sankranti 2023 : మహేష్, చరణ్, చిరు, పవన్, ప్రభాస్ సంక్రాంతికి డిజాస్టర్స్ రుచి చూసిన హీరోలు

First Published Jan 14, 2023, 2:38 PM IST

చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్, మహేష్ బాబు.. ప్రభాస్, ఎన్టీఆర్.. ఇలా స్టార్ హీరోలందరికి సంక్రాంతి మంచి సెంటిమెంట్. కాని ఈ సంక్రాంతి సెంటిమెంట్ రివర్స్ అయ్యి.. డిజాస్టర్స్ కూడా ఫేస్ చేశారు స్టార్ హీరోలు. అందులో కొన్నింటి గురించిమాత్రమే  ఇప్పుడు చూద్దాం. 
 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,  బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా  వినయ విధేయ రామ. ఈ సినిమా 2019 సంక్రాంతికి భారీ అంచనాలతో రిలీజ్ అయిన సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. కియార అద్వాని ఈ సినిమా తరువాత చాలా కాలం టాలీవుడ్ వైపు చూడలేదు కూడా. అలా రామ్ చరణ్ సంక్రాంతికి గట్టి దెబ్బ తిన్నాడు. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా.. అది కూడా మాటల మాత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన సినిమా.. సంక్రాంతి కానుకగా వచ్చి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది అజ్ఞాతవాసి మూవీ. త్రివిక్రమ్ దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ హీరోగా  జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించగా.. అజ్ఞాతవాసి  సినిమా మాత్రం భారీ హైప్ తో రిలీజ్ అయ్యి..అతిపెద్ద సంక్రాంతి డిజాస్టర్ గా నిలిచింది.

మహేష్ బాబు కెరీర్ లోనే డిఫరెంట్ మూవీ అంటే అది వన్ నేనొక్కడినే అని చెప్పాలి. టాలీవుడ్ లెక్కల మాస్టరు  సుకుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ఈసినిమా..  2014 సంక్రాంతికి రిలీజ్ అయ్యింది. మహేష్ కెరీర్ లో సంక్రాంతి డిజాస్టర్ గా  నిలిచిపోయింది. అయితే ఈ సినిమా నచ్చిన ఆడియన్స్ కూడా లేకపోలేదు. ఈ  సినిమా దెబ్బతో టాలీవుడ్ వైపు మళ్లీ చూడలేదు హీరోయిన్ కృతి సనన్. 

చిరంజీవి నటించిన మంచు పల్లకి, అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు, దొంగ మొగుడు వంటి అనేక చిత్రాలు యండమూరి వీరేంద్రనాధ్ నవలల ఆధారంగా తెరకెక్కడం జరిగింది.

గుణశేఖర్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి  హీరోగా వచ్చిన మృగరాజు సినిమా  2001 సంక్రాంతికి విడుదలై డిజాస్టర్ గా నిలిచింది. ఇక మెగాస్టార్ చిరంజీవి మరో సినిమా  అంజి కూడా అంతే. కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసి ఈ సినిమా డిజాస్టర్స్ లిష్ట్ లోకి వెళ్ళిపోయింది. 

యంగ్ ఎన్టీఆర్-పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ఆంధ్రావాలా సినిమా 2004 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది. మాస్ యాంగిల్.. తండ్రీ కోడుకులుగా ఎన్టీఆర్ నటించిన ఈమూవీ ఆడియన్స్ కు అస్సలు నచ్చలేదు. దాంతో సంక్రాంతికి రిలీజ్ అయిన   ఓ డిజాస్టర్ గా మిగిలింది. 
 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన  యోగి కూడా సంక్రాంతి డిజాస్టరే. 2007 సంక్రాంతికి విడుదలైన ప్రభాస్ యోగి ప్లాప్ గా నిలిచింది.  వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన యోగి బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా బోల్తా కొట్టింది. 
 

ఇక నటసింహం బాలయ్య బాబు నటించి వరుస మూడు నాలుగు సినిమాలు సంక్రాంతి డిజాస్టర్స్ అయ్యాయి. అయినా ఆయన సంక్రాంతి సెంటిమెంట్ ను పోనివ్వడు.  వైవీ ఎస్ చౌదరి డైరక్ట్ చేసిన :ఒక్క మగాడు సినిమా 2008 లో రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది. ఆరతువాత 2011 వచ్చిన పరమవీరచక్ర కూడా ప్లాప్ అయ్యింది. ఇక ఆతరువాత 2016 లో వచ్చిన డిక్టెటర్ కూడా  డిజాస్టర్ అయ్యింది. ఇలా సంక్రాంతికి సూపర్ హిట్లతో పాడు డిజాస్టర్స్ కూడా చూడాలి వచ్చిది మన హీరోలు.

click me!