బాలయ్యతో కలసి రచ్చ రచ్చ చేసిన కిరణ్ కుమార్ రెడ్డి.. వామ్మో మాజీ సీఎంలో ఈ యాంగిల్ కూడా ఉందా..

Published : Nov 17, 2022, 09:03 PM IST

అన్ స్టాపబుల్ షో ఎపిసోడ్ 4కి ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అతిథిగా హాజరయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి, బాలకృష్ణ నిజాం కాలేజీలో క్లాస్ మేట్స్. వీళ్ళిద్దరూ కాలేజ్ డేస్ నుంచి మంచి స్నేహితులు. రాజకీయాలకు అతీతంగా వీరి స్నేహం కొనసాగింది.

PREV
17
బాలయ్యతో కలసి రచ్చ రచ్చ చేసిన కిరణ్ కుమార్ రెడ్డి.. వామ్మో మాజీ సీఎంలో ఈ యాంగిల్ కూడా ఉందా..

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న 'అన్ స్టాపబుల్' షో సీజన్ 2 ఆల్రెడీ గ్రాండ్ స్టైల్ లో ప్రారంభం అయింది. సీజన్ 2 ప్రారంభ ఎపిసోడ్ కి మాజీ సీఎం చంద్రబాబు, నారా లోకేష్ హాజరైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎపిసోడ్ కి యువ హీరోలు విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ అతిథులుగా హాజరయ్యారు. మొదటి సీజన్ లో ఎక్కువగా సినీ సెలెబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు. 

27

కానీ రెండవ సీజన్ కి ప్లానింగ్ మారింది. సినీ సెలెబ్రిటీలతో పాటు రాజకీయ నేతలు కూడా హాజరవుతున్నారు. నాల్గవ ఎపిసోడ్ అభిమానులందరికి ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు.అన్ స్టాపబుల్ షో ఎపిసోడ్ 4కి ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అతిథిగా హాజరయ్యారు. 

37

కిరణ్ కుమార్ రెడ్డి, బాలకృష్ణ నిజాం కాలేజీలో క్లాస్ మేట్స్. వీళ్ళిద్దరూ కాలేజ్ డేస్ నుంచి మంచి స్నేహితులు. రాజకీయాలకు అతీతంగా వీరి స్నేహం కొనసాగింది. పాత స్నేహితులు ఇలా ప్రత్యేక టాక్ షోలో కలుసుకోవడం ఆసక్తికర పరిణామం. చాలా రోజుల తర్వాత కలుసుకోవడంతో బాలయ్య, కిరణ్ కుమార్ రెడ్డి రచ్చ రచ్చ చేశారు. 

 

47

ఎప్పుడూ హుందాగా ఉండే కిరణ్ కుమార్ రెడ్డి ఈ షోలో తన కొత్త యాంగిల్ చూపించారు. ఇక బాలయ్య అల్లరి గురించి చెప్పనవసరం లేదు. 'స్నేహమే నా జీవితం .. స్నేహమేరా శాశ్వతం అనే పాట పాడుతూ బాలయ్య ఎంట్రీ ఇచ్చారు. మీరు బాలయ్య కుటుంబాన్ని చూసారు. ఈరోజు బాలయ్య స్నేహాన్ని చూడండి అని చెప్పారు. వెంటనే కిరణ్ కుమార్ రెడ్డి ఎంట్రీ ఇవ్వగా.. అతని చేయి పట్టుకుని బాలయ్య స్వాగతం పలికారు. 

57

వెంటనే 'అధ్యక్షా నా మైక్ ఆపేశారు అధ్యక్షా' అంటూ బాలయ్య అల్లరిగా కిరణ్ కుమార్ రెడ్డి ముందు డైలాగ్స్ కొట్టారు. కిరణ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ.. నేను స్పీకర్ అయ్యాక అర్థరాత్రి 12 గంటలకి ఫోన్ చేసి ఇదే మాట చెప్పారు బాలకృష్ణ అని అన్నారు. టాక్ షో మొదలయ్యాక బాలయ్య బాలయ్య కొన్ని ఫోటోలు కిరణ్ కుమార్ రెడ్డికి చూపించారు. అవి బాలయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కాలేజ్ రీ యూనియన్ కి సంబందించిన పిక్స్. 

67

కిరణ్ కుమార్ రెడ్డితో పాటు మరో మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కూడా హాజరయ్యారు. వీరితో పాటు సీనియర్ హీరోయిన్ రాధిక కూడా అన్ స్టాపబుల్ షోలో సందడి చేసింది. వేరు ముగ్గురూ కాలేజ్ డేస్ లో చేసిన అల్లరి గురించి చర్చించుకున్నారు. ప్రోమో చూస్తుంటే కిరణ్ కుమార్ రెడ్డి తన రాజకీయ జీవితం గురించి అనేక విషయాలు షేర్ చేసినట్లు తెలుస్తోంది. 

 

77

తాను అదృష్టవశాత్తు బతికాను కాబట్టే ముఖ్యమంత్రి అయ్యాను అని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాజశేఖర్ రెడ్డి మరణించిన హెలికాఫ్టర్ లో సంఘటనని కిరణ్ కుమార్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. రాజశేఖర్ రెడ్డి గ్రేట్ పర్సనాలిటీ అని బాలయ్య ప్రశంసలు కురిపించడం విశేషం. ఇక కిరణ్ కుమార్ రెడ్డి ప్రొఫెషనల్ గా మంచి క్రికెటర్. దీనితో బాలయ్య కిరణ్ కుమార్ రెడ్డితో కాసేపు వేదికపై క్రికెట్ ఆడారు. ఇంతలో రాధికా వేదికపైకి ఎంట్రీ ఇచ్చి వీరి అల్లరిలో పాలు పంచుకుంది. ఈ ఎపిసోడ్ నవంబర్ 25న ప్రసారం కానుంది. 

Read more Photos on
click me!

Recommended Stories