Published : Sep 27, 2026, 09:47 AM ISTUpdated : Sep 27, 2026, 09:51 AM IST
నాని హీరోగా, శ్రీకాంత్ ఓడెల దర్శకత్వంలో రూపొందిన `ది ప్యారడైజ్` మూవీపై బీఆర్‌ఎస్ నాయకుడు కేటీఆర్ తన రివ్యూని వెల్లడించారు. అసంపూర్తిగా తన రివ్యూని ఇవ్వడం గమనార్హం.
నాని హీరోగా నటించిన `ది ప్యారడైజ్` మూవీ ఈ గురువారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. శ్రీకాంత్ ఓడెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. కానీ వసూళ్లు బాగానే ఉన్నాయి. టికెట్ రేట్ల పెంపు కారణంగా మంచి కలెక్షన్లు వస్తున్నాయి. కానీ ఓవరాల్‌గా దీనికి యావరేజ్ టాక్ ఉంది. సినిమాలో ఎమోషన్స్ వర్కౌట్ కాలేదని, దర్శకుడు క్లారిటీ మిస్ అయ్యాడని, కొంత కన్‌ఫ్యూజ్ అయ్యాడనే విమర్శ ఉంది. అయితే అదిరిపోయే కథని చెప్పాడని, యాక్షన్ పూనకాలు తెప్పించేలా ఉందని అంటున్నారు. రా అండ్ రస్టిక్ మూవీలా మెప్పించింది. నాని విశ్వరూపం చూపించారని చెప్పొచ్చు. అదే సమయంలో ప్రియదర్శి పాత్ర ఎంట్రీ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది.
23
ప్యారడైజ్ సినిమా చూసిన కేటీఆర్
ఇలా మిక్స్ డ్ టాక్‌తో రన్ అవుతున్న ఈ చిత్రాన్ని తాజాగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ చూశారు. శనివారం రాత్రి సుదర్శన్ థియేటర్లో పలువురు ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి ఆయన సినిమాని వీక్షించారు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ `ప్యారడైజ్` సినిమా కోసం థియేటర్‌కి వెళ్తున్నట్టు తెలిపారు. తెలంగాణ బిడ్డ శ్రీకాంత్ ఓడెల కోసం, తన ఫేవరేట్ యాక్టర్ నాని కోసం ఈ సినిమా చూస్తున్నట్టు ముందుగానే ట్వీట్ చేశాడు కేటీఆర్. ఇక రాత్రి సినిమా చూశాక తన రివ్యూని వెల్లడించారు.
33
ప్యారడైజ్ మూవీపై కేటీఆర్ రివ్యూ, కానీ
`అస్థిత్వం కోసం ఆరాటం, అణిచివేత పై పోరాటం. సందర్భం వస్తే గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయి అనే సందేశాన్ని అందించిన తమ్ముడు శ్రీకాంత్ ఓదెల కి హృదయపూర్వక అభినందనలు. కథానాయకుడి పాత్రలో జీవించిన మిత్రుడు నానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. తమ్ముడు ప్రియదర్శి కి ప్రత్యేక అభినందనలు. `చావు నోట్లో తల పెట్టయినా… మీకు గుర్తింపు తెస్తా. You know who that is ✊(ఈ మాట చెప్పింది ఎవరో మీకు తెలుసు)` అని ట్వీట్ చేశాడు కేటీఆర్. ఇందులో నాని, ప్రియదర్శి నటనని, మంచి సందేశం అందించిన దర్శకుడిని అభినందించారు. మోహన్ బాబు గురించిగానీ, కయాదు లోహర్ గురించిగానీ స్పందించలేదు. అంతేకాదు ఓవరాల్‌గా సినిమా ఎలా ఉందనేది కేటీఆర్ మెన్షన్ చేయలేదు. జనాలను సినిమా చూడాలని కూడా చెప్పలేదు. ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ట్రోలర్స్ కి ఆయుధంగా మారింది. వాటినే మెన్షన్ చేస్తూ కౌంటర్లు ఇస్తున్నారు. సినిమా నచ్చలేదా? మూవీ ఎలా ఉందో చెప్పలేదు, మిగిలిన ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్ల గురించి ప్రస్తావించలేదని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. దీంతో ఇది కొత్త రచ్చకి దారితీసిందని చెప్పొచ్చు.
అస్థిత్వం కోసం ఆరాటం, అణిచివేత పై పోరాటం.
సందర్భం వస్తే గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయి అనే సందేశాన్ని అందించిన తమ్ముడు శ్రీకాంత్ ఓదెల కి హృదయపూర్వక అభినందనలు
కథానాయకుడి పాత్రలో జీవించిన మిత్రుడు నానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. తమ్ముడు ప్రియదర్శి కి ప్రత్యేక అభినందనలు…