Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?

Published : Sep 15, 2026, 12:59 PM IST

Chiranjeevi: అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ అవ్వడంలో మెగాస్టార్ చిరంజీవి చెప్పిన మాట ఎలా ఉపయోగపడిందో తెలుసా? చిరు నుంచి ఐకాన్ స్టార్ నేర్చుకున్నది ఏంటి? బన్ని స్వయంగా చెప్పిన టాప్ సీక్రెట్.

PREV
15
వారసత్వంగా వచ్చినా.. టాలెంట్ తో ఎదిగిన హీరో..

వారసత్వంగా ఇండస్ట్రీలోకి వచ్చినా.. తన సొంత టాలెంట్ తో ఎదిగిన హీరో అల్లు అర్జున్. మెగా, అల్లు వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన బన్ని... తన యాక్టింగ్, గ్లామర్, డ్యాన్స్, యాక్షన్ ట్యాలెంట్ తో టాప్ హీరోగా ఎదిగాడు. టాలీవుడ్ లో మాత్రమే కాదు పుష్ప రెండు సినిమాలతో ఆయన పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమా కోసం దేశమంతా ఎదురు చూస్తుంది. ఆస్థాయికి అల్లు అర్జున్ ఎదగడానికి ఆయన కృషి.. పట్టుదలతో పాటు.. చిరంజీవి చేసిన కొన్ని సూచనలు, ఆయన దగ్గర నుంచి బన్ని నేర్చుకున్న విషయాలు కూడా ఉపయోగపడ్డాయి. ఈక్రమంలో మెగాస్టార్ చిరంజీవి నుంచి అల్లు అర్జున్ నేర్చుకున్న టాప్ సీక్రెట్ ఏంటో తెలుసా?

25
చిరంజీవి నుంచి నేర్చుకున్న విషయం..

హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్, మెగాస్టార్ చిరంజీవి నుండి తాను నేర్చుకున్న ముఖ్యమైన విషయాలు, ఆయన ప్రోత్సాహం గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అల్లు అర్జున్ తన అంతరాత్మ ప్రబోధానికి అంటే గట్ ఫీలింగ్‌కు (Gut Feeling) చాలా ఇంపార్టెన్స్ ఇస్తానని తెలిపారు. కొన్ని సందర్భాల్లో ఆ నిర్ణయం తప్పు కావచ్చు, కానీ చాలాసార్లు ఆ ఆలోచనే మనల్ని కాపాడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. జీవితంలో కానీ నటనలో ఈ విధంగా తన ఆలోచనలకు విలువ ఇవ్వడం అనే లక్షణాన్ని తాను చిరంజీవి నుంచే నేర్చుకున్నానని వెల్లడించారు.

35
చిరంజీవి అల్లు అర్జున్ కు ఏం చెప్పేవాడంటే?

చిరంజీవి ఎప్పుడూ ఇది చేయి.. అది చేయి.. అలా ఉండాలి.. ఇలా ఉండాలి.. అని పాఠాలు చెప్పే వ్యక్తి కాదని అల్లు అర్జున్ పేర్కొన్నారు. "నువ్వు ఇలా చేయాలి, అలా చేయాలి" అని నియమాలు పెట్టకుండా, ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ప్రోత్సహించేవారని చెప్పారు. ఏ పని చేసినా, ఏ సన్నివేశంలో నటించినా "చాలా బాగా చేశావు, చాలా బాగా చేస్తున్నావు" అని నిరంతరం ప్రశంసలు (Compliments) అందిస్తూ నటుడిగా ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపేవారని వివరించారు. కేవలం పొగడ్తలే కాకుండా, ఎప్పుడైనా పని తీరును క్రాస్ చెక్ చేసుకోవడానికి తాను చిరంజీవి గారిని స్వయంగా సూచనలు అడిగినప్పుడు ఆయన వ్యవహరించే తీరు చాలా ప్రత్యేకంగా ఉండేదని అల్లు అర్జున్ గుర్తుచేసుకున్నారు.

45
తప్పుల విషయంలో కూడా ..

"బాబాయ్, ఏదైనా తప్పు ఉంటే చెప్పండి" అని అల్లు అర్జున్ చిరంజీవిని అడిగినప్పుడు, ఆయన చిన్న చిన్న లోపాలను లేదా 50 వరకు ఉండే చిన్న తప్పులను అసలు పట్టించుకోకుండా వదిలేసేవారని తెలిపారు.వాటిలో అత్యంత ముఖ్యమైనవి, సవరించుకోవాల్సినవి ఒకటో రెండో మెయిన్ పాయింట్లను మాత్రమే ఎత్తి చూపి, "ఇది ఒక్కటే చూసుకో" అని చాలా సరళంగా చెప్పి వదిలేసేవారని పేర్కొన్నారు. చిన్న చిన్న తప్పులన్నింటినీ ఎత్తిచూపి ఒత్తిడికి గురిచేయకుండా, అత్యంత కీలకమైన అంశంపైనే దృష్టి సారించేలా చేయడం చిరంజీవి గారి గొప్ప గుణమని అల్లు అర్జున్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

55
అల్లు అర్జున్ సినిమాలు..

ప్రస్తుతం అల్లు అర్జున్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. పుష్ప ఇచ్చిన బలంతో.. భారీ బడ్జెన్ పాన్ ఇండియా సినిమాలవైపు అడుగులు వేస్తున్నాడు. వరుసగా రెండు సినిమాలు తమిళ దర్శకులతో చేస్తుండటం విశేషం. ప్రస్తుతం అట్లీతో రాక మూవీలో నటిస్తున్న బన్నీ.. ఈ సినిమా తరువాత లోకేష్ కనగరాజ్ తో మరో సినిమా అనౌన్స్ చేశాడు. రాక సినిమాను దాదాపు 800 కోట్ల బడ్జెట్ తో పాన్ వరల్డ్ స్థాయితో తెరకెక్కిస్తున్నారు. ఈమూవీ నెక్ట్స్ ఇయర్ రిలీజ్ అవుతుందని సమాచారం.

Read more Photos on
click me!

Recommended Stories