Industry Hits: టాలీవుడ్ సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ఒకే ఏడాది మూడు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు. చిరుతో స్టార్ట్ చేస్తే, నాగార్జున ఎండ్ చేశాడు. ఇండస్ట్రీని షేక్ చేశాడు.
టాలీవుడ్‌లో సీనియర్లు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఒకప్పుడు తిరుగులేని సూపర్ స్టార్స్ గా రాణించారు. అదే సమయంలో వీరి మధ్య తీవ్ర పోటీ కూడా ఉండేది. ఆ పోటీని తట్టుకుని నిలబడ్డారు. వరుస విజయాలతో తిరుగులేని స్టార్స్ గా ఎదిగారు. అయితే ఓ ఏడాది మాత్రం ముగ్గురు హీరోలు ఇండస్ట్రీ హిట్స్ కొట్టారు. బ్యాక్ టూ బ్యాక్ ఒకరి రికార్డులను మరొకరు తిరగరాశారు. ఆ ముగ్గురు చిరంజీవి, బాలయ్య, నాగార్జున. మరి అది ఏ ఏడాది? ఆ మూడు సినిమాలేంటి? అనేది చూస్తే.
24
అత్తకు యముడు అమ్మాయికి మొగుడుతో చిరంజీవి ఇండస్ట్రీ హిట్
చిరంజీవి, బాలయ్య, నాగార్జున ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన ఏడాది 1989. ఈ ఏడాది సంక్రాంతికి `అత్తకు యముడు అమ్మాయికి మొగుడు` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు చిరంజీవి. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ఇందులో వాణిశ్రీ అత్తగా, విజయశాంతి ప్రియురాలిగా నటించింది. ఆ ఏడాది ఇది సంచలన విజయం సాధించింది. దాదాపు 14 సెంటర్లలో వంద రోజులు ఆడింది. ఇందులో చిరంజీవి కామెడీ, డాన్సులు అదిరిపోతాయి. పాటలకు ఆడియెన్స్ డాన్సులు వేయాల్సిందే. వసూళ్ల పరంగానూ దుమ్ముదులిపేసింది. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
34
ముద్దుల మావయ్యతో బాలయ్య ఇండస్ట్రీ హిట్
ఆ తర్వాత బాలకృష్ణ రంగంలోకి దిగారు. ఆయన `ముద్దుల మావయ్య` చిత్రంలో నటించారు. దీనికి కోడి రామకృష్ణ దర్శకుడు. ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో బాలయ్య, విజయశాంతి జంటగా నటించారు. ఏప్రిల్ 7న విడుదలైన ఈ చిత్రం 29 సెంటర్లలో వంద రోజులు ప్రదర్శించబడింది. ఏకంగా ఐదున్న కోట్ల కలెక్షన్లని సాధించింది. అప్పటి వరకు ఉన్న అన్ని సినిమా రికార్డులను ఇది బ్రేక్ చేసింది.
అక్టోబర్‌లో నాగార్జున దిగారు. ఆయన `శివ` మూవీతో వచ్చారు. రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతూ, నాగ్ తో ఈ ట్రెండ్ సెట్టింగ్ మూవీని రూపొందించారు. అమల హీరోయిన్‌గా నటించిన చిత్రమిది. అక్టోబర్ 5న దసరా స్పెషల్‌గా ఈ సినిమా విడుదలైంది. టాలీవుడ్‌ని షేక్ చేసింది. ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమాని చూసి షాక్ అయ్యారు. ఈ మూవీ అప్పట్లో టాలీవుడ్‌లోనే అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది. తెలుగులోనే కాదు, తమిళంలో కూడా భారీ వసూళ్లని రాబట్టింది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి, బాలయ్య.. ఇలా అందరి రికార్డులను బ్రేక్ చేసింది. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. 22 సెంటర్లలో వంద రోజులు, 5 సెంటర్లలో 175 రోజులు ఆడింది. ఇలా ఇండస్ట్రీ హిట్‌ని చిరంజీవి స్టార్ట్ చేస్తే, నాగార్జున ఫినిష్ చేశాడు. ఒకే ఏడాది మూడు ఇండస్ట్రీ హిట్స్ పడటం టాలీవుడ్‌లో అరుదైన సంఘటనగా చెప్పొచ్చు.