విలక్షణ నటుడి సంచలన వ్యాఖ్యలు.. నేను కూడా సుశాంత్‌ లాగే!

First Published Jul 2, 2020, 11:51 AM IST

 బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి 15 రోజులు దాటినా.. ఇప్పటికీ ఆయన మరణంపై చర్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా నెపోటిజం కారణంగా బాలీవుడ్‌లో అవుటర్స్‌ ఏ స్థాయిలో ఇబ్బంది పడుతున్నారో.. స్టార్ వారసులు టాలెంటెడ్ నటులకు రావాల్సిన అవకాశాలను ఎలా చెడగొడుతున్నారో పెద్ద ఎత్తున చర్చ జరగుతోంది.  ఈ విసయంపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు స్పందించగా తాజాగా మరో విలక్షణ నటుడు కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు.

నెపోటిజంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌ కూడా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నాడు. బిహార్‌లోని చిన్న రాష్ట్రంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన మనోజ్‌ చిన్నతనంలో ఓ గుడిసెలో నివసించేవాడు. తొమ్మిదేళ్ల వయసులో మనోజ్‌ తొలిసారిగా సినిమా చూశాడు.
undefined
ఆ సమయంలో సినిమా అంటే ఇష్టం ఏర్పడింది. బిగ్‌బీ అమితాబ్‌ అంటే ఆరాధన ఏర్పడింది. అప్పుడే సినిమాల్లో స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు మనోజ్‌. చదువు మీద మనసు లఘ్నం చేయలేక 17 ఏళ్ల వయసులో ఇళ్లు వదిలి డీయూ వెళ్లి అక్కడ నటకాలల్లో చేరాడు. కొద్ది రోజులకు విషయం తెలుసుకున్న మనోజ్ తండ్రి, కొడుకు కోరికను అర్ధం చేసుకొని సహాయం చేశాడు.
undefined
అయితే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి మనోజ్‌ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో ఇంగ్లీష్‌, హిందీ, బోజ్‌పూరి భాషలు నేర్చుకున్న మనోజ్‌ ఎన్‌ఎస్‌డీకి అప్లై చేసి మూడు సార్లు రిజెక్ట్ అయ్యాడు. దీంతో మనో వేదనకు గురై ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఆ సమయంలో తన స్నేహితులు తనను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారని తెలిపాడు మనోజ్‌.
undefined
తొలి అవకాశం తనకు ఓ ఛాయ్‌ షాప్‌లో ఉన్నప్పుడు వచ్చిందని తెలిపాడు మనోజ్‌. టిగ్మాన్షు స్కూటర్‌ మీద వచ్చి శేఖర్‌ కపూర్‌ తనను బండిట్‌ క్వీన్ సినిమా కోసం తీసుకోవాలని భావిస్తున్నట్టుగా చెప్పాటంతో ముంబైకి చేరినట్టుగా వివరించాడు.
undefined
ఇండస్ట్రీలోనూ ఎన్నో అవమానాలు ఎదురయ్యాయన్న మనోజ్‌.. ఓ నిర్మాణ సంస్థ తన ఫోటోలను తన ఎదురుగానే చించేందని చెప్పాడు. అంతేకాదు ఒకే రోజు మూడు ప్రాజెక్ట్‌ ల నుంచి తొలగించారని చెప్పాడు. నీ ముఖం బిగ్ స్క్రీన్‌ కు సూట్‌ కాదని అవమానించారని అయితే నాలుగు సంవత్సరాల పోరాటం తరువాత తనకు బ్రేక్‌ వచ్చిందని వివరించాడు మనోజ్‌.
undefined
click me!