చిరంజీవి, బాలయ్య, నాగ్‌, వెంకీ.. వచ్చే సంక్రాంతికి సీనియర్ల మధ్య గొడవ తప్పేలా లేదుగా..

వచ్చే సంక్రాంతికి మాత్రం ఫైట్‌ పీక్‌లో ఉండబోతుందని తెలుస్తుంది. సీనియర్‌ హీరోలంతా ఇప్పుడు వచ్చే సంక్రాంతినే టార్గెట్‌ చేశారు.  చిరంజీవి, బాలయ్య, నాగ్‌, వెంకీలు రంగంలోకి దిగుతున్నారు. 

తెలుగు సినిమాకి సంక్రాంతి చాలా కీలకంగా మారింది. ఈ పండక్కే తమ సినిమాలను రిలీజ్‌ చేసేందుకు అందరు హీరోలు పోటీ పడుతున్నారు. దీంతో ఇప్పుడు సంక్రాంతి పోటీ చాలా తీవ్రంగా మారుతుంది. ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు పోటీ పడ్డాయి. కానీ వీటి మధ్య పోరు తీవ్రంగా జరిగింది. ఓ సినిమాని వాయిదా వేయాల్సి వచ్చింది. నాలుగు రిలీజ్‌ అయినా ఆడింది మాత్రం ఒక్కటే. కలెక్షన్ల పరంగా `హనుమాన్‌`, `గుంటూరు కారం` బాగా వసూలు చేశాయి. లాభాల పరంగా `హనుమాన్‌` మాత్రం సక్సెస్‌ అయ్యింది. మామూలు టైమ్‌లో వస్తే హిట్‌ లేని నాగార్జున సైతం సంక్రాంతికి `నా సామి రంగ`తో హిట్‌ అందుకున్నాడు. 

దీంతో చాలా మంది హీరోలు ఇప్పుడు సంక్రాంతినే టార్గెట్‌ చేస్తున్నారు. మామూలు టైమ్‌లో కలెక్షన్లని రాబట్టడం కష్టమని భావిస్తున్న వాళ్లు, సంక్రాంతికి అయితే ఈజీగా గెటాన్‌ కావచ్చని, విజయాలు సాధ్యమవుతాయని భావిస్తున్నారు. ఈ క్రమంలో సంక్రాంతి పండక్కి పోటీ రాను రాను పెరిగిపోతుంది. వచ్చే సంక్రాంతికి మాత్రం అది పీక్‌లో ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సారి చిరంజీవి, బాలయ్య, నాగ్‌, వెంకీలు పోటీకి దిగబోతుండటం ఆశ్చర్యపరుస్తుంది. 
 


సీనియర్‌ హీరోలంతా ఇప్పుడు వచ్చే సంక్రాంతినే టార్గెట్‌ చేశారు. సక్సెస్‌ కోసం పండక్కే రావాలనుకుంటున్నారు. అందులో మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న `విశ్వంభర` ఇప్పటికే రిలీజ్‌ డేట్‌ ప్రకటించారు. మరోవైపు బాలయ్య నటిస్తున్న మూవీని, అలాగే వెంకీ, అనిల్‌ రావిపూడి చిత్రం, నాగ్‌ కొత్త మూవీని కూడా వచ్చే సంక్రాంతికే తీసుకురావాలనుకుంటున్నారు. దీంతోపాటు `శతమానంభవతి` సీక్వెల్‌ కూడా 2025 సంక్రాంతి అని ప్రకటించారు. దీంతో ఇప్పట్నుంచే మ్యాటర్‌ చాలా రంజుగా మారింది. సీనియర్ల మధ్య గొడవ గట్టిగానే జరగబోతుందని తెలుస్తుంది. 
 

ఇక చిరంజీవి గతేడాది సంక్రాంతికి `వాల్తేర్‌ వీరయ్య`తో హిట్‌ కొట్టాడు. ఈ మూవీ పెద్ద హిట్‌ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన `భోళాశంకర్‌` పరాజయం చెందింది. దీంతో ఇప్పుడు వశిష్టతో `విశ్వంభర` సినిమాలో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీగా ఇది తెరకెక్కుతుంది. త్రిష ఇందులో కథానాయిక. ఈ మూవీ ఇప్పటికే స్టార్ట్ అయ్యింది. శుక్రవారం నుంచి చిరు సెట్‌లోకి అడుగుపెట్టారు. త్వరలోనే హీరోయిన్‌ త్రిష కూడా రాబోతుంది. ఈ మూవీని వచ్చే సంక్రాంతికి జనవరి 10న విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే టీమ్‌ రిలీజ్‌ డేట్‌ని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. 

గత సంక్రాంతికి చిరంజీవితో పోటీ పడి `వీరసింహారెడ్డి`తో హిట్‌ అందుకున్నాడు బాలయ్య. వచ్చే సంక్రాంతికి మరో సినిమాతో రంగంలోకి దిగబోతున్నారు. ప్రస్తుతం ఆయన బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. `ఎన్బీకే109` పేరుతో రూపొందుతుంది. ఈ మూవీని సంక్రాంతికే విడుదల చేయాలని భావిస్తున్నారు. ఆ దిశగానే షూటింగ్‌ పనులు జరుగుతున్నాయట. చిరు, బాలయ్య మధ్య సంక్రాంతి పోటీ యమ రంజుగా ఉంటుందని చెప్పొచ్చు. 

ఈ ఇద్దరితోపాటు మన్మథుడు నాగార్జున కూడా తన కర్చీఫ్‌ వేసుకున్నారు. ఇటీవల `నాసామిరంగ` సక్సెస్‌ సెలబ్రేషన్‌లో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. వచ్చే సంక్రాంతికి మరో సినిమాతో కలుద్దామని తెలిపారు. సంక్రాంతి రుచి మరిగిన నాగ్‌ వచ్చే సంక్రాంతికి కూడా మరో సినిమాతో రాబోతున్నారు. ప్రస్తుతం ఆయన ఓ కొత్త దర్శకుడితో సినిమా చేయబోతున్నారట. దీన్ని పొంగల్‌కి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట.అలాగే `బంగార్రాజు`కి సీక్వెల్‌ ఆలోచన కూడా ఉందట. ఈ రెండింటిలో ఒకదాన్ని పొంగల్‌కి తీసుకురావాలనుకుంటున్నారట. తను కూడా సంక్రాంతిని సెంటిమెంట్‌గా భావిస్తున్నారు. దీంతో ఎట్టకేలకు అదే సమయంలో రావాలని అనుకుంటున్నారట నాగ్‌
 

ఇంకోవైపు.. వెంకటేష్‌ ఈ సంక్రాంతికి `సైంధవ్‌`తో వచ్చాడు. ఇది మెప్పించలేకపోయింది. కానీ కొత్త సినిమాతో మాత్రం వచ్చే సంక్రాంతికి పెద్ద హిట్‌ కొట్టాలనుకుంటున్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ప్రస్తుతం ఓ సినిమాకి కమిట్ అయ్యాడు వెంకీ. ఈ మూవీ విలేజ్‌, సిటీ బ్యాక్‌ డ్రాప్‌లో జరుగుతుందట. ఈ చిత్రానికి నిర్మాత దిల్‌ రాజు. ఇప్పట్నుంచే రిలీజ్‌ డేట్‌ విషయంలో క్లారిటీగా ఉన్నారట. దీన్ని వచ్చే 2025 సంక్రాంతికే విడుదల చేయాలని చూస్తున్నారట.  
 

ఈ నలుగురుతోపాటు యంగ్ హీరో సినిమా కూడా రాబోతుంది.  గతంలో వచ్చిన ఫ్యామిలీ మూవీ `శతమానం భవతి` చిత్రానికి ఇప్పుడు సీక్వెల్‌ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల దీన్ని ప్రకటించారు దిల్‌ రాజు. వచ్చే సంక్రాంతికి కలుద్దామని తెలిపారు. దీంతో ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలో ఉందని చెప్పొచ్చు. ఈ చిత్రం పక్కన పెడితే చిరంజీవి, బాలయ్య, వెంకీ, నాగ్‌ల మధ్య వచ్చే సంక్రాంతికి తీవ్రమైన పోటీ ఉంటుంది. సినిమా పండగ నెక్ట్స్ లెవల్లో ఉంటుందని చెప్పొచ్చు. నిజంగానే ఈ నలుగురు సంక్రాంతికి వస్తే ఫ్యాన్స్ కి పండగే పండగ. 
 

Latest Videos

click me!