త్వరలో కియారా అద్వానీ - సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి.!? రూమర్లపై ఆసక్తికరంగా స్పందించిన బాలీవుడ్ స్టార్!

Published : Jan 12, 2023, 05:42 PM IST

కొద్దిరోజులు బాలీవుడ్ స్టార్స్ సిద్ధార్థ్ మల్హోత్రా - కియారా అద్వానీ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు బీటౌన్ లో ప్రచారం జరుగుతోంది. దీనిపై తొలిసారిగా హీరో సిద్ధార్థ్ మల్హోత్రా తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.  

PREV
16
త్వరలో కియారా అద్వానీ - సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి.!? రూమర్లపై ఆసక్తికరంగా స్పందించిన బాలీవుడ్ స్టార్!

చాలా కాలంగా బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra), హీరోయిన్ కియారా అద్వానీ  (Kiara Advani) డేటింగ్ లో ఉన్నారని బీటౌన్ లో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో త్వరలోనే వీరిద్దరూ ఒకటి కాబోతున్నారంటూ వార్తలు పుట్టుకొస్తున్నాయి.

26

గతేడాదే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని నెట్టింట పుకార్లు షికారు చేశాయి. 2022 డిసెంబర్ లోనే పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారని, మూడు నెలల్లో గ్రాండ్ గా వివాహా వేడుకలు జరగనున్నాయని, పెళ్లి వేదికగా వరల్డ్ మోస్ట్ బ్యూటీఫుల్ ప్లేస్ వియన్నా మారనుందని రూమర్లు వచ్చాయి. 
 

36

గతంలోనూ ఇలాంటి పుకార్లు చాలానే వచ్చాయి. వీటిపై ఎప్పుడూ సిద్ధార్థ్ కానీ, కియారా కానీ స్పందించలేదు. కనీసం ఖండించనూ లేదు. దీంతో అభిమానులు నిజమేననే భావనలో ఉండిపోయారు. మరోవైపు ఇద్దరూ కలిసే వేకేషన్స్ కు వెళ్తుండటం, ఫ్యామిలీ ఫంక్షన్స్ లోనూ కలిసి పాల్గొండుటంతో వీరి మధ్య రిలేషన్ ఉందంటున్నారు.

46

ఇక తాజాగా 2023 ఫిబ్రవరి 4,5 తేదీల్లో వీరి పెళ్లి వేడుకలు ఘనంగా జరగనున్నట్టు నెట్టింట కోడై కూస్తోంది. మెహందీ, హల్దీ మరియు సంగీత్ వంటి కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ జంట తమ పెళ్లి కోసం జైసల్మేర్ ప్యాలెస్ హోటల్‌ను బుక్ చేసుకున్నారని కూడా అంటున్నారు. 

56

దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో సిద్ధార్థ్ మల్హోత్రా స్పందించడం ఆసక్తికరంగా మారింది.  సిద్ధార్థ్ మాట్లాడుతూ.. తన పెళ్లికి తనను ఎవరూ పెళ్లికి ఆహ్వానించలేదని, పబ్లిక్‌ను కూడా ఆహ్వానించలేదని అన్నారు. తన పెళ్లికి రెండు సార్లు ముహూర్తం ఫిక్స్ చేశారని తెలిసిందన్నారు. అయితే, అభిమానులు తన వ్యక్తిగత జీవితంపై కంటే.. చిత్రాలపై దృష్టి సారిస్తే సంతోషంగా ఉంటుందని సూచించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
 

66

ఇక సిద్ధార్థ్ నటించిన తాజా చిత్రం ‘మిషన్ మజ్ను’ జనవరి 19న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయికగా నటిచింది. మరోవైపు కియారా అద్వానీ కార్తిక్ ఆర్యన్‌తో కలిసి ‘సత్యప్రేమ్ కి కథ’లో నటిస్తోంది. ఇక తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ‘ఆర్సీ15’లో ఆడిపాడుతున్న విషయం తెలిసిందే. 

Read more Photos on
click me!

Recommended Stories