Bonalu Folk Song : మంగ్లీలోని మాస్ యాంగిల్ బైటపెట్టింది ఈ బోనాల సాంగే.. 92 మిలియన్స్ వ్యూస్ తో యూట్యూబ్ కే పూనకాలు

Published : Jul 03, 2026, 03:48 PM ISTUpdated : Jul 03, 2026, 04:03 PM IST

బోనాలు అంటేనే మాస్ మసాలా పండగ. మరి ఈ పండక్కి మాస్ సింగర్ మంగ్లీ ఆడిపాడితే..? పూనకాలు లోడ్ అవ్వడం ఖాయం. రావుతల్లి రావుతల్లి రేణుకెల్లమ్మా పాట ఇదే చేసింది… యావత్ తెలుగు ప్రజలతో చిందులేయించింది.

PREV
15
సూపర్ హిట్ బోనాలు సాంగ్

Bonalu Folk Song : ప్రస్తుతం జానపద పాటల హవా నడుస్తోంది. సినిమా పాటల కంటే ప్రైవేట్ సాంగ్స్ నే తెలుగు ప్రజలు ఇష్టపడుతున్నారు... అందుకే యూట్యూబ్ లో ఈ పాటలు ఇలా అప్లోడ్ చేయగానే అలా లక్షలు, కోట్ల వ్యూస్ సాధిస్తున్నాయి. ఈ జానపదాలు ఎంతలా ప్రజాధరణ పొందాయో చెప్పడానికి పర్పెక్ట్ ఉదాహరణ మంగ్లీ, నాగదుర్గ. ఈ ఫోక్ సాంగ్స్ తోనే మంగ్లీ స్టార్ సింగర్ అయితే, నాగదుర్గ సినిమా హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది.

అయితే ప్రస్తుతం ఆషాడమాసం బోనాల కోసం తెలంగాణ రెడీ అవుతోంది. ఈ నెలలోనే హైదరాబాద్ లో బోనాల వేడుకలు ప్రారంభం కానున్నారు. ఈ సందర్భంగా కొత్తకొత్త బోనాల పాటలు యూట్యూబ్ లో హల్ చల్ చేయడానికి సిద్దమవుతున్నాయి. కానీ గతంలో వచ్చిన ఓ సూపర్ హిట్ బోనాల సాంగ్ ఇప్పటికీ పట్నం గల్లీల్లో గట్టిగా వినిపిస్తుంది... అదే ''రావుతల్లి రావుతల్లి రేణుకెల్లమా''. ఈ ఊరమాస్ తెలంగాణ ఫోక్ ఈ బోనాల వేడుకల్లో పూనకాలు లోడ్ చేసేందుకు మళ్లీ సిద్దమవుతోంది.

25
రావుతల్లి రావుతల్లి రేణుకెల్లమ్మా సాంగ్ సాగుతుందిలా..

తెలంగాణలో గ్రామదేవతల ఆరాధన ఎక్కువగా కనిపిస్తుంది. ఒక్కో ఊరిలో ఒక్కో అమ్మవారిని కొలుస్తుంటారు. ఇలా హైదరాబాద్ లో వెలిసిన అమ్మవార్లకు నగరవాసులు భక్తిశ్రద్దలతో బోనాలను సమర్పిస్తుంటారు.. ఆషాడమాసం మొత్తం ఈ వేడుకలు జరుగుతాయి. ఇలా నగరంలో వెలిసిన అందరు అమ్మవార్లను స్మరించుకుంటూ రావుతల్లి రావుతల్లి పాట సాగుతుంది.

''రావు తల్లి రావు తల్లి రేణుకెల్లమ్మా...మిమ్ము రాజుగారు పిలువనంపె రేణుకెల్లమ్మా... తూరుపూ రాజులు రేణుకెల్లమా... టుంగు టుయ్యాల తెచ్చినారు రేణుకెల్లమ్మా... ఉత్తరం రాజులూ రేణుకెల్లమ్మా ముక్కుపుడకలే తెచ్చినారు రేణుకెల్లమ్మా.. పడమటీ రాజులు రేణుకెల్లమ్మా.. పట్టు చీరలే తెచ్చినారు నేణుకెల్లమ్మా... దక్షిణపు రాజులు రేణుకెల్లమ్మా... దండ కడియాలు పంపినారు రేణుకెల్లమ్మా'' అంటూ ఈ పాటు సాగుతుంది. అంటే అమ్మవారికి ఏ రాజులు ఏం సమర్పించారు, ఎంత భక్తతో పూజించారు అనేది ఈ పాట ద్వారా తెలియజేశారు.

ఇక ముత్యాలమ్మ, గోల్కొండ ఎల్లమ్మ, పోలేరమ్మ, గండి మైసమ్మ, గండి పోశమ్మ, మాంకాలమ్మ, బల్కంపేట ఎల్లమ్మ, మారెమ్మ, నూకాలమ్మ, సుంకాలమ్మ... అందరు దేవతలను ఈ ఫోక్ సాంగ్ లో తలచుకున్నారు. ఇలా బోనాల పండగ వేళ దేవతలందరికీ తన పాటతోనే బోనం సమర్పించారు మేకర్స్… ఆ అమ్మవార్ల నామస్మరణతో సాగే ఈ పాట తెలగు ప్రజలందరినీ ఆకట్టుకుంది.

35
మంగ్లీ మాస్ వాయిస్, ఊరమాస్ డ్యాన్స్ అదుర్స్

సాధారణంగా మంగ్లీ వాయిస్ ఊర మాస్ గా ఉంటుంది... బోనాలు కూడా మాస్ పీపుల్ పండగే. కాబట్టి రావుతల్లి రావుతల్లి రేణుకెల్లమ్మా అంటూ సాగే బోనాల సాంగ్ తెలంగాణ ప్రజల్లోకి చొచ్చుకెళ్లింది... ఈ పాటను గుంటెల్లో పెట్టుకున్నారు. మంగ్లీ వాయిస్ లో ఈ పాట అద్భుతంగా ఉంటుంది.

ఇక కేవలం పాటతోనే కాదు ఆటతోనూ ఆకట్టుకుంది మంగ్లీ. స్పీకర్ యూట్యూబ్ ఛానల్లో విడుదలైన ఈ పాటలో పల్లె మహిళలతో కలిసి మంగ్లీ బోనమెత్తి స్టెప్పులేయడం కనిపిస్తుంది. అచ్చతెలుగు తెలంగాణ మహిళలా ముస్తాబై బోనమెత్తిన మంగ్లీ ఆడిపాడుతుంటే తెలుగోళ్లు కన్నార్పకుండా చూశారు... అందుకే ఈ పాట మిలియన్స్ వ్యూస్ సాధించింది.

45
యూట్యూబ్ ను షేక్ చేస్తున్న బోనాలు సాంగ్

రావుతల్లి రావుతల్లి పాట యూట్యూబ్ ను షేక్ చేసింది... ఏకంగా 92 మిలియన్స్ అంటే 92814138 వ్యూస్ సాధించింది. అంతేకాదు 282k లైక్స్ వచ్చాయి… అంటే ఈ పాటను ప్రజలు ఎంతలా ఇష్టపడ్డారో అర్థమవుతుంది. ఇలా మంగ్లీ కెరీర్ లో గుర్తిండిపోయే పాటగా ఈ రావుతల్లి సాంగ్ నిలిచింది. గత రెండేళ్ళుగా బోనాల వేడుకల్లో ఈ పాట మారుమోగుతోంది. 

55
రావుతల్లి సాంగ్ వెనకున్నది వీళ్లే...

రావుతల్లి రావుతల్లి రేణుకెల్లమ్మా అంటూ సాగే హిట్ సాంగ్ మంగ్లీ ఖాతాలో పడింది… కానీ దీని వెనకాల అనేకమంది ఉన్నారు. ఈ పాటను మంగ్లీతో పాటు బిక్షమమ్మ పాడారు... సరికొత్తగా పల్లె గొంతులో ఈ పాట అద్భుతంగా వినిపించింది. అమ్మవార్లందరినీ స్మరిస్తూ లిరిక్స్ అద్భుతంగా రాశారు కమల్ ఎస్లావత్.

అయితే సురేష్ బొబ్బిలి మ్యూజిక్ యాడ్ అయ్యాక ఈ బోనాల పాటకు ప్రాణం వచ్చింది. మాస్ మ్యూజిక్ తో కుర్రకారుకు పూనకాలు తెప్పించారు. ఇక కొరియోగ్రఫి జాను లిరి ఊరమాసు స్టెప్పులు అందించారు. ఎక్కడా వెనక్కి తగ్గకుండా ప్రొడ్యూసర్ దాము రెడ్డి ఈ పాటను నిర్మించారు. ఇలా అందరూ 100 శాతం కష్టపడి చేశారు కాబట్టే 'రావుతల్లి రావుతల్లి రేణుకెల్లమ్మా'' సాంగ్ విడుదలై రెండేళ్లు అవుతున్నా ఇంకా వినిపిస్తోంది... ఈ బోనాలు వేడుకల్లో కూడా హల్ చల్ చేయనుంది.

Read more Photos on
click me!

Recommended Stories