన్స్ చేస్తే తప్పేముంది..  వయస్సుతో సంబంధం లేదన్న దీపికా పదుకొనే

బాలీవుడ్ లో ఇప్పటికీ భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోయిన్ లలో  దీపికా పదుకొనె(Deepika Padukone) ముందు వరుసలో ఉంది. ఈ బాలీవుడ్ బ్యూటీ క్వీన్ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ సినిమాల్లో కూడా  దీపికా పదుకునే తన సత్తా చాటుకుంటోంది. ఇటు బాలీవుడ్ లో కూడా ఇప్పటికీ వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది హాట్ బ్యూటీ.

27

ప్రస్తుతం దీపికా పదుకొనె(Deepika Padukone)  లీడ్ రోల్ చేసిన సినిమా గెహ్రైయాన్ రిలీజ్ కు రెడీగా ఉంది.  ఈ మూవీ ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవ్వబోతోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈమూవీ ట్రైలర్ లో దీపికా ఇంటిమేట్ సీన్లలో రెచ్చిపోయి నటించింది. ఈ సీన్స్ చూసిన ఫ్యాన్స్ షాక్ కి గురయ్యారు. దీపికా(Deepika Padukone) ఏంటి ఇలా రెచ్చిపోయింది అనే చర్చ ఇండస్ట్రీలో గట్టిగా నడిచింది.  

37

గెహ్రైయాన్ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ తో పాటు.. సాంగ్ లో దీపికా పదుకొనె (Deepika Padukone) సెగలు పుట్టించేలా యంగ్ స్టార్ సిద్ధాంత్ చతుర్వేదితో బెడ్ సీన్స్, లిప్ లాక్ సన్నివేశాల్లో రెచ్చిపోయింది. దీపికా పదుకొనె(Deepika Padukone) ఈ రేంజ్ లో రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోవడం ఇదే తొలిసారి కావడంతో అంతట ఇదే చర్చ జరుగుతుంది.

47

దీపికా(Deepika Padukone)కి పెళ్ళి కాకుముందు ఇలాంటి సీన్స్ చేసి ఉంటే అందరు ఇంతలా ఆశ్చర్యపోయేవారు కాదేమో. కాని యంగ్ స్టార్ రణ్ వీర్ సింగ్ తో పెళ్లి తరువాత కూడా ఈ బ్యూటీ.. ఈ రేంజ్ లో రొమాన్స్ లో రెచ్చిపోవడంపై ఆమె అభిమానులు కొందరు హార్ట్ అవుతున్నారు. పెళ్లి తర్వాత మరీ ఈ స్థాయిలో రొమాన్స్ చేయడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. అయితే మరికొందరు అభిమానులు మాత్రం దీపిక(Deepika Padukone)కు సపోర్ట్ చేస్తున్నారు.

57

ఈ విషయం గురించి దీపికా పదుకొనే(Deepika Padukone) రీసెంట్ గా ఓ నేషనల్ ఛానెల్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.  వృత్తిగా ఉన్న నటనలో భాగంగా చూడకుండా ఇలాంటి ఆలోచనలు చేయడం ఉంటీ అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని వేరే వేరు కోణంలో చూడవద్దు అన్నారు. అంతే కాదు. కథ డిమేండ్ చేస్తే ఇటువంటి సన్నివేశాలు చేయడానికి .. ముందు ముంద కూడా రెడీగా ఉన్నట్టు చెప్పారు దీపికా (Deepika Padukone). ముద్దు సీన్లు చేయడానికి వయస్సుతో సంబంధం ఏంటీ అని ప్రశ్నించారు దీపికా.

67

ఇక ఈ మూవీ దర్శకుడు శకున్ కు కితాబిచ్చారు దీపికా(Deepika Padukone). డైరెక్టర్ హాట్ సిన్ కావాలని ఈ సినిమాలో ఇలాంటి సన్నివేశాలు పెడితే.. వెంటనే రిజెక్ట్ చేసేదాన్ని అన్నారు దీపికా. ఈ కథ విన్న తరువాత.. ఆ కథకు తగ్గట్టు.. ఇలాంటి సన్నివేశాలు అవసరం కాబట్టే చేశాను అన్నారు దీపికా. ఈ విషయంలో దర్శకుడు అన్ని రకాలుగా తమ సెక్యూరిటీ గురించి ఆలోచించారన్నారు బాలీవుడ్ సీనియర్ స్టార్.

 

77

ఏదీ ఏమైనా ఇప్పుడు దీపికా హాట్ రోమాంన్స్.. ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారి తీస్తుంది. ఈ విషయంలో రణ్ వీర్ ఎలా స్పందిస్తాడో అన్న ఆలోచనల్లో ఉన్నారు కొందరు. ఇక ప్రస్తుతం బాలీవుడ్ మూవీస్ తో పాటు టాలీవుడ్ నుంచి తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ సినిమాలో ప్రభాస్ జోడీగా నటిస్తోంది దీపికా పదుకొనే(Deepika Padukone).  

Read more Photos on
click me!

Recommended Stories