Boyapati Top 5 Movies: బోయపాటి శ్రీను టాప్‌ 5 మూవీస్‌.. తిరుగులేని స్టార్‌ డైరెక్టర్‌ని చేసింది ఈ ఒక్క హీరోనే

Published : Apr 25, 2026, 11:01 AM IST

దర్శకుడు బోయపాటి శ్రీను నేడు తన పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన రూపొందించిన చిత్రాల్లో టాప్‌ 5 మూవీస్‌ ఏంటో చూస్తే, ఒక్క హీరో మాత్రం బోయపాటి లైఫ్‌నే మార్చేశారు. 

PREV
17
బోయపాటి శ్రీను టాప్ 5 మూవీస్‌

దర్శకుడు బోయపాటి శ్రీను మాస్‌ మూవీస్‌కి కేరాఫ్‌. తెలుగు సినిమాల్లో మాస్‌ని మరో స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు. ఇప్పుడు టాలీవుడ్‌లో అత్యంత మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి అనే చెప్పాలి. జయాపజయాలకు అతీతంగా ఆయన తన సినిమాలతో అలరిస్తూ వస్తున్నారు. తన స్పెషాలిటీని చాటుకుంటున్నారు. బోయపాటి సినిమాలు మాస్‌ ఆడియెన్స్ కి పీస్ట్ లా ఉంటాయి. అంతేకాదు ఆయన మూవీస్‌తో అన్ని అంశాలున్నాయి. ఫ్యామిలీ ఎలిమెంట్లు, సెంటిమెంట్‌, ఎమోషన్స్, కామెడీ, లవ్‌ స్టోరీ, చిన్నపిల్లల ఎలిమెంట్లు, ఇలా ఇంటిళ్లిపాది చూసేలా ఉంటాయి. యాక్షన్‌ మోతాదు మించినా అది ఆడియెన్స్ యాక్సెప్ట్ చేసేలా ఉంటుంది. అంతేకాదు బోయపాటి దర్శకుడిగా సక్సెస్‌ కావడానికి కారణం ఆయన సినిమాలో ప్రతి పది నిమిషాలకు ఒక హై మూమెంట్‌ ఉంటుంది. సినిమా డల్‌ అవుతున్న సమయంలో అదిరిపోయే బ్లాక్‌ ఒకటి ప్లాన్‌ చేస్తారు. దీంతో ఆడియెన్స్ ఎక్కడా బోర్‌ ఫీలవ్వరు. ఇలా పక్కా ప్లాన్‌తో మంచి కమర్షియల్‌ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్న బోయపాటి నేడు బర్త్ డేని సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ క్రమంలో బోయపాటి టాప్‌ 5 మూవీస్‌ ఏంటో చూద్దాం.

27
1.అఖండ

బోయపాటి రూపొందించిన చిత్రాల్లో టాప్‌లో ఉండే మూవీ `అఖండ`. బాలకృష్ణ హీరోగా వచ్చిన చిత్రమిది. ఇది అటు బోయపాటి కెరీర్‌లో, ఇటు బాలయ్య కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ అన్నివర్గాల వారిని ఆకట్టుకుంది. దీంతో ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. బాలయ్య సినిమాల్లో వంద కోట్లు దాటిన తొలి చిత్రమిదే కావడం విశేషం. ఇందులో ప్రగ్యా జైశ్వాల్‌ హీరోయిన్‌గా నటించగా, పూర్ణ కీలక పాత్ర పోషించింది. హీరో శ్రీకాంత్‌ విలన్‌గా కనిపించారు. ఇది 2021లో విడుదలై దాదాపు రూ.120-130కోట్లు వసూలు చేసింది.

37
2.సరైనోడు

బోయపాటి రూపొందించిన చిత్రాల్లో రెండో స్థానంలో ఉండే మూవీ `సరైనోడు`. అల్లు అర్జున్‌ హీరోగా వచ్చిన చిత్రమిది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటించింది. ఇందులోనూ శ్రీకాంత్‌ కీలక పాత్ర పోషించారు. ఆదిపినిశెట్టి విలన్‌గా నటించాడు. 2016లో విడుదలైన ఈ చిత్రం వంద కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. అల్లు అర్జున్‌ కెరీర్‌లో కూడా వంద కోట్లు దాటిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం. అయితే ఈ మూవీకి మొదట యావరేజ్‌ టాక్‌ వచ్చింది. కానీ కమర్షియల్‌ గా మాత్రం అదరగొట్టింది.

47
3.లెజెండ్‌

బోయపాటి శ్రీను కెరీర్‌లో టాప్‌ 3లో ఉండే సినిమా `లెజెండ్‌`. బాలకృష్ణ హీరోగా వచ్చిన మూవీ ఇది. వరుస పరాజయాల్లో ఉన్న బాలయ్యని గట్టెక్కించిన చిత్రం. 2014లో విడుదలై సుమారు రూ.70కోట్ల వరకు వసూళ్లని రాబట్టింది. ఇందులో జగపతిబాబు విలన్‌గా నటించగా, సోనాల్‌ చౌహాన్‌, రాధికా ఆప్టే హీరోయిన్లుగా చేశారు.  ఇది బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

57
4.సింహ

బోయపాటి రూపొందించిన చిత్రాల్లో టాప్‌ 4లో `సింహ` నిలుస్తుంది. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమా ఇది. బాక్సాఫీసుని షేక్‌ చేసింది. 2010లో ఈ సినిమా రిలీజ్‌ అయ్యింది. ఇందులో నయనతార, స్నేహా ఉల్లాల్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా  అప్పట్లో  రూ.36కోట్ల డిస్ట్రిబ్యూటర్‌ షేర్‌ని వసూలు చేయడం విశేషం.

67
5.భద్ర

ఇక టాప్‌ 5లో ఉన్న బోయపాటి మూవీ `భద్ర` అని చెప్పొచ్చు. బోయపాటి దర్శకుడిగా పరిచయం అవుతూ చేసిన చిత్రం. రవితేజ హీరోగా నటించాడు. రవితేజని మాస్‌ యాంగిల్‌లో చూపించిన సినిమా. అద్భుతమైన లవ్‌ స్టోరీ ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీ ఎలిమెంట్లు మెప్పిస్తాయి. ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ హైలైట్‌గా నిలుస్తుంది. ఈ చిత్రం 2005లో విడుదలైంది. సుమారు రూ.15కోట్ల డిస్ట్రిబ్యూటర్‌ షేర్‌ని వసూలు చేసింది. తొలి చిత్రంతోనే తానేంటో చూపించారు బోయపాటి. దీంతో టాలీవుడ్‌లో ప్రామిసింగ్‌ డైరెక్టర్‌గా మారిపోయారు.

77
బోయపాటిని స్టార్‌ని చేసిన హీరో బాలయ్య

అయితే బోయపాటి రూపొందించిన చిత్రాల్లో ఎక్కువగా బాలయ్యతోనే ఉండటం విశేషం. అటు బాలయ్యని బోయపాటి నిలబెడితే, బోయపాటిని బాలయ్య నిలబెట్టారు. ఇంకా చెప్పాలంటే బోయపాటికి దర్శకుడిగా ఇమేజ్‌ని పెంచడంలో బాలయ్య పాత్ర ఎంతో ఉంది. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే పక్కా హిట్‌. మిగిలిన హీరోలతో ఆ రేంజ్ బోయపాటి విజయాలు అందుకోలేదు. కానీ బాలయ్యతో చేస్తే పక్కా హిట్‌ అనేలా ముద్ర పడింది. పైగా ఇద్దరికి కెమిస్ట్రీ బాగా కుదిరింది. బాలయ్యని పవర్‌ఫుల్‌గా చూపించడంలో బోయపాటి తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు. బోయపాటి 11 సినిమాలు చేస్తే, అందులో నాలుగు బాలయ్యతోనే. వాటిలో మూడు బ్లాక్‌ బస్టర్స్ కావడం విశేషం.  వీరి కాంబినేషన్‌లో `సింహ`, `లెజెండ్‌`, `అఖండ`, `అఖండ 2` చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories