మీరు చిరంజీవి అభిమాని అయితే ఈ 5 సినిమాలు వెతికిమరీ చూడాల్సిందే.. ఇంద్ర లాంటి 100 సినిమాలు కూడా సరిపోవు

Published : Feb 05, 2026, 07:31 AM IST

చిరంజీవి అభిమానులు తప్పనిసరిగా చూడాల్సిన టాప్ 5 బెస్ట్ మూవీస్ ఏంటో ఈ కథనంలో తెలుసుకోండి. పున్నమి నాగు నుంచి స్వయంకృషి వరకు ఈ 5 సినిమాలని తప్పనిసరిగా చూడాల్సిందే. 

PREV
16
Chiranjeevi Top 5 Movies

మెగాస్టార్ చిరంజీవి తన డ్యాన్సులు, ఫైట్స్ తో పాటు అద్భుతమైన నటన కనబరిచి టాలీవుడ్ లో శిఖరాగ్రానికి చేరుకున్నారు. కమర్షియల్ సినిమాలతో పాటు చిరంజీవి ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు, నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేశారు. వాటిలో టాప్ 5 బెస్ట్ సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిరంజీవి అభిమానులు తప్పనిసరిగా ఈ 5 సినిమాలు యూట్యూబ్ లో,ఇతర ఫ్లాట్ ఫామ్ లలో ఎక్కడ ఉన్నా సరే వెతికి మరీ చూడాల్సిందే.

26
పున్నమి నాగు (1980)

చిరంజీవి తన కెరీర్ బిగినింగ్ లో కొన్ని నెగిటివ్ రోల్స్ చేశారు. అందులో పున్నమినాగు ఒకటి. ఇందులో చిరంజీవికి నెగిటివ్ రోల్ అయినప్పటికీ కథని నడిపించే ప్రధాన పాత్ర. చిరంజీవి కెరీర్ లో బిగినింగ్ డేస్ లో వచ్చిన ఈ మూవీని రాజశేఖర్ అనే దర్శకుడు తెరకెక్కించారు. ఈ మూవీలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తల్లి మేనక చిరంజీవికి జోడీగా నటించడం విశేషం.

36
అభిలాష (1983)

లాయర్ గా కెరీర్ ప్రారంభించిన కుర్రవాడు అసలు మరణ శిక్ష అనేదే ఉండకూడదు అని భావిస్తుంటారు. మరణ శిక్షని రద్దు చేయడం కోసం అతడు చేసే ప్రయత్నాలు, దానివల్ల అతడికి ఎదురయ్యే సమస్యల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీలో చిరంజీవి నటన, రాధికతో కెమిస్ట్రీ నెక్స్ట్ లెవల్ లో ఉంటాయి. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది.

46
ఖైదీ (1983)

చిరంజీవి కెరీర్ ని మలుపుతిప్పిన ఈ సినిమా గురించి తప్పనిసరిగా మాట్లాడుకోవలసిందే. ఇది కూడా కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం. మాధవి హీరోయిన్ గా నటించారు. ఓ కుర్రాడి రివేంజ్ డ్రామాగా ఈ చిత్ర కథ ఉంటుంది. తన జీవితం చిన్నాభిన్నం అయ్యాక ఆ యువకుడు ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనే అంశంతో తెరకెక్కించారు.

56
చంటబ్బాయి (1986)

చిరంజీవి తనకి స్టార్ స్టేటస్ వచ్చాక కూడా ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. లెజెండ్రీ డైరెక్టర్ జంధ్యాల దర్శకత్వంలో చంటబ్బాయి చిత్రం తెరకెక్కింది. ఈ మూవీలో చిరు కామెడీ టైమింగ్ నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. ఈ తరం హీరోలకు చంటబ్బాయి సినిమా ఆల్ టైం ఫేవరెట్స్ లిస్ట్ లో ఉంటుంది. సినిమా మొత్తం కామెడీ చేస్తూ చివర్లో చిరంజీవి కంటతడి పెట్టించేలా నటించారు.

66
స్వయం కృషి (1987)

చిరంజీవి తన స్టార్ స్టేటస్ ని పక్కన పెట్టి చేసిన సినిమాల్లో స్వయం కృషి కూడా ఒకటి. కళాతపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవి, విజయశాంతి జంటగా నటించారు.

Read more Photos on
click me!

Recommended Stories