చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనేది ఒప్పుకోవాల్సిన నిజం. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా పరిశ్రమకు వచ్చిన ప్రతి అమ్మాయికి ఏదో ఒక దశలో ఈ వేధింపులు ఎదురవుతాయి. దర్శకులు, నిర్మాతలు, హీరోల నుండి ఎదురయ్యే ఈ లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా మాట్లాడడానికి ఎవరూ సాహసం చేయరు. అలా చేస్తే తమ కెరీర్ అంతటితో ముగుస్తుందని భయపడతారు.