నువ్వు జాగ్రత్తగా ఉండు నేను ఢిల్లీ వెళ్తున్నాను అంటాడు. ఎందుకు నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా మళ్లీ ఎప్పుడు వస్తావు అంటూ అడుగుతుంది జగతి. తప్పదు వెళ్లాలి రిషి మెడికల్ కాలేజీ పర్మిషన్స్ కోసం పంపిస్తున్నాడు ఎప్పుడు వస్తానో తెలియదు అంటాడు మహేంద్ర. మహేంద్ర ని పట్టుకొని ఏడుస్తుంది జగతి. మరోవైపు జగతికి సాయం చేసినందుకు ధరణికి చివాట్లు పెడతారు దేవయాని, శైలేంద్ర.