Brahmaji : పెళ్లై, కొడుకు ఉన్న మహిళతో బ్రహ్మాజీ లవ్.. వీరికి పెళ్లి చేసింది ఆ డైరెక్టరే.!

First Published | Apr 28, 2023, 4:13 PM IST

ప్రముఖ నటుడు బ్రహ్మాజీ (Brahmaji) తాజాగా తన లవ్ స్టోరీని రివీల్ చేశారు. ఆయన, తన భార్యతో కలిసి ‘అలా మొదలైంది’ షోకు హాజరైన సందర్భంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 
 

ప్రముఖ నటుడు బ్రహ్మాజీ గురించి తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో తెలుస్తోంది. ఈస్ట్ గోదావరిలో జన్మించిన ఈయన ఎన్నో చిత్రాల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను అలరించారు. 30 ఏండ్లకు పైగా అన్ని పాత్రలు పోషిస్తూ తనదైన నటశైలితో ఆడియెన్స్ ను ఆకట్టుకున్నారు. ఇండస్ట్రీలో స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు.
 

కాగా, బ్రహ్మాజీ వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కవ మందికి తెలిసి ఉంటుంది. ఇటీవల సినీ ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో సందడి చేస్తున్న బ్రహ్మాజీ తాజాగా ‘అలా మొదలైంది’ (Ala Modalaindi) టాక్ షోకు తన భార్య శాశ్విత (Shashwita)తో కలిసి హాజరయ్యారు. 
 

Latest Videos


కమెడియన్, నటుడు వెన్నెల కిషోర్ (Vennela Kishore) హోస్ట్ గా  ఈటీవీలో ప్రసారం అవుతున్న ‘అలా మొదలైంది’ షోకు బ్రహ్మాజీ, శాశ్విత అతిథులుగా హాజరయ్యారు. తమ లైఫ్ లోని ఇంట్రెస్టింగ్ విషయాలను షో ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన ప్రొమోను విడుదల చేయడంతో ఆకట్టుకుంటోంది. 
 

బ్రహ్మాజీ మాట్లాడుతూ తను ఎలా ప్రపోజ్ చేశాడో వివరించారు.  ‘ఒకవైపు మూన్ లైట్.. మరోవైపు సన్ రైజ్.. హైస్పీడ్ లో శాశ్విత దగ్గరకు వెళ్లి ఐ లవ్యూ చెప్పాను. ఆమె బర్త్ డేకు నా చైన్ కూడా తాకట్టు పెట్టాను. ఎక్కువగా తనతో ఫోన్ లో మాట్లాడుతూనే ఉండేవాణ్ణి. నా సగ జీవితం పబ్లిక్ బూత్ లోనే గడిచింది. తను తిట్టిందంటే మూడు రోజులు అన్నం తిన్నలేం’ అని చెప్పుకొచ్చాడు.
 

ఇక శాశ్విత మాట్లాడుతూ.. ‘మా పెళ్లిలో కన్యాదానం చేసింది డైరెక్టర్ క్రిష్ణవంశీ గారు. ఒకసారి బ్రహ్మాజీ తన చేయిని బ్లేడ్ తో కోసుకోవడంతో నేను ఆస్పత్రికి తీసుకెళ్లాను. చాలా ఇన్నోవేటివ్ గా ఉంటాడు.’ అని చెప్పుకొచ్చింది. ప్రోమో ఆకట్టుకుంటోంది. మే2న విడుదల కానున్న ఫుల్ ఇంటర్వ్యూతో మరిన్ని ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్ రానున్నాయి. బ్రహ్మాజీ శాశ్వతిని కలవడానికి ముందే ఆమెకు ఓ కొడుకు కూడా ఉన్నారు. ‘పిట్ట కథ’తో హీరోగా పరిచయం అయిన సంజయ్ రావునే వీరి కొడుకు. సంజయ్ కోసం బ్రహ్మాజీ మళ్లీ పిల్లల్ని కూడా వద్దనుకున్నాడు.
 

ఇక బ్రహ్మాజీ 1986 నుంచి ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటున్నారు. ప్రముఖ దర్శకుడు Krishna Vamshi సినిమాల్లో రెగ్యూలర్ నటుడిగా ముద్ర వేసుకున్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన  ‘సింధూరం’ చిత్రంతో హీరోగానూ పరిచయం అయ్యారు. బ్రహ్మాజీ తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లోననూ నటించారు. చివరిగా ‘మాచర్ల నియోజకవర్గం’, ‘18 పేజెస్’, ‘విరూపాక్ష’తో అలరించారు. 
 

click me!