చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య చిత్రం కాపీ వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. అయితే కొరటాల శివ, మరో ప్రక్క చిత్ర నిర్మాణ సంస్ద మైత్రీ మూవీస్ వారు ఈ సినిమా కథ విషయమై ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.
కొరటాల దగ్గర కో డైరెక్టర్‌గా పనిచేస్తున్న వ్యక్తే తనకు కథ చెప్పాడని, ఆ నమ్మకంతోనే తాను ఈ ఆరోపణలు చేస్తున్నట్టుగా చెప్పాడు రాజేష్. తనకు ఎక్కడా న్యాయం జరగటం లేదు కాబట్టే చిరంజీవి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లే ఉద్దేశంతోనే మీడియా ముందుకు వచ్చానని చెప్పాడు.
రాజేష్ ఆరోపణలు చేస్తున్నట్టుగా ఈ సినిమా కథ కాపీ కాదని, ఈ విషయంపై కొరటాల శివ ఓ టీవీ చానల్ డిస్కషన్ లో పాల్గొన్నారు.తాము చేస్తున్న ఆచార్య సినిమా కథ ఒరిజనల్ అని, తాము ఎవరి కథను కాపీ కొట్టలేదని ప్రకటనతో తెలియచేసారు. ఈ నేపధ్యంలో ఈ కాపీ వివాదం పురస్కరించుకుని బోయపాటి శ్రీను తన గత రోజులను గుర్తు చేసుకుని పార్టీ చేసుకున్నారని వార్తలు మొదలయ్యాయి.
గతంలో బోయపాటి శ్రీను తనకు క్రెడిట్ ఇవ్వలేదంటూ కొరటాల శివ బహిరంగంగా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు బోయపాటి శ్రీను అసలేం జరిగిందో వివరణ ఇవ్వటానికి పూనుకోలేదు. ఖచ్చితంగా బాధపడే ఉంటారనేది నిజం. దాంతో ఇప్పుడు కొరటాల శివ పై ఇలా కాపీ ఆరోపణలు వచ్చేసరికి ...ఆనందంగా తన దగ్గర వారికి పార్టీ ఇచ్చారని రూమర్స్ మొదలయ్యాయి.
అయితే బోయపాటి చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినవారని ఆయనతో పనిచేసిన వారు చెప్తారు. అంతెందుకు ఆయన బిహేవియర్ లో ఏ మాత్రం తేడా ఉన్నా బాలయ్య ప్రక్కన పెట్టేస్తారనేది నిజం. కాబట్టి ఖచ్చితంగా ఇలా మరో దర్శకుడుకు వివాదంలో ఇరుక్కుంటే ఇలాంటి చీప్ పనులు ఆయన చేయరనేది నిజం. ఇలాంటి వార్తలు గాలిలో పుట్టి..గాలిలో కలవటం తప్ప ఏమీ ఉండదు.
ఇక సింహ, లెజెండ్ తర్వాత బోయపాటి శ్రీను, బాలకృష్ణల కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రంపైనా భారీ అంచనాలున్నాయి. బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. టీజర్‌లో తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టుతో బాలయ్య ఎంట్రీ అదిరిపోయింది. ఒక ఫైట్‌కి సంబంధించిన ఎపిసోడ్.. ఆ తర్వాత డైలాగ్.. ఇలా టీజర్ కట్ చేశారు.
''ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో.. శీనుగారు మీ నాన్నగారు బాగున్నారా? అనేదానికి, శీనుగారు 'మీ అమ్మ మొగుడు' బాగున్నారా? అనేదానికి చాలా తేడా ఉందిరా.. లంబ్డీ కొడకా'' అనే డైలాగ్ బాలయ్య వాయిస్‌లో నిజంగా గర్జించినట్లే ఉదంటున్నారు ఫ్యాన్స్.
మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అలాగే బాలకష్ణ పుట్టినరోజు సందర్భంగా బిబి3 (బాలకష్ణ-బోయపాటి) ఫస్ట్ రోర్ పేరుతో ఓ లుక్‌ను, 64 సెకండ్స్‌తో ఉన్న ఓ వీడియోను విడుదల చేస్తే అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.