RRR సక్సెస్ పార్టీలో బాలీవుడ్ తారలు.. హాట్ హాట్ గా రచ్చ చేసిన రాఖీ సావంత్

Published : Apr 07, 2022, 01:01 PM IST

మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. ఎక్కడ చూసిన ఆర్ఆర్ఆర్ చిత్ర వసూళ్ల జోరు తగ్గడం లేదు. 

PREV
17
RRR సక్సెస్ పార్టీలో బాలీవుడ్ తారలు.. హాట్ హాట్ గా రచ్చ చేసిన రాఖీ సావంత్
RRR Movie

మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. ఎక్కడ చూసిన ఆర్ఆర్ఆర్ చిత్ర వసూళ్ల జోరు తగ్గడం లేదు. ఆర్ఆర్ఆర్ మూవీ 1000 కోట్ల గ్రాస్ వైపు పరుగులు తీస్తోంది. ఊహించిన విధంగానే ఆర్ఆర్ఆర్ ఘన విజయం సాధించడంతో చీర యూనిట్ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో ఉంది. 

27
RRR Movie

రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ కి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గ్రాండ్ పార్టీ ఇచ్చారు. నైజాం ఏరియాలో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసింది ఆయనే. కేవలం నైజాంలో మాత్రమే ఆర్ఆర్ఆర్ మూవీ 100 కోట్ల షేర్ రాబట్టింది. ఇదిలా ఉండగా బాలీవుడ్ లో కూడా ఆర్ఆర్ఆర్ సక్సెస్ సెలెబ్రేషన్స్ షురూ అయ్యాయి. 

 

37
RRR Movie

హిందీలో ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ సంస్థ అధినేత జయంతి లాల్ రిలీజ్ చేశారు. హిందీలో కూడా ఆర్ఆర్ఆర్ చిత్రం 200 కోట్ల వసూళ్లతో దూసుకుపోతోంది. ఆర్ఆర్ఆర్ ఊహించిన విధంగా సక్సెస్ కావడంతో జయంతిలాల్ సక్సెస్ పార్టీ ఇచ్చారు. 

47
RRR Movie

ఈ పార్టీకి రాంచరణ్, ఎన్టీఆర్, రాజమౌళి, దానయ్య ఇతర ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ హాజరయ్యారు. అలాగే బాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా పార్టీలో పాల్గొన్నారు. కరణ్ జోహార్, జావేద్ అక్తర్, అమీర్ ఖాన్ లాంటి బాలీవుడ్ ప్రముఖులు ఆర్ఆర్ఆర్ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో పాల్గొన్నారు. 

57
RRR Movie

ఇక బాలీవుడ్ హాట్ బాంబ్ రాఖీ సావంత్ కూడా ఆర్ఆర్ఆర్ పార్టీలో మెరిసింది. ఊహించని విధంగా రాఖీ సావంత్ హాట్ అవుట్ ఫిట్ లో రచ్చ రచ్చ చేసింది. తనదైన స్టైల్ లో నాటు నాటు సాంగ్ కి స్టెప్పులు కూడా వేసింది. 

 

67
RRR Movie

అలాగే టివి నటి శ్వేతా తివారి కుమార్తె పాలక్ తివారి కూడా ఆర్ఆర్ఆర్ సక్సెస్ పార్టీలో మెరిసింది. గ్లామర్ ఒలకబోస్తూ పార్టీకి హాజరైంది. అలాగే బాలీవుడ్ హీరోయిన్ హ్యూమా క్యురేషి కూడా ఆర్ఆర్ఆర్ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. 

77
RRR Movie

ఆర్ఆర్ఆర్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి 2 వసూళ్ళని అధికమించి నయా ఇండస్ట్రీ హిట్ గా అవతరించింది. అన్ని ఏరియాలో బ్రేక్ ఈవెన్ సాధిస్తూ  బయ్యర్లకు లాభాలు తెచ్చిపెడుతోంది. 

click me!

Recommended Stories