Deepika Padukone: కోవిడ్ దీపికా పదుకొనే జీవితాన్నే మార్చేసిందట.. ఎంత నష్టం జరిగిందో తెలుసా....?

Published : Jan 08, 2022, 12:39 PM ISTUpdated : Jan 08, 2022, 03:28 PM IST

కరోనా ప్రతీ వేవ్ లో ఫిల్మ్ సెలెబ్రిటీలు బాగా సఫర్ అయ్యారు. ప్రస్తుతం కూడా చాలామంది స్టార్స్ కరోనాతో ఇబ్బంది పడుతున్నారు. లాస్ట్ టైమ్ కరోనాతో ఇబ్బంది పడ్డ బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే తన భయంకరమైన అనుభావాలు పంచుకుంది.

PREV
16
Deepika Padukone: కోవిడ్ దీపికా పదుకొనే జీవితాన్నే మార్చేసిందట.. ఎంత నష్టం జరిగిందో తెలుసా....?

కరోనా ప్రతీ వేవ్ లో ఫిల్మ్ సెలెబ్రిటీలు బాగాసఫర్ అయ్యారు. ప్రస్తుతం కూడా చాలామంది స్టార్స్ కరోనాతో ఇబ్బంది పడుతున్నారు. లాస్ట్ టైమ్ కరోనాతో ఇబ్బంది పడ్డ బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే తన భయంకరమైన అనుభావాలు పంచుకుంది. మహా మహులనే ఏడిపిస్తుంది కరోనా. ఎంత పెద్ద స్టార్స్ అయినా.. దానికి బలై పోవాల్సిందే. లాస్ట్ రెండు కరోనా వేవ్స్ లో చాలా మంది స్టార్స్ సఫర్ అయ్యారు. కొంత మంది మరణించారు కూడా. అయితే కరోనా వల్ల చాలా మంది స్టార్స్ హెల్త్ పరంగా ఇబ్బందులు పడ్డారు. అందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే(Deepika Padukone) కూడా ఒకరు.  

26

కరోనాతో పోరాడిన వారులో దీపికా పదుకోనే (Deepika Padukone) కూడా ఉన్నారు. లాస్ట్ ఇయర్ దీపికాతో పాటు ఆమె తల్లి,తండ్రీ,సోదరి తో కలిసి ఫ్యామిలీ అంతా కరోనాకు ఎఫెక్ట్ అయ్యారు. రీసెంట్ గా తన కరోనా అనుభవాలు గుర్తు చేసుకున్నారు దీపికా. వాటిని భయంకరమైనరోజులుగా వర్ణించారు ఆమె. కరోనా తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందంటుంది దీపికా.

36

కరోనా తరువాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయన్నారు దీపికా(Deepika Padukone). మహామ్మారి తనను అటాక్ చేసిన తరువాత శరీరంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయట. కరోనా కోసం వాడిన  మందులు, స్టెరాయిడ్స్ తన బాడీని చాలా ప్రభావితం చేశాయంటుంది దీపికా. దాని వల్ల తాను గుర్తు పట్టలేనంతగా మారిపోయానంటోంది. అంతే కాదు అది తన మెదడును కూడా ప్రభావితం చేసిందన్నారు

46

కోవిడ్ చాలా భయంకరమైనది. అది శరరీంతో పాటు మెదడును.. ఆలోచనలను కూడా ప్రభావితం చేస్తుంది. చిత్ర విచిత్రమైన అనుభూతి కలిగిస్తుంది అన్నారు పదుకొనే(Deepika Padukone). అంతే కాదు కరోనా సోకినప్పుడు తనకు పెద్దగా భయం కలగలేదట. దాన్నుంచి బయట పడ్డాక బుర్ర పనిచేయడం మానేసింది.. అందుకే కొన్ని నెలలు షూటింగ్స్ కూడా కాన్సిల్ చుకుని బ్రేక్ తీసుకున్నాను అంటున్నారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్.

56

కోవిడ్ రోజులు తన జీవితంలో క్లిస్టమైన రోజులుగా చెప్పుకుంటున్నారు దీపికా. ఇప్పుడు మొత్తం సెట్ అయ్యి తన లైఫ్ ను హ్యాపీగానే లీడ్ చేస్తుంది. రీసెంట్ గా ప్రభాస్(Prabhas) జోడీగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రాజెక్ట్ కే చేస్తున్నారు దీపికా పదుకోనే(Deepika Padukone). ఆ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో పూర్తి చేసుకున్నారు. వీటితో పాటు దీపికా నటించిన గెహ్రాయాన్ అమెజాన్ లో పిబ్రవరి 11న రిలీజ్ కాబోతోంది. ఈమూవీకి శకున్ బాత్రా డైరెక్టర్.

66

పెళ్ళి తరువాత కూడా హీరోయిన్ గా మంచి ఫామ్ ను మెంటేన్ చేస్తున్నారు దీపికా పదుకొనే (Deepika Padukone). బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ (Ranveer sing )ను పెళ్ళాడి.. మ్యారీడ్ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇటు సినిమాలు కూడా వరుసగా చేసుకుంటూ.. అన్నింటిని బ్యాలన్స్ చేసుకుంటున్నారు దీపికా. తన జీవితంలో జరిగిన సంఘటనలు చాలా అభిమానులతో పంచుకున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories