చిరంజీవి(Chiranjeevi) ఇప్పుడు `ఆచార్య`(Acharya) చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రామ్‌చరణ్(Ram Charan) కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో చరణ్ నటిస్తున్న `సిద్ధ` పాత్ర అర్థగంటకుపైనే ఉంటుందని తెలుస్తుంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన బాలయ్య `అఖండ` సైతం ఈ చిత్రానికి షాకిచ్చింది. `అఖండ`లోని ఎలివేషన్ సీన్లు చూసిన Chiranjeevi కొరటాల `ఆచార్య`ని ఆపరేషన్ చేయడం స్టార్ట్ చేశారట.
`అఖండ`లో భారీ ఎలివేషన్ సీన్లు, బీజీఎం మోత సినిమాని తిరుగులేని విజయంగా నిలబెట్టింది. దీంతో Acharyaలో అవి లోపించడంతో ఆ దిశగా మార్పులు చేస్తున్నారట. అందులో భాగంగానే కొంత రీషూట్ కూడా చేసినట్టు తెలుస్తుంది. చిరంజీవి ఎలివేషన్ ఎలిమెంట్స్ మళ్లీ షూట్ చేసినట్టు సమాచారం. చాలా చోట్ల కరెక్షన్ చేస్తూ సినిమాని ఓ భారీ ప్యాకేజ్డ్ చిత్రంగా తీర్చిదిద్దుతున్నట్టు తెలుస్తుంది. అయితే అది ముందే చేసి ఉంటే ఈ సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉండేది. కానీ పెద్ద అవకాశాన్ని మిస్ చేసుకుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ప్రకటించినట్టుగా ఫిబ్రవరి 4న ఈ చిత్రం విడుదల కాబోతుంది.
అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం మేరకు ఈసినిమా మళ్లీ వాయిదా పడబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి. కరోనా తీవ్రత మరింత పెరుగుతుంది. గత నాలుగు రోజుల్లోనే వైరస్ భయంకరంగా విజృంభిస్తోంది. దేశంలో లక్ష కేసులు దాటాయి. రాష్ట్రంలోనూ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో థియేటర్‌కి జనం వస్తారా? అనేది పెద్ద సస్పెన్స్ గా మారితే, ఆ లోపు థియేటర్లు క్లోజ్ చేసే పరిస్థితి తలెత్తనుందనే టాక్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కరోనా పెరిగితే మొదట ప్రభావం పడేది థియేటర్లపైనే. దీంతో వాటిని క్లోజ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికే ఏపీలో 50శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు రన్ చేయాలని ప్రభుత్వం ప్రకటించింది. నైట్ కర్ఫ్యూలు పెడుతుంది. ఇవి సినిమా విడుదలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.
ఈ విషయాన్ని ముందే గ్రహించిన `ఆర్‌ఆర్‌ఆర్`(RRR Movie) సినిమా వాయిదా వేసుకుంది.పరిస్థితులు కుదుట పడ్డాక, మళ్లీ రెట్టింపు ఎనర్జీతో సినిమాని విడుదల చేస్తామని, ఆడియెన్స్ సినిమాపై చూపించిన ప్రేమతో తిరిగి వస్తామని తెలిపింది. అయితే అదే మాదిరిగా ఇప్పుడు `ఆచార్య`ని కూడా వాయిదా వేసే ఆలోచనలో చిరంజీవి ఉన్నారట. కారణం కరోనా మాత్రమే కాదు, మరో బలమైన రీజన్ కూడా ఉందని తెలుస్తుంది. ఇప్పుడదే హాట్ టాపిక్ అవుతుంది.
RRR Movieలో Ram charan నటిస్తున్నారు. ఆయన అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్నారు. ఇది పాన్ ఇండియా మూవీ. దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు. సినిమా విడుదలైతే సంచలనాలు సృష్టించడం ఖాయమని అంతా నమ్ముతున్నారు. చిరంజీవి కూడా అదే బిలీవ్ చేస్తున్నారట. ఈ సినిమా సంచలన విజయం సాధిస్తే.. రామ్‌చరణ్ రేంజ్ పెరిగిపోతుంది. ఆయనకు మార్కెట్ విస్తరిస్తుంది. అది `ఆచార్య` చిత్రానికి హెల్ప్ అవుతుందని భావిస్తున్నారట చిరంజీవి.
`ఆచార్య` చిత్రంలో చరణ్ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో `ఆర్‌ఆర్‌ఆర్`కి సంబంధించిన చరణ్ తాలూకూ క్రెడిట్ `ఆచార్య` సినిమాకి ఉపయోగపడుతుందని, అది కలెక్షన్ల పరంగానూ బిగ్ హెల్ప్ అవుతుందని భావిస్తున్నారట చిరంజీవి. అందుకే `ఆర్‌ఆర్‌ఆర్` విడుదల తర్వాతనే `ఆచార్య`ని విడుదల చేయాలని భావిస్తున్నారట చిరు.
ఇదే ఇప్పుడు అభిమానులను నిరాశకి గురిచేస్తుంది. `ఆర్‌ఆర్‌ఆర్` వాయిదా పడిన నేపథ్యంలో.. ఫిబ్రవరి 4న విడుదల కావాల్సిన `ఆచార్య` చిత్రం వాయిదా పడబోతుందని, `ఆర్‌ఆర్‌ఆర్` తర్వాతే ఈ చిత్రం రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. ఓ రకంగా ఇప్పుడు చిరంజీవి `ఆర్‌ఆర్‌ఆర్`ట్రాప్‌లో పడ్డారని అంటున్నారు. దాని వల్లే `ఆచార్య`కి కష్టాలు మొదలయ్యాయని, ఇప్పుడు ప్రకటించిన డేట్‌కి రావడం కష్టమని అంటున్నారు. దీంతో అభిమానులు నిరాశ చెందుతున్నారట. మరి మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.