బ్రహ్మానందం బహుముఖ ప్రజ్ఞాశాలి. వృత్తిరీత్యా లెక్చరర్ అయిన బ్రహ్మానందం థియేటర్, మిమిక్రీ ఆర్టిస్ట్ కూడాను. అలాగే రచయిత, చిత్రకారుడు. చిరంజీవి సినిమా షూటింగ్ చూసేందుకు వెళ్లిన బ్రహ్మానందం విచిత్రమైన ముఖ కవళికలతో చిరంజీవిని చూస్తూ ఆయన కంట్లో పడ్డాడు.
జంధ్యాల బ్రహ్మానందం కి వెండితెరకు పరిచయం చేశాడు. చిరంజీవితో చేసిన కామెడీ చిత్రం చంటబ్బాయి మూవీలో చిన్న పాత్ర చేశాడు. 1987లో విడుదలైన అహ నా పెళ్ళంట మూవీతో బ్రహ్మానందం వెలుగులోకి వచ్చాడు. జంధ్యాల తెరకెక్కించిన ఈ సినిమాలో పిసినారి కోటా శ్రీనివాసరావు ఇంట్లో పనివాడిగా బ్రహ్మానందం చేసిన పాత్ర చిరస్థాయిగా నిలిచిపోయింది.