కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన `చెన్నై లవ్ స్టోరీ` మూవీ బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తోంది. ఈ మూవీ మూడు రోజుల్లో అదిరిపోయే వసూళ్లని రాబట్టింది.
కిరణ్ అబ్బవరం వరుసగా విజయాలు సాధిస్తూ దూసుకుపోతున్నాడు. ఆయన `క` సినిమాకి ముందు ఎంతగా స్ట్రగుల్ అయ్యాడో, ఇప్పుడు అదే స్థాయిలో వరుస సక్సెస్‌లు అందుకుంటూ తనేంటో నిరూపించుకుంటున్నాడు. ఇమేజ్‌లు, ఎలివేషన్లకి ప్రయారిటీ ఇవ్వకుండా కథని నమ్ముకొని సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో తన పాత్రకి ప్రయారిటీ అనేది కూడా పట్టించుకోవడం లేదు. ఇదే ఇప్పుడు ఆయన సక్సెస్‌కి కారణమని చెప్పొచ్చు. తాజాగా నటించిన `చెన్నై లవ్ స్టోరీ`లో ఆయన పాత్ర కంటే హీరోయిన్ పాత్రకే ప్రయారిటీ ఉంటుంది. ఓ రకంగా ఆమెనే హీరో అనేలా ఉంటుంది. ఒక హీరో.. హీరోయిన్ పాత్రకి ప్రయారిటీ ఇవ్వడమే ఈ మూవీ సక్సెస్‌కి కారణమని చెప్పొచ్చు.
24
చెన్నై లవ్ స్టోరీ స్టోరీ ఇదే
`చెన్నై లవ్ స్టోరీ` మూవీలో కిరణ్ అబ్బవరంకి జోడీగా శ్రీ గౌరీ ప్రియ నటించింది. రవి నంబూరి దర్శకత్వం వహించారు. ఎస్‌కేఎన్, సాయి రాజేష్ నిర్మించారు. ధీరజ్ మొగిలినేని సహ నిర్మాత. దీనికి సాయిరాజేష్ కథ అందించడం విశేషం. పీఠలమీదే పెళ్లి ఆగిపోయిన అమ్మాయి.. డిప్రెషన్‌లోకి వెళ్తుంది. తాగుడికి బానిస అవుతుంది. ఈ క్రమంలో రిలీఫ్ కోసం చెన్నై వెళ్తుంది. అక్కడ ఫ్రెండ్స్ తో కలిసి ఉంటుంది. చెన్నైలో ఒక కుర్రాడు దర్శకుడిగా సినిమా ఛాన్స్ ల కోసం కథలు పట్టుకొని తిరుగుతుంటాడు. చెన్నై బీచ్‌లో ఓ రోజు వీరిద్దరు కలుసుకుంటారు. అమ్మాయి ఫ్రెండ్స్ ద్వారా వారి రూమ్‌కి వెళ్తాడు. అక్కడే ఉంటాడు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య జరిగిన హేట్, లవ్, విషాదమే సినిమా.
34
చెన్నై లవ్ స్టోరీ కలెక్షన్లు
`చెన్నై లవ్ స్టోరీ` ఫీల్‌గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీ. అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో సాగుతుంది. ఆద్యంతం ఎమోషనల్‌గా రన్ అవుతుంది. అదే సమయంలో గుండెని పిండేసే లవ్ ఉంది. మంచి ఫన్ కూడా ఉంది. ప్రీమియర్స్ తోనే ఆకట్టుకున్న ఈ చిత్రం విజయవంతంగా రన్ అవుతుంది. హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ మూవీ మూడు రోజులు పూర్తి చేసుకుంది. ఫస్ట్ వీకెండ్ అయిపోయింది. మరి ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసిందనేది చూస్తే, దీనికి మూడు రోజుల్లో రూ.24కోట్లు వచ్చాయి. మూడో రోజు రూ.6.25కోట్ల నెట్ కలెక్షన్లని, రూ.8.3కోట్ల గ్రాస్‌ని వసూలు చేసింది. ఇండియాలో ఇది రూ.19.21కోట్ల గ్రాస్, రూ.16.70కోట్ల నెట్ రాబట్టింది. ఓవర్సీస్‌లో మూడో రోజు కోటి రాగా, అక్కడ మొత్తంగా రూ.4.80కోట్లు కలెక్ట్ చేసింది. ఇదిలా ఉంటే ఈ మూవీ రెండు రోజుల్లోనే రూ.25కోట్లు రాబట్టినట్టు టీమ్ తెలిపింది. మూడు రోజులకు రూ.35 కోట్లకుపైగా రాబట్టినట్టు ప్రకటిస్తారని చెప్పొచ్చు.
`చెన్నై లవ్ స్టోరీ` మూడు రోజుల్లోనే దాదాపు 70శాతం వసూళ్లని రాబట్టింది. రెండో వారంలోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుందని చెప్పొచ్చు. సినిమాకి అయిన బడ్జెట్(ప్రమోషన్స్ తో కలిపి) రూ.32కోట్లు. థియేట్రికల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.16కోట్లు. అంటే రూ.32కోట్ల గ్రాస్ సాధిస్తే సినిమా హిట్. ఇంకా ఎనిమిది కోట్లు వస్తే, నిర్మాతలు సేఫ్ అని చెప్పొచ్చు. నాన్ థియేట్రికల్ రైట్స్(ఓటీటీ, శాటిలైట్, ఆడియో) రూపంలో ఈ మూవీకి మరో పది కోట్లు వచ్చాయి. సినిమా నలభై కోట్లు దాటితే బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. మరి ఎంత వరకు రాబడుతుందో చూడాలి.