కన్నీళ్లు ఆపుకోలేని విధంగా లైఫ్ స్టోరీ..వెక్కి వెక్కి ఏడ్చిన షకీలా, మానస్ ఏం చేశాడో తెలుసా

First Published | May 11, 2024, 7:47 PM IST

శృంగార పరమైన పాత్రలతో ఓ వెలుగు వెలిగిన షకీలా జీవితంలో చీకటి కష్టాలు చాలానే ఉన్నాయి. వాటన్నింటిని భరిస్తూ ఆమె బోల్డ్ నటిగా గుర్తింపు పొందింది.

శృంగార పరమైన పాత్రలతో ఓ వెలుగు వెలిగిన షకీలా జీవితంలో చీకటి కష్టాలు చాలానే ఉన్నాయి. వాటన్నింటిని భరిస్తూ ఆమె బోల్డ్ నటిగా గుర్తింపు పొందింది. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లేకపోయినా షకీలా కష్టాలన్నింటినీ ఎదుర్కొంది. తన లైఫ్ స్టోరీ గురించి షకీలా గతంలో పలుమార్లు వివరించింది. 

తాజాగా ఆమె జీవితాన్ని దృశ్యం రూపంలో కళ్ళకు కట్టేలా చూపించారు. ఆదివారం మే 12న మదర్స్ డే సందర్భంగా స్టార్ మాలో లవ్ యు అమ్మా అనే షో ప్లాన్ చేశారు. ఈ షోకి యాంకర్ రవి, వర్షిణి హోస్ట్ లు గా చేస్తున్నారు. జబర్దస్త్ రోహిణి, భానుశ్రీ, బుల్లితెర నటుడు మానస్ లాంటి వాళ్లంతా వారి తల్లులతో ఈ షోలో పాల్గొన్నారు. 


షకీలా కూడా హాజరైంది. ఇతర బుల్లితెర నటీనటులు సందడి చేశారు. ఈ షోకి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది. చూస్తుంటే ఈ షోని తల్లి ప్రేమ ఎలా ఉంటుందో తెలియజేసేలా చాలా ఎమోషనల్ గా తీర్చిదిద్దినట్లు ఉన్నారు. ప్రతి ఒక్కరూ తమ తల్లితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. 

ఇక చివర్లో షకీలా జీవితాన్ని దృశ్య రూపంలో వివరించే ప్రయత్నం చేశారు. తన జీవితాన్ని తానే చూసుకుంటూ షకీలా వెక్కి వెక్కి ఏడ్చింది.కుటుంబ సభ్యులు తనని బలవంతంగా డబ్బు కోసం ఎలా శృంగార నటిగా మార్చారు.. సొంత తోబుట్టువు అక్కని నమ్మి ఎలా షకీలా మోసపోయింది లాంటి అంశాలు కళ్ళకు కట్టినట్లు చూపించారు. 

సినిమాల ద్వారా తాను సంపాదించిన డబ్బు అంతా తన అక్క ఎలా వాడుకుని మోసం చేసింది లాంటి విషయాలని చూపించారు. చివరికి తాను ఒంటరిగా మారితే టాన్స్ జెండర్స్ తనని అమ్మగా ఎలా స్వీకరించారో కూడా చూపించారు. ఆ దృశ్యాలకు షకీలా ఎమోషనల్ అయింది. 

కంటేనే అమ్మ కాదు.. వీళ్లంతా నా బిడ్డలే అని షకీలా ట్రాన్స్ జెండర్స్ ని ఉద్దేశించి చెబుతూ భావోద్వేగానికి గురైంది. ఇందంతా యాంకర్ రవి ప్లానింగ్ లో జరిగినట్లు ఉంది. మొత్తంగా ప్రోమో నెటిజన్లని విశేషంగా ఆకట్టుకుంటోంది. 

చివర్లో సుద్దపూస కుర్రాడు లాస్ట్ పంచ్ అన్నట్లుగా అద్భుతమైన మాట చెప్పాడు.. వచ్చే జన్మ ఉంటే మా అమ్మని తాను అమ్మగా పుడతానని అన్నాడు. మదర్స్ డే సందర్భంగా బుల్లితెర హీరో మానస్ కూడా గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. ఆడపిల్లల చదువు కోసం కొంత మొత్తం విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. 

Latest Videos

click me!