కృష్ణ గారి 3వ రోజు కార్యక్రమంలో త్రివిక్రమ్, గోపీచంద్ ఇతర ప్రముఖులు.. బాధని దిగమింగుతున్న మహేష్

Published : Nov 17, 2022, 10:04 PM IST

సిల్వర్ స్క్రీన్ పై సాహసాలు అంటే గుర్తుకు వచ్చేది సూపర్ స్టార్ కృష్ణ గారే. ఆయన మృతితో టాలీవుడ్ లో ఒక శకం ముగిసినట్లు అయింది. నేడు కృష్ణగారి మూడవరోజు కార్యక్రమం జరిగింది.

PREV
18
కృష్ణ గారి 3వ రోజు కార్యక్రమంలో త్రివిక్రమ్, గోపీచంద్ ఇతర ప్రముఖులు.. బాధని దిగమింగుతున్న మహేష్

సిల్వర్ స్క్రీన్ పై సాహసాలు అంటే గుర్తుకు వచ్చేది సూపర్ స్టార్ కృష్ణ గారే. ఆయన మృతితో టాలీవుడ్ లో ఒక శకం ముగిసినట్లు అయింది. మంగళవారం రోజు సూపర్ స్టార్ కృష్ణ కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. నిన్న ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి.  

28

ఇటీవల మహేష్ బాబుకి మనసుని గాయపరిచే దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఈ ఏడాదే మహేష్ సోదరుడు రమేష్ బాబు, తల్లి ఇంద్రాదేవి, ఇప్పుడు కృష్ణగారు మరణించారు. హృదయం లోతుల్లో ఉన్న బాధని దిగమింగుతూ కూడా జరగాల్సిన కార్యక్రమాలు చేస్తున్నాడు. 

38

నేడు కృష్ణగారి మూడవరోజు కార్యక్రమం జరిగింది. కృష్ణగారి అంత్యక్రియలకు హాజరు కాలేకపోయిన సెలెబ్రిటీలు, ఇతర ప్రముఖులు నేడు మూడవరోజు సందర్భంగా ఆయనకి చిత్ర పటానికి నివాళులు అర్పించారు. 

48

ఈ కార్యక్రమంలో మహేష్ బాబు కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు. అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత నాగవంశీ కూడా హాజరై కృష్ణ గారికి నివాళులు అర్పించారు. 

 

58

బాధని దిగమింగుతున్న మహేష్ కి ఓదార్పునిచ్చారు. సరిలేరు నీకెవ్వరూ డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరో గోపీచంద్ కూడా హాజరయ్యారు. కృష్ణ గారి సోదరుడు ఆది శేషగిరి రావు దగ్గరే ఉంటూ అన్ని కార్యక్రమాలు చూసుకుంటున్నారు. 

68

సుధీర్ బాబు దంపతులు, మంజుల దంపతులు కూడా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో మారుమూల గ్రామం బుర్రిపాలెం నుంచి వచ్చిన కృష్ణ గారు 1965లో సినీ రంగ ప్రవేశం చేశారు. 

 

78

దాదాపు 340పైగా చిత్రాల్లో నటించిన ఆయన తెలుగు సినిమాకి సాహసాలు అంటే ఏంటో చూపించారు.  సొంతంగా పద్మాలయ స్టూడియోస్ స్థాపించిన కృష్ణ.. ఆ బ్యానర్ లో మొదగాళ్ళకు మోసగాడు, పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు లాంటి అద్భుతమైన చిత్రాలలో నటించారు.

88

అలాగే కృష్ణ కురుక్షేత్రం లాంటి పౌరాణిక చిత్రాల్లో కూడా నటించారు.చిత్ర పరిశ్రమ బాగు కోసం కృష్ణ ఎప్పుడూ ముందుంటారు. ఎన్నో సేవాకార్యక్రమాలు చేశారు. భారత ప్రభుత్వం ఆయన్ని 2009లో పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది.   

click me!

Recommended Stories