అయితే వీరి టాస్క్ లకు సంచాలక్ గా ఉన్న ప్రేరణ కూడా నిఖిల్ ను ఆ టాస్క్ లో విన్నర్ ను చేయాలని చాలా ప్రయత్నం చేసింది. ఒక రకంగా ప్రేరణ సంచాలక్ గా ఫెయిల్ అయ్యిందని చెప్పాలి. ఇక అనవసరంగా గౌతమ్ ను టార్గెట్ చేసి తన గ్రాఫ్ ను పడేసుకుంటున్నాడు నిఖిల్. టైటిల్ రేస్ లో ఉన్న ఈ ఇద్దరు మరోసారి గొడవపెట్టుకోవడం.. ఆడియన్స్ కు కూడా చిరాకు తెప్పిస్తోంది.
రెండు రోజులు ముందే ఒకరికి మరొకరు సారి చెప్పుకుని హగ్గులిచ్చుకుని మరీ ఫ్రెండ్స్ అయ్యారు. అంతలోనే టాస్క్ విషయంలో గౌతమ్ ను నిఖిల్ రెచ్చగొట్టడంతో గౌతమ్ కూడా రెచ్చిపోయాడు. దాంతో మాటలు జారడం మరోసారి తప్పలేదు. గౌతమ్ విషయంలో నిఖిల్ అనవసరంగా తన ఇమేజ్ ను పొగొట్టుకుంటున్నట్టు అనిపిస్తోంది.
రంగు పడుద్ది టాస్క్ లో హోరా హోరీ పోరాడారు గౌతమ్, నిఖిల్, కాని సంచాలక్ గా ఉన్న ప్రేరణ కాస్త బయాస్ గా జడ్జిమెంట్ ఇచ్చినట్టు అర్దం అవుతుంది. ఎంతసేపు నిఖిల్ విన్ అవ్వాలి అన్న ఆలోచనే కనిపిస్తుంది.