ఇటు సినిమా.. అటు వ్యాపారం కోట్లు కూడబెడుతున్న ఆలియా భట్.. ఆస్తిఎంతంటే..?

First Published Mar 19, 2024, 4:36 PM IST

సినిమాలు మాత్రమే కాదు.. బిజినెస్ లో కూడా దూసుకుపోతున్నారు హీరోయిన్లు. బాలీవుడ్ , టాలీవుడ్ అన్న తేడా లేకుండా సినిమాల సంపాధనను వ్యాపారాలలో పెట్టుబడిపెడుతున్నారు. వారిలో ఆలియా భట్ కూడా ఉన్నారు. ఇంతకీ ఆలియా.. సినిమాలు..బిజినెస్ ల ద్వారా ఎంత ఆస్తి సంపాదించిందో తెలుసా..? 
 

Alia Bhatt

వారసత్వంగా ఇండస్ట్రీలోకి వచ్చినా.. సొంతంగా ఎదుగుతోంది ఆలియా భట్. హీరోయిన్ గా కెరర్ ను పరుగులుపెట్టించి ఆలియా.. పెళ్ళి తరువాత కాస్త జోరు తగ్గించింది. అయినా సరే సినిమాలు చేస్తూ.. సోషల్ మీడియాలో హడావిడి చేస్తూ.. బిజినెస్ రంగంలో  కూడా రాణిస్తోంది. చేతినిండా సంపాధిస్తోంది. 
 

ఆర్ఆర్ఆర్ తో పాటు బాలీవుడ్ నటి అలియా భట్ బ్రహ్మాస్త్ర 1, శివ, గంగూభాయ్ కతివాడి, గల్లీ భాయ్స్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసింది.  అంతే కాదు ఆమె నటించిన 20 సినిమాలలో 100 కోట్లు దాటిన సినిమాలు   7 ఉన్నాయి.  రీసెంట్ గా హాలీవుడ్ సిరీస్ హార్ట్ ఆఫ్ స్టోన్ లో అలియా నటించింది.
 

సినీరంగంలో నటిగా ఎలా సక్సెస్ అయ్యిందో, వ్యాపారంలోనూ జెండా ఎగురవేస్తోంది అలియా భట్. ఎడ్-ఎ-మమ్మా అనే పిల్లల స్పోర్ట్స్ వేర్ కంపెనీని నడిపిస్తోంది ఆలియా భట్. దీని ద్వారా ఆమె  వ్యాపార ప్రపంచంలోకి ప్రవేశించింది. సృజనాత్మకతతో బట్టలు తయారు చేస్తూ.. బ్రాండ్ నేమ్ సంపాదించుకోవడంతో పాటు .. బిజినెస్ ను అంచలంచలుగా పెంచుకుంటోంది . 
 

ఫ్యాషన్ డిజైన్‌లో రాజీ పడకుండా..అద్భఉతమైన డిజైన్లు.. క్వాలిటీ వర్క్ తో అందిస్తూ.. వ్యాపారాన్ని పెంచుకుంటూపోతోంది. ఈ బ్రాండ్ స్టార్ట్ చేసిన  ఏడాదిలోనే దాదాపు 150 కోట్ల విలువైన కంపెనీగా అవతరించింది. వీటితో పాటు అలియా భట్ IIT కాన్పూర్ యొక్క D2C వెల్నెస్ స్టార్టప్ ఫూల్.కోలో కూడా పెట్టుబడి పెట్టింది. ఎంత పెట్టింది అనేది తెలియదు కాని.. ఆమె పెట్టుబడులు మాత్రం అందులో ఉన్నట్టు తెలుస్తోంది.  
 

అలియా భట్ చాలా మందికి ఆదర్శంగా నిలుస్తోంది. సినిమాలతో పాటు.. బిజినెస్ లో కూడా సక్సెస్ ఫుల్ విమెన్ గా నిలిచింది. ఆమె ఇవి కాకుండా Nykaaలో  కూడా పెట్టబడి పెట్టినట్టు తెలుస్తోంది. అంతే కాదు అవి కొన్ని నెలల్లోనే 10రెట్లు పెరిగి 50 కోట్ల బిజినెస్ పెరిగినట్టు తెలుస్తోంది. అంతే కాదు.. ముంబైకి చెందిన వ్యక్తిగత స్టైలింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన స్టైల్ క్రాకర్ అనే మరో మహిళ యాజమాన్యంలోని వ్యాపారంలో ఆలియా ఇన్వెస్ట్ చేసిసట్టు సమాచారం. 
 

ఇక ఆలియా అటు సినిమాలు చేస్తూ.. ఇటు వ్యాపారం చూసుకుంటోంది. రీసెంట్ గా  నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన 'డార్లింగ్స్'తో అలియా భట్  నిర్మాతగా కూడా అవతారం ఎత్తింది. ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్' అనే నిర్మాణ సంస్థ కూడా ఆమె స్థాపించింది. 
 

ఫోర్బ్స్ ప్రకారం, అలియా భట్ నికర ఆస్తుల విలువ 300  కోట్లకు పైగా పెరిగిందట.  ఇది సినిమా మరియు పరిశ్రమ రెండింటిలోనూ కలగలిసి ఉంది. ఒక్కో సినిమాకి ఆమె 20 కోట్లు డిమాండ్ చేస్తుందట..  దీంతో అత్యధిక పారితోషికం తీసుకునే బాలీవుడ్ నటిగా ఆమె రెండో స్థానంలో నిలిచింది.
 

ఇక ఆమెకు ఆస్తులత పాటు ప్రాపర్టీస్ కూడా భారీగా ఉన్నట్టు తెలుస్తోంది. అలియాభట్ అపార్ట్‌మెంట్ విలువ 13.11 కోట్లు ఉంటుందట. అంతే కాదు ఆమె ముంబై లోని బాంద్రాలోని కాస్ట్లీ ఏరియాలో రెండు ఇళ్లు ఉన్నాయని అంటున్నారు. అంతే కాదు ఆమె గ్యారేజ్ లో కోట్లు విలువ చేసే కార్లు కూడా ఉన్నాయి. అందులో అలియా భట్ BMW 7 సిరీస్, ఆడి A6, ఆడి Q7 మరియు రేంజ్ రోవర్ వోగ్‌తో సహా అనేక లగ్జరీ కార్లను కూడా కలిగి ఉంది. ఈ లగ్జరీ కార్ల మొత్తం విలువ దాదాపు 3 కోట్లు ఉంటుందని అంచనా.

Ranbir Kapoor, Alia Bhatt

ఇక హీరోయిన్ గా దూసుకుపోయిన ఈ బ్యూటీ.. కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే రణ్ బీర్ ను పెళ్ళాడింది. అలియా భట్ మరియు రణబీర్ కపూర్ 5 ఏళ్ళుగా రిలేషన్ లో ఉన్నారు. పెళ్ళి చేసుకోబోయే ముందు  బ్రహ్మాస్త్రలో ఇద్దరు కలిసి నటించారు. ఇక కొన్నాళ్ళు కలిసి తిరిగిన వీరు..  2022లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు రాహా అనే కుమార్తె  కూడా ఉంది. 
 

click me!