'చీకటి గదిలో చితక్కొట్టుడు' రివ్యూ!

First Published Mar 21, 2019, 4:30 PM IST

ఈ మధ్యకాలంలో ట్రైలర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం 'చీకటి గదిలో చితక్కొట్టుడు'. 

ఈ మధ్యకాలంలో ట్రైలర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం 'చీకటి గదిలో చితక్కొట్టుడు'. హారర్ కామెడీతో తెరకెక్కిన ఈ సినిమా మొత్తం బూతు కంటెంట్ తో నింపేశారనే కామెంట్లు వినిపించాయి. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!
undefined
కథ: చందు(ఆదిత్) పెళ్లిచూపుల కోసం ఒక ఇంటికి వెళ్తాడు. అక్కడ పూజా(నిక్కీ తంబోలి) అనే అమ్మాయిని చూస్తాడు. ఆమె తండ్రి పూజాని ఏదైనా ట్రిప్ కి తీసుకెళ్లి పరిచయం పెంచుకోమని చెప్తాడు. అలానే కండీషన్స్ కూడా పెడతాడు. దానికి చందు ఓకే చెప్పడంతో ట్రిప్ కు వెళ్లడానికి రెడీ అవుతారు. చందు తన స్నేహితుడు శివ(హేమంత)ని కూడా రమ్మంటాడు. దీంతో శివ అతడి గర్ల్ ఫ్రెండ్ కూడా వీరితో ట్రిప్ జాయిన్ అవుతారు. ఈ రెండు జంటలు బ్యాంకాక్ కి వెళ్తారు. అయితే అక్కడ వీరి ఉంటున్న ఇంట్లో దెయ్యం ఉందని తెలుస్తుంది. ఆ దెయ్యం అమ్మాయిలను ఏం చేయదు కానీ అబ్బాయిలను వేధిస్తుంటుంది. ఇంతకీ ఆ దెయ్యం స్టోరీ ఏంటి..? ఆ దెయ్యం నుండి ఈ రెండు జంటలు ఎలా తప్పించుకుంటాయి..? దెయ్యం కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు...? అనేదే సినిమా.
undefined
విశ్లేషణ: సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా.. కథలో సరైన సత్తా లేకపోవడంతో బాగా డల్ గా సాగుతుంటుంది. సరైన స్క్రీన్ ప్లే కూడా రాసుకోలేకపోయారు. దీంతో సినిమా మొదలైన కాసేపటికే బోరింగ్ ఫీలింగ్ వస్తుంది. సెకండ్ హాఫ్ లో కామెడీతో నవ్వించడానికి ప్రయత్నించినా.. క్లైమాక్స్ నిరాశ పరుస్తుంది.
undefined
ఈ హారర్ కథలో హారర్ ఎలిమెంట్స్ తగ్గి బూతు డైలాగ్స్, డబుల్ మీనింగ్ మాటలు ఎక్కువవ్వడం కూడా మైనస్ అనే చెప్పాలి. సినిమాలో ఒక్క ట్విస్ట్ కూడా ఉండదు. దెయ్యంగా ఎందుకు మారిందనే రీజన్ కూడా చాలా సిల్లీగా అనిపిస్తుంది.
undefined
డైరెక్టర్ కథపై దృష్టి పెట్టడం మానేసి డబులు మీనింగ్ డైలాగ్స్ పై కాన్సన్ట్రేట్ చేయడం సినిమా రిజల్ట్ పై ఎఫెక్ట్ చూపించింది. సినిమాకు కాస్తో కూస్తో ప్లస్ ఏమైనా ఉందా..? అంటే ఫస్ట్ హాఫ్ లో వచ్చే కామెడీ. రఘుబాబు, తాగుబోతు రమేష్ ల కామెడీ ట్రాక్ లు నవ్విస్తాయి.
undefined
హీరో అరుణ్ ఆదిత్ పాత్రను తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకుంటుంది. నేటి యువత ఆ పాత్రకు ఈజీగా కనెక్ట్ అయిపోతారు. ఇప్పటి జెనరేషన్ యూత్ ప్రేమ విషయంలో ఎలా ఉంటున్నారనే విషయాలు బాగా చూపించారు. హీరోతో సమానంగా ఉండే ఫ్రెండ్ క్యారెక్టర్ లో హేమంత్ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాడు.
undefined
ఇద్దరు హీరోయిన్లు నిక్కీ, భాగ్యశ్రీలు అందాల ఆరబోతకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. ఇటువంటి అడల్ట్ కామెడీని రూపొందించడంలో దర్శకుడు పూర్తిగా ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ప్రేక్షకులను త్రిల్ చేయలేకపోయాడు. రొటీన్ కథకి, రొమాన్స్ డోస్ యాడ్ చేసి అడల్ట్ కామెడీగా మార్చేశాడు.
undefined
దీంతో కథ లేకపోయినా.. హీరోయిన్ల ఎక్స్ పోజింగ్, బూతు డైలాగులు ఓ వర్గపు ఆడియన్స్ ని మెప్పిస్తాయి. సంగీతం ఏవరేజ్ గా ఉంది. ఎడిటింగ్ వర్క్ పర్వాలేదనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమాలో అక్కడక్కడా కాస్త కామెడీ తప్ప ఆకట్టుకునే అంశాలు లేవు. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు దూరంగా ఉంటేనే బెటర్.
undefined
రేటింగ్: 25
undefined