చిన్న కూతురు శ్రీజ కష్టాల గురించి తొలిసారి చిరంజీవి కామెంట్స్, ఎవడో ఒక్కడి వల్ల ఆగిపోవద్దు

Published : Mar 08, 2025, 09:06 AM IST

Mega Family Women's Day Special: ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన తల్లి అంజనమ్మ, సోదరుడు నాగబాబు, చెల్లెల్లు మాధవి, విజయ్ దుర్గ లతో కలసి చిరంజీవి ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

PREV
14
చిన్న కూతురు శ్రీజ కష్టాల గురించి తొలిసారి చిరంజీవి కామెంట్స్, ఎవడో ఒక్కడి వల్ల ఆగిపోవద్దు
Chiranjeevi Daughter Sreeja

Mega Family Women's Day Special: ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన తల్లి అంజనమ్మ, సోదరుడు నాగబాబు, చెల్లెల్లు మాధవి, విజయ్ దుర్గ లతో కలసి చిరంజీవి ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. పిల్లలందరిని అంజనమ్మ ఎలా పెంచి పోషించారు, కష్టాలో ఎలాంటి సలహాలు ఇచ్చారు అనే విషయాలు ఈ ఇంటర్వ్యూలో చర్చకి వచ్చాయి. 

 

24

తన పిల్లలందరిలో అమ్మకి నాగబాబు అంటేనే ఎక్కువ ఇష్టం అని చిరంజీవి అన్నారు. ఇప్పటికీ నాగబాబుని దగ్గరకి తీసుకుని ముద్దు పెడుతూ ఉంటుందట. ఇక కుమార్తెలు విజయ దుర్గ, మాధవి కూడా అంజనమ్మపై ప్రశంసలు కురిపించారు. ఎలాంటి కష్టాలు ఎదురైనా అమ్మ మాలో స్ఫూర్తిని నింపేది. తన జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు నీ సమస్యని నువ్వే పరిష్కరించుకోవాలి. లేకుంటే నీ గౌరవం పోతుంది అని అమ్మ చెప్పే మాటలు ఇన్స్పైరింగ్ గా అనిపించినట్లు విజయ దుర్గ అన్నారు. 

 

34

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తన వైవాహిక జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులు కూడా చర్చకి వచ్చాయి. చిరంజీవి మాట్లాడుతూ శ్రీజ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ఆ టైంలో శ్రీజ నానమ్మ దగ్గర సలహాలు తీసుకుంది. నానమ్మ మాటలు వింటే ఎంతో పాజిటివ్ గా అనిపిస్తుంది అని శ్రీజ చెప్పింది. 

 

44
Sreeja Konidela

ఎవడో ఒకడి వల్ల నీ జీవితం ఆగిపోకూడదు. నీవు అనుకున్నది చేయాలి, జీవితంలో ముందుకు సాగాలి అని అంజనమ్మ శ్రీజకు ఇచ్చిన సలహాల గురించి చిరంజీవి వివరించారు. శ్రీజ ప్రేమించి పెళ్లి చేసుకుని మొదటి భర్త నుంచి విడిపోయారు. ఆ తర్వాత రెండో భర్త కళ్యాణ్ దేవ్ నుంచి కూడా దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం శ్రీజ తన స్నేహితులతో కలసి సీసా స్పేసెస్ సెంటర్ అనే స్కూల్ ని ప్రారంభించారు. 

 

click me!

Recommended Stories