The Odyssey: ఇండియాకు రానున్న వరల్డ్ ఫేమస్ డైరెక్టర్.. ముంబైలో 'ది ఒడిస్సీ' గ్రాండ్ ప్రీమియర్ షో

Published : Jun 17, 2026, 07:50 PM IST

ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ది ఒడిస్సీ' సినిమాతో చరిత్ర సృష్టించబోతున్నాడు. ఈ సినిమా ఇండియా ప్రీమియర్‌ను ముంబైలో నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్త విడుదలకు ముందే నోలన్ ఈ ప్రత్యేక ప్రదర్శనకు హాజరుకానున్నారు.

PREV
13
క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన 'ది ఒడిస్సీ'

క్రిస్టోఫర్ నోలన్ చిత్రం 'ది ఒడిస్సీ' ఇండియా ప్రీమియర్ ఈ జులైలో ముంబైలో జరగనుంది. జులై 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాకముందే, ముంబైలోని ఫీనిక్స్ పల్లాడియంలో ఉన్న పివిఆర్ ఐకాన్ ఐమాక్స్ థియేటర్‌లో ఈ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి దర్శకుడు నోలన్‌తో పాటు, ఒడిస్సియస్ పాత్రధారి మ్యాట్ డామన్, టెలిమాకస్ పాత్రలో నటించిన టామ్ హాలండ్ కూడా వస్తున్నారు. నిర్మాత ఎమ్మా థామస్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. నోలన్ సినిమాకి ఇండియాలో అధికారికంగా ప్రీమియర్ జరగడం ఇదే మొదటిసారి. ఇది ఆయన అభిమానులకు పెద్ద పండగే.

23
గ్రీకు ఇతిహాసం 'ది ఒడిస్సీ' ఆధారంగా..

ఈ సినిమా కథ, హోమర్ రచించిన గ్రీకు ఇతిహాసం 'ది ఒడిస్సీ' ఆధారంగా తెరకెక్కింది. ట్రోజన్ యుద్ధం తర్వాత, ఇథాకా రాజు ఒడిస్సియస్ పదేళ్లపాటు తన ఇంటికి తిరిగి రావడానికి చేసే ప్రమాదకర ప్రయాణమే ఈ కథ. ఈ ప్రయాణంలో అతను ఎన్నో ప్రమాదకరమైన జీవులను, బలమైన శత్రువులను ఎదుర్కొంటాడు.

మరోవైపు, ఒడిస్సియస్ చనిపోయాడని భావించిన కొందరు, రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. వారి నుంచి తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఒడిస్సియస్ భార్య పెనెలోప్, కొడుకు టెలిమాకస్ పోరాడుతుంటారు. ప్రముఖ అనువాదకురాలు ఎమిలీ విల్సన్ చేసిన అనువాదం స్ఫూర్తితో నోలన్ ఈ కథకు కొత్త వెర్షన్ రాసుకున్నారని సమాచారం.

33
నోలన్ కెరీర్‌లోనే సాంకేతికంగా ఓ పెద్ద ప్రయోగం

ఈ సినిమాలో భారీ తారాగణం ఉంది. ఒడిస్సియస్‌గా మ్యాట్ డామన్, పెనెలోప్‌గా ఆన్ హాత్వే, టెలిమాకస్‌గా టామ్ హాలండ్ ప్రధాన పాత్రలు పోషించారు. వీరితో పాటు జెండయా (ఎథీనా), రాబర్ట్ ప్యాటిన్సన్ (ఆంటినస్), చార్లీజ్ థెరాన్ (కాలిప్సో), సమంత మోర్టన్ (సిర్స్), మియా గోత్ (మెలాంతో) వంటి ప్రముఖ నటులు ఉన్నారు.

ఇంకా లుపిటా న్యోంగో, జో బెర్న్‌తల్, బెన్నీ సఫ్డీ, హిమేష్ పటేల్, ఇలియట్ పేజ్, షిలో ఫెర్నాండెజ్, మారిస్ కాంప్టే కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. సినిమాటోగ్రాఫర్ హోయ్టే వాన్ హోయ్టెమా ఈ 172 నిమిషాల సినిమాను పూర్తిగా ఐమాక్స్ కెమెరాలతోనే చిత్రీకరించారు. ఇది నోలన్ కెరీర్‌లోనే సాంకేతికంగా ఓ పెద్ద ప్రయోగం. ప్రేక్షకులకు థియేటర్‌లో అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories