శ్రీదేవి, బోనీ కపూర్ సంపాదించిన ఆస్తులు అమ్మేస్తున్న జాన్వీ కపూర్.. ఇప్పటికే 4 అపార్ట్మెంట్ లు, ఎందుకంటే

Published : Dec 24, 2023, 05:21 PM IST

ఊహించని విధంగా అక్కా చెల్లెల్లు ఇద్దరూ తమ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులని అమ్మేస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీదేవి, బోనీ కపూర్ కలసి తమ కుమార్తెల కోసం బాగానే ఆస్తులు కూడబెట్టారు.

PREV
16
శ్రీదేవి, బోనీ కపూర్ సంపాదించిన ఆస్తులు అమ్మేస్తున్న జాన్వీ కపూర్.. ఇప్పటికే 4 అపార్ట్మెంట్ లు, ఎందుకంటే

జాన్వీ కపూర్ కి సిల్వర్ స్క్రీన్ పై పెద్దగా విజయాలు లేవు. కానీ గ్లామర్ తోనే ఆమె మిలియన్ల కొద్దీ అభిమానులని సొంతం చేసుకుంది. ఆన్ స్క్రీన్ కన్నా ఆఫ్ స్క్రీన్ లో ఎక్కువగా జాన్వీ కపూర్ అందాలు ఆరబోస్తోంది. శ్రీదేవి కుమార్తె అనే బ్రాండ్ ఎలాగూ ఉంది కాబట్టి గ్లామర్ షోలో జాన్వీ రెచ్చిపోతోంది. 

26

ఇప్పుడిప్పుడే జాన్వీ కపూర్ కి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. సౌత్ దర్శకులు కూడా జాన్వీ కపూర్ కి అవకాశాలు ఇస్తున్నారు. జాన్వీ నటిస్తున్న తొలి తెలుగు చిత్రం దేవర. ఎన్టీఆర్ సరసన జాన్వీ ఈ చిత్రంలో నటిస్తోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం విజయం సాధిస్తే జాన్వీ దశ తిరిగినట్లే అని చెప్పొచ్చు. 

36

ఇదిలా ఉండగా జాన్వీ కపూర్ చెల్లి ఖుషి కపూర్ కూడా మోడలింగ్ లో రాణిస్తోంది. ఇక బోనీ కపూర్ నిర్మాతగా అప్పుడప్పుడూ చిత్రాలు నిర్మిస్తూ సంపాదిస్తున్నారు. అయితే ఊహించని విధంగా అక్కా చెల్లెల్లు ఇద్దరూ తమ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులని అమ్మేస్తున్నట్లు తెలుస్తోంది. 

46

శ్రీదేవి, బోనీ కపూర్ కలసి తమ కుమార్తెల కోసం బాగానే ఆస్తులు కూడబెట్టారు. ముంబై మాత్రమే కాకుండా వివిధ నగరాల్లో వీరికి ఆస్తులు ఉన్నాయి. వీటిలో కొన్ని ఆస్తులు జాన్వీ, ఖుషి పేరుతో ఉన్నాయి. తాజా సమాచారం మేరకు కపూర్ సిస్టర్స్ ఇద్దరూ ముంబైలో ఉన్న 4 అపార్ట్మెంట్స్ ని అమ్మేసినట్లు తెలుస్తోంది. నాలుగు అపార్ట్మెంట్స్ ని జాన్వీ, ఖుషి దాదాపు 12 కోట్లకు అమ్మేశారట. 

56

దీనికి సంబంధించిన వివరాలు కూడా వైరల్ అవుతున్నాయి.  అంధేరి వెస్ట్ లో ఉన్న రెండు అపార్ట్మెంట్స్ ని సిద్దార్థ్ నారాయణ్, అంజు నారాయణ్ అనే వ్యక్తులకు 6 కోట్లకు అమ్మారట. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నవంబర్ లోనే ముగిసింది. ఈ రెండు ఫ్లాట్ లు 1860 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫ్లాట్స్ లో ఓపెన్ కారు పార్కింగ్ స్పేస్ కూడా ఉందట. 

66

మరో రెండు ఫ్లాట్లని ముకేశ్ భహిర్వాణి, లలిత్ భహిర్వాణి అనే వ్యక్తులకు అమ్మారట. వీటి విలువ కూడా 6 కోట్లు. శ్రీదేవి, బోనీ కపూర్ తమ సంపాదనతో ఈ ఆస్తులు కొన్నారు. అయితే ఇప్పుడు జాన్వీ క్రేజీ హీరోయిన్ గా సంపాదిస్తోంది. ఖుషి కూడా మోడలింగ్ లో రాణిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తమకి అంతగా అవసరం లేదనుకున్న ఆస్తులని అమ్మేసి విలాసవంతమైన విల్లా కొనాలనే ప్లాన్ లో కపూర్ సిస్టర్స్ ఉన్నారట. గత ఏడాది బోనీ కపూర్ 65 కోట్లతో ఒక లగ్జరీ హౌస్ కొన్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories