
తెలుగు సినిమా రంగానికి మెగాస్టార్ చిరంజీవి ఒక వినూత్న ఒరవడి తీసుకొచ్చి, స్టార్ హీరోగా నిలిచారు. నటన, స్టైల్, డైలాగ్ డెలివరీ, డ్యాన్స్, యాక్షన్.. ప్రతి అంశంలోనూ తనదైన ముద్ర వేశారాయన. ఆయన తెరపై చూపిన ఎనర్జీ, మ్యానరిజమ్స్, మాస్ డైలాగ్స్, ఇప్పటికీ ఫ్యాన్స్ పై ప్రభావం చూపిస్తూనే ఉన్నాయి. చిరంజీవి కొన్ని సినిమాల్లో చెప్పిన మాస్ మేనరిజమ్ డైలాగ్స్ ప్యాన్స్ కు పూనకాలు తెప్పించింది. ఇక చిరంజీవి కెరీర్ లో పాపులర్ అయిన కొన్ని మ్యానరిజమ్ డైలాగ్స్ ఏంటి, అవి ఏ సినిమాల్లో హిట్ అయ్యాయి. అనే విషయాన్ని చూద్దాం.
మెగాస్టార్ చిరంజీవి కొన్ని మ్యానరిజం డైలాగ్స్ తో మెస్మరైజ్ చేశారు. ఆయన పలికిన పలు డైలాగ్స్ ప్రేక్షకులను థియేటర్లకు కట్టిపడేసాయి. వాటిలో కొన్నింటిని చూసుకుంటే చిరంజీవి జేబు దొంగ సినిమాలో "గొప్పోడివి మరి" డైలాగ్ ఇప్పటికీ ఆడియన్స్ లో గుర్తుండి పోయింది. దాంతో పాటు కొండవీటిరాజా సినిమాలో "దెబ్బక్కాయ్" డైలాగ్ కూడా ఈ కోవలోనే వస్తుంది. కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో రూపొందిన ఈసినిమా 1990 లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
ఇక చిరంజీవి సూపర్ హిట్ డైలాగ్స్ తో "కూసాలు కదిలిపోతాయి" కూడా ఒకటి. రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాలో మెగాస్టార్ ఈ డైలాగ్ వాడతారు. ఇక మరో హిట్ సినిమా గ్యాంగ్ లీడర్ లో "చేయి చూడు ఎంత రఫ్‌గా ఉందో.. రఫ్ఫాడించేస్తా" డైలాగ్ తో పాటు చేయి చూపించే మ్యానరిజం ఆడియన్స్ లో అలా గుర్తుండిపోయింది. చాలా సినిమాల్లో ఈ డైలాగ్ ను వాడారు. నిత్య జీవితంలో కూడా సరదాగా ఈ డైలాగ్ వాడుతుండటం అందరికి తెలిసిందే. వీటితో పాటు మరింత పాపులర్ అయిన డైలాగ్ మరొకటి ఉంది అదే "బాక్సు బద్దలైపోద్ది" రౌడీ అల్లుడు సినిమాలోని ఈ డైలాగ్.
సినిమాల్లో విలన్స్ ను పాయింట్ చేస్తూనో, లేక హీరోయిన్లను ఆటపట్టిస్తూనో చిరంజీవి చెప్పే మేనరిజమ్ డైలాగ్స్ కు బాగా రెస్పాన్స్ వచ్చింది.ఘరానా మొగుడు సినిమాలో హీరోయిన్ నగ్మను ఆటపట్టిస్తూ.. "ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో" "ఫేస్ ఫుల్ టర్నింగ్ ఇచ్చుకో", "ఫేస్ ఆఫ్ టర్నింగ్ ఇచ్చుకో" అంటూ చిరంజీవి వేసిన డైలాగ్ సినిమా మొత్తానికి హైలెట్ అని చెప్పుకోవాలి. ఇక ముఠామేస్త్రి సినిమాలో "స్టోరీ మారిపోద్ది" అంటూ స్టైల్ గా బీడీ కాలుస్తూ మెగాస్టార్ ఎంత అద్భుతంగా అంటాడంటే..మెగా అభిమానులయితే ఇలాంటి మేనరిజమ్ డైలాగ్స్ మెగాస్టార్ కు మాత్రమే సాధ్యం అంటుంటారు.
ఇలా చూసుకుంటే చిరంజీవి కెరీర్ లో బ్లాక్ బస్టర్ సినిమాల్లో బోలెడు మేనరిజం డైలాగ్స్ పాపులర్ అయ్యాయి. అల్లుడా మజాకా సినిమాలో మాటి మాటికి "టాప్ లేచిపోద్ది" అంటూ అదరగొట్టిన చిరు, రిక్షావోడు సినిమాలో "కాస్కో నా వాస్కోడిగామా" అంటూ విలన్స్ కు చెమటలు పట్టించాడు. ఆడియన్స్ చప్పట్లు కొట్టేలా "అంతొద్దు ఇది చాలు" అని హిట్లర్ సినిమాలో వాడిన చిరు, "అంత డెకరేషన్ లేదు" అనే డైలాగ్ ను ఇద్దరు మిత్రులు సినిమా కోసం ఉపయోగించారు. ఈ డైలాగ్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. సినిమాలకు ప్లాస్ అయ్యాయి. అంతే కాదు ఈ డైలాగ్స్ చెప్పే టైమ్ లో మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్ కూడా ఆడియన్స్ కు మరీ ముఖ్యంగా ఫ్యాన్స్ కు ఎంతగానో నచ్చింది.
ఈ డైలాగ్‌లలో ఠాగూర్ సినిమాలో చెప్పిన "తెలుగు భాషలో నాకు నచ్చనిది ", "రఫ్ఫాడించేస్తా", "బాక్సు బద్దలైపోద్ది", "ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో", "స్టోరీ మారిపోద్ది", "అంతొద్దు ఇది చాలు" వంటి పదాలు మాస్‌లో మైండ్‌బ్లోయింగ్ రెస్పాన్స్ తెచ్చుకున్నవి. ఇవి కేవలం మాటలే కాక, చిరంజీవి పలికిన తీరు, ఎక్స్‌ప్రెషన్స్, ఎనర్జీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాయి.
ఈ డైలాగ్స్‌కి దక్కిన ఆదరణ వెనుక ఉన్న కారణం హీరోలో ఉండే చరిష్మా. చిరంజీవి వంటి నటుడికి మాత్రమే అలాంటి మాస్ డైలాగ్స్‌కు ప్రాణం పోసే శక్తి ఉంది. సినిమా విడుదలైతేనే ఆయన ఎలాంటి మ్యాజిక్ చేస్తారు అన్న ఆరాటం ఆడియన్స్ లో ఉండేది. ఈసారి ఏ డైలాగ్ చెపుతాడో వినాలని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేసేవారు. ఒక నటుడు తన ప్రతిభతో పరిశ్రమ దిశను మార్చగలడని, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలడని చిరంజీవి నిరూపించారు. ఇక ప్రస్తుతం చిరంజీవి విశ్వంభ సినిమాతో రిలీజ్ కు రెడీగా ఉన్నాడు. అనిల్ రావిపూడి సినిమాను సెట్స్ పై పరుగులు పెట్టిస్తున్నాడు. త్వరలో మరికొన్ని ప్రాజెక్ట్ లు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.