
హీరోయిన్ల రెమ్యూనరేషన్లు లక్షల మాట ఎప్పుడో మర్చిపోయారు. కోట్లకి కోట్లు అందుకుంటున్నారు. కొట్లకు కోట్లు డిమాండ్చేస్తున్నారు. హార్డ్ వర్క్ తో నేమ్ ఫేమ్ మాత్రమే కాదు ఎర్నింగ్స్ లోనూ పీక్స్ కు చేరుకుంటున్నారు. మన సౌత్ హీరోయిన్ల తో పోల్చుకుంటే బాలీవుడ్ రేంజ్ 10 కోట్లు ఎప్పుడో దాటిపోయింది. అందుకే మన సౌత్ హీరోయిన్లు బాలీవుడ్ కు వెళ్ళాలని తహతహలాడుతున్నారు. అది సరే ఇప్పుడు బాలీవుడ్ లో ఏ హీరోయిన్ రెమ్యునరేషన్ తీసుకుంటుందో చూద్దాం.
బాలీవుడ్ లో సీనియర స్టార్ హీరోయిన్ల దగ్గరకు వెళ్ళే ముందు..మొన్నమొన్న వచ్చిన యంగ్ జనరేషన్ హీరోయిన్ల విషయం చూస్తే.. ఈ మధ్య వచ్చిన వారే ఇక్కడ కోటి పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ కూతురు జాన్వీ కపూర్ , అనన్య పాండే కోటిన్నర తీసుకుంటుంటే .. దిశాపటానీ, సారా అలీఖాన్ కూడా మేమేం తక్కువ అంటూ ఒక్కో మూవీకి ఒకటిన్నర నుంచి రెండున్నర కోట్ల వరకూ రాబడుతున్నారు.
ఇక సీనియర్ల విషయానికి వస్తే.. రెమ్యూనరేషన్ తో హాట్ టాపిక్ అవుతున్న హీరోయిన్లలో దీపికా పదుకోన్ ఒకరు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిన దీపికా ఒక్కో సినిమాకి దాదాపు 12 నుంచి 15 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుందట. లేటెస్ట్ గా ఓటీటీ రిలీజ్ అయిన రొమాంటిక్ మూవీ గెహరాయియాకు కూడా దీపిక 15కోట్లు తీసుకున్నట్టు సమాచారం. ఈ టాప్ హీరోయిన్ సౌత్ తో ప్రభాస్ తో భారీ బడ్జెట్ సినిమా చేస్తోంది. అటు నార్త్ లో వరసగా ప్రాజెక్ట్స్ ని లైన్లో పెట్టింది.
దీపికా తర్వాత బాలీవుడ్ లో హ్యాపెనింగ్ హీరోయిన్ ఆలియాభట్. అవ్వడానికి కుర్ర హీరోయిన్ అయినా.. సినిమాలవిషయం లోనే కాదు ..రెమ్యూనరేషన్ విషయంలో కూడా సీనియర్లతో పోటీ పడుతోంది. సినిమాని బట్టి ..రెమ్యూనరేషన్ విషయంలో మార్పులు చేసుకుంటంది ఆలియా. ఈ ముద్దు గుమ్మ సినిమాకు దాదాపు 15కోట్లు డిమాండ్ చేస్తుందట. ఇక రీసెంట్ గా సంజయ్ లీలా భన్సాలీ గంగూబాయ్ కతియావాడి, కరణ్ జోహార్ రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ ప్రాజెక్ట్స్ కోసం అలియా రెమ్యునరేషన్ తగ్గించుకుందట. కాని డార్లింగ్ మూవీ కోసం మాత్రం 15 కోట్లు ఫిక్స్ చేసిందనిసమాచారం.
సీనియర్ హీరోయిన్.. పైగా పెళ్లయ్యింది అయినా.. ఇంకా బాలీవుడ్ లో క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు కొత్త పెళ్లికూతురు కత్రినా కైఫ్ కి. ఇంకా రెమ్యూనరేషన్ విషయంలోడిమాండ్ లోనే ఉంది. ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లు దాటిన కత్రినా సినిమాకు 12 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. కత్రినా ప్రజెంట్ విజయ్ సేతుపతి మూవీ తో పాటు టైగర్ 3 సిరీస్ లో నటిస్తోంది.
బాలీవుడ్ లో నోరు పారేసుకునే హీరోయిన్ గాపేరు తెచ్చుకుంది ఫైర్ బ్రాండ్ కంగనా. అటు సినిమాలతో పాటు షోస్ కూడా చేస్తూ.. బాగా సంపాదిస్తోంది. విమెన్ సెంట్రిక్ సినిమాలు చేస్తూ..రెమ్యూనరేషన్ గట్టిగానే డిమాండ్ చేస్తుంది కంగనా. ప్రజెంట్ కంగనా సినిమాకు 10 కోట్లకు పైగా డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. కంగనా ఇప్పుడు దాక్కడ్ , తేజస్ లాంటి లేడీ ఓరియంటెడ్ యాక్షన్ డ్రామా సినిమాలు చేస్తోంది.
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అయిన కరీనా కపూర్ కూడా బాగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోంది. విజయేంద్ర ప్రసాద్ , అలౌకిక్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సీత సినిమాకి సంబందించి కరీనా కపూర్ 10 నుంచి 12 కోట్లు డిమాండ్ చేస్తోంది. పెళ్లయ్యి ఇద్దరు పిల్లల తల్లైనా ..ఇంకా కరీనా కి డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు.. అందుకే రెమ్యూనరేషన్ ఏమాత్రం తగ్గించుకోవట్లేదు కరీనా కపూర్.
ఇక బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లోనూ సత్తా చాటుతోంది ప్రీయాంకా చోప్రా. టాప్ హీరోయిన్ గా ఉన్న ప్రియాంకా చోప్రా పెళ్లి చేసుకుని ఫారెన్ లో సెటిల్ అయిపోయింది. అయినా సరే మన సినిమాలు మానేయలేదు.. రెమ్యునరేషన్ విషయంలో కూడా తగ్గేది లేదు అంటోంది. వరల్డ్ సినిమా స్క్రీన్ పై మెరుస్తున్న ఈ ఇండియన్ స్టార్ గర్ల్ ఈ మధ్య వచ్చిన ఓ సినిమాకు 8కోట్లు ఛార్జ్ చేసింది. కత్రినా, ఆలియా, ప్రియాంకా లీడ్ రోల్స్ లో తెరకెక్కబోతున్న జీ లే జరా ప్రాజెక్ట్ కోసం 12కోట్లు డిమాండ్ చేసిందని బాలీవుడ్ టాక్.
ఇక ఆషికీ హీరోయిన్ శ్రద్దా కపూర్ వరసగా సినిమాలు చేస్తూ రెమ్యూనరేషన్ కూడా బాగానే తీసుకుంటోంది. సాహో తో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో యాక్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ లవ్ రాంజన్ సినిమా కోసం 5 కోట్లకు పైనే డిమాండ్ చేస్తోంది. ఇక బ్యాక్ టూ బ్యాక్ విమెన్ సెంట్రిక్ సినిమాలు చేస్తూ.. వరస పెట్టి సినిమాలు రిలీజ్ చేస్తున్న తాప్సీ కూడా 5కోట్లకు తక్కువ తీసుకోవడం లేదు.
బాలీవుడ్ లో ఒకప్పుడు ట్రెండ్ సెట్ చేసిన విద్యాబాలన్ ఈమధ్య సినిమాల విషయంలో స్లో అయినా రెమ్యూనరేషన్ మాత్రం 4 కోట్ల దగ్గర ఫిక్స్ చేసేసింది. ఏజ్ బార్ అయితున్నా రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేది లేదు అంటోంది.
మరో వైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మైథలాజికల్ డ్రామా మూవీ ఆదిపురుష్ చేస్తోన్న కృతి సనన్ 4కోట్ల రేంజ్ లో ఉంది. సీత పాత్రలో మెరుపులు మెరిపించబోతోంది కృతి. అటు నార్త్, సౌత్ అనే తేడా ప్రాజెక్ట్స్ చేస్తోన్న కియారా లేటెస్ట్ గా వచ్చిన జుగ్ జుగ్ జియో కు రెండున్నర కోట్లు అందుకుంది. శంకర్ – రామ్ చరణ్ సినిమాకు 3 కోట్లు అడిగిందని సమాచారం.