అమెరికా అమ్మాయితో ప్రభాస్ పెళ్లి... హాట్ టాపిక్ గా ఏజ్ గ్యాప్?

First Published Mar 1, 2021, 3:01 PM IST

ప్రభాస్ ఫ్యాన్స్ మరియు వాళ్ళ పెదనాన్న కృష్ణం రాజు ఎదురుచూస్తున్న సమయం వచ్చేసిందట. ప్రభాస్ ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కడం ఖాయం అట. అమ్మాయిని కూడా నిర్ణయించగా ప్రభాస్ పెళ్లి విశేషాలు ఇలా ఉన్నాయి. 
 

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ప్రభాస్ వివాహం ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్. ఆయన పెళ్లి గురించి ప్రతి రెండు నెలలకోసారి ఓ న్యూస్ బయటికి వస్తూనే ఉంటుంది. ప్రభాస్ 40ప్లస్ లోకి ఎంటర్ కావడంతో ఈ డిమాండ్ మరింత ఎక్కువైంది.
undefined
బాహుబలి చిత్రం కోసం ఐదేళ్ల సమయం కేటాయించిన ప్రభాస్... విడుదల వెంటనే పెళ్లి చేసుకుంటారని అందరూ భావించారు. 2017లో బాహుబలి 2 విడుదల కాగా... మరో నాలుగేళ్లు గడిచిపోయాయి.
undefined
అప్పట్లో ప్రభాస్, అనుష్క రిలేషన్షిప్ లో ఉన్నారని, వారు పెళ్లి చేసుకోవడం లాంఛనమే అన్న పుకార్లు చెలరేగాయి. పలు సందర్భాల్లో అనుష్క, ప్రభాస్ లకు ఈ ప్రశ్న ఎదురైంది. అయితే ప్రతిసారి వీరిద్దరు తిరస్కరించారు.

Anushka, prabhas

కాగా 2021లో ప్రభాస్ పెళ్లి పీటలెక్కడం అనివార్యం అంటున్నారు కొందరు. ప్రభాస్ సన్నితుల నుండి విశ్వసనీయ సమాచారం అందిందని, అమ్మాయి కూడా సిద్దంగానే ఉన్నారని వార్తలు వస్తున్నాయి.
undefined
అమెరికాలో సెటిల్ అయిన తెలుగు ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని, ప్రభాస్ కోసం నిశ్చయించారట. ఇక అమ్మాయి అమెరికాలో చదువుకుంటున్నారట. ఆమె వయసు 25ఏళ్ళు అని చెవుతున్నారు.
undefined
కృష్ణం రాజు కుటుంబానికి సన్నిహితులైన వారి కుటుంబానికి  సంబందించిన అమ్మాయని అంటున్నారు. ఐతే ప్రచారం అవుతున్నట్లు ఆ అమ్మాయి వయసు 25ఏళ్ళు అయితే.. చాలా ఏజ్ గ్యాప్ ఉన్నట్లు అవుతుంది.
undefined
ప్రభాస్ ప్రస్తుత వయసు 41... అనగా ఆ అమ్మాయికంటే ప్రభాస్ 16ఏళ్ళు పెద్దవాడవుతాడు. అవన్నీ కావు మా బాస్ కి పెళ్లి కావడమే ముఖ్యం అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Anushka, prabhas

మరో వైపు ప్రభాస్ ఏకంగా నాలుగు చిత్రాలు పూర్తి చేయాల్సి ఉంది. రాధే శ్యామ్, సలార్ మరియు ఆదిపురుష్ చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.

Anushka, prabhas

వీటి తరువాత దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్న చిత్ర షూటింగ్ లో ప్రభాస్ పాల్గొనాల్సి ఉంది. ఇవన్నీ పాన్ ఇండియా చిత్రాలుగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.
undefined
click me!