ఇక సిరి హన్మంత్ యూట్యూబర్ గా, టెలివిజన్ ప్రజెంటర్ గా కెరీర్ ప్రారంభించి ప్రస్తుతం నటిగా, యాంకర్ గా మంచి అవకాశాలు అందుకుంటోంది. ఇప్పటికే సీరియల్స్ తోనూ అలరించింది. ప్రస్తుతం వెండితెరపైనా ఆఫర్లు అందుకుంటోంది. చివరిగా ‘జవాన్’లో మెరిసింది. మరోవైపు ‘జబర్దస్త్’కు యాంకర్ గా వ్యవహరిస్తోంది. అటు ‘ఢీ ప్రీమియర్ లీగ్’కూ హోస్ట్ గా వ్యవహరిస్తోంది.