నందమూరి నటసింహం బాలకృష్ణ పుట్టిన రోజు సందర్బంగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇది బాలయ్య 60వ పుట్టిన రోజు కూడా కావటంతో అభిమానుల మరింత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తున్నారు. బయటకు వచ్చి సెలబ్రేట్ చేసే పరిస్థితి లేకపోవటంతో సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తున్నారు. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా బాలయ్యకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.