కత్రీనా కౌఫ్ కు 7కోట్లు నష్టం తెచ్చిన మరో హీరోయిన్, ఎంత పనిచేసింది...

Published : Mar 10, 2024, 01:38 PM IST

తెలుగు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్. బాలీవుడ్ లో స్టార్ అయిన తరువాత టాలీవుడ్ వైపు తొంగి చూడలేదు. అయితే సౌత్ స్టార్ హీరోయిన్ వల్ల కత్రీనా భారీగా నష్టపోయిందట.   

PREV
16
కత్రీనా కౌఫ్ కు 7కోట్లు నష్టం తెచ్చిన మరో హీరోయిన్, ఎంత పనిచేసింది...

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది కత్రీనా కైఫ్. టాలీవుడ్  వెంకటేష్ జోడీగా  ఫస్ట్ మూవీ చేసి.. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ..  ఆతరువాత వెంటనే..  బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి.. అక్కడ స్టార్ హీరోల సరసన మెరిసి..ఒక ఊపు ఊపేసింది. మరీ ముఖ్యంగా సల్మాన్ ఖాన్ తో కత్రీనా జోడీ.. సూపర్ హిట్ అయ్యింది. 
 

26

వరుస సినిమాలతో బాలీవుడ్ ను అలరించిన కత్రీనా కైఫ్ .. స్టార్ హీరోల పక్కన నటించడంతో పాటు.. స్టార్ ఇమేజ్ కూడా సాధించింది. లక్షల మంది అభిమానులు సొంతం చేసుకుంది బ్యూటీ. ఇక బాలీవుడ్ లో ఆమెపై చాలా ప్రేమ కథలు నడిచాయి. చివరికి యంగ్ హీరో.. తనకంటే ఐదేళ్లు చిన్నవాడైన విక్కీ కౌశల్ ను ప్రేమించి పెళ్ళాడింది బ్యూటీ. 

36
Katrina

సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాను కూడా తన హాట్ ఫోటోలతో బ్లాస్ట్ చేస్తూ.. కుర్రాళ్ల  హృదయాలను కరించేస్తోంది.  బికినీ ఫోటోలతో కత్రీనా కత్తిలాంటి అందాలు.. నెటిజన్లకు నిద్ర లేకుండా చేశాయి.ఆమె ఫాలోయింగ్ పెరగడంలో.. హట్ ఫోటోషూట్ల పాత్ర చాలా ఉంది. 

46

కేవలం సినిమాలే కాకుండా ఇండియాలో ఫేమస్ బ్రాండ్స్ కు  అంబాసిడర్ గా ఉండేది. అటు వ్యాపారవేత్తగా బిజినెస్ రంగంలోనూ రాణించింది. 2023లో పెప్సికోకు చెందిన మామిడి కాయ జ్యూస్ స్లైస్ తో విడిపోవడంతో ఆమె ప్రయాణానికి ఎదురుదెబ్బ తగిలింది. లాక్మీ, L’Oreal వంటి ప్రతిష్టాత్మక బ్రాండ్‌లతో పేరుగాంచిన కత్రినా.. స్లైస్ బ్రాండ్ కు ఆమె ప్రధాన అంబాసిడర్ గా ఉంది. 
 

56

ఆతరువాత కాలంలో  స్లైస్ నుంచి కత్రినా తప్పుకోవడంతో.. ఆమె స్థానంలోకి కియారా వచ్చి చేరింది. ఇక ఈ యాడ్ కియారాకు ఎక్కువగానే కలిసొచ్చింది. ఇక తాజాగా స్లైస్ కు నయనతార అంబాసిడర్‌గా బాధ్యతలు స్వీకరించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రకటనలో నయనతార చాలా అందంగా  ఆకర్షణీయంగా కనిపించడం తో..  అభిమానులు ఆశ్చర్యపోయారు. 

66

ఈ లేడీ సూపర్ స్టార్ కత్రినా కైఫ్‌ను భర్తీ చేస్తుందనే ఊహాగానాలకు దారితీసింది. ఇదిలా ఉంటే.. కత్రినా స్లైస్ ఎండార్స్‌మెంట్ డీల్‌ను కోల్పోవడం ఆమెకు పెద్ద ఎత్తున ఆర్దిక నష్టాన్ని కలిగించింది. ఈ ఒక్క బ్రాండ్ కు ఆమె రూ. 6 నుంచి రూ. 7 కోట్లు వసూలు చేసేది. కానీ ఇప్పుడు స్లైస్ తో అనుబంధం తెగిపోయింది. కత్రినా కైఫ్ చివరిసారిగా టైగర్ 3 , మెర్రీ క్రిస్మస్ చిత్రాలలో కనిపించింది.

Read more Photos on
click me!

Recommended Stories