భరణిని ఏడిపించి వెళ్లిన దివ్య తల్లి..బిగ్ బాస్ అయ్యాక పవన్, రీతూ లది ఎవరిదారి వారిదే

Published : Nov 20, 2025, 12:02 AM IST

Bigg Boss Telugu  9: బిగ్ బాస్ తెలుగు 9 షోలో 73వ్ రోజు హౌస్ లోకి ఇంటి సభ్యుల ఫ్యామిలీ మెంబర్ ఎంట్రీ ఇచ్చారు. డిమాన్ పవన్, సంజన, దివ్య తమ కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. 

PREV
15
బిగ్ బాస్ హౌస్ లో 73వ రోజు 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 73 వ రోజు ఫ్యామిలీ ఎమోషన్స్ తో నిండిపోయింది. కొందరు హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. దీనితో భావోద్వేగ సన్నివేశాలు, సరదా సంభాషణలు చోటు చేసుకున్నాయి. సంజన భర్త, పిల్లలు.. డిమాన్ పవన్ తల్లి.. దివ్య తల్లి హౌస్ లోకి ఒక్కొక్కరుగా ఎంట్రీ ఇచ్చారు.

25
డిమాన్ తల్లి హౌస్ లోకి ఎంట్రీ 

ముందుగా హౌస్ లోకి డిమాన్ పవన్ తల్లి వచ్చారు. హౌస్ లోకి రాగానే ఆమెని ఇంటి సభ్యులంతా పలకరించారు. ఆమె తన కొడుకుని కౌగిలించుకుని భావోద్వేగానికి గురైంది. పవన్ బాగా ఆడుతున్నడని అతడి తల్లి ప్రశంసించింది. రీతూని తోసేసినందుకు ఇంట్లో ఏమైనా ఫీల్ అయ్యారా అని పవన్ అడిగాడు. అలాంటిది ఏమీ లేదని ఆమె బదులిచ్చింది. సమయం పూర్తి కావడంతో ఆమె హౌస్ నుంచి బయటకి వెళ్లారు.

35
సంజన కోసం 15 నిమిషాలు త్యాగం చేసిన ఇమ్మాన్యుయేల్ 

ఆ తర్వాత హౌస్ లోకి వచ్చింది సంజన భర్త పిల్లలు. అయితే దీనికి ముందు పెద్ద హైడ్రామా సాగింది. తన ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి రావాలంటే ముగ్గురు ఇంటి సభ్యులని టైం రిక్వస్ట్ చేసుకోవాలి అని బిగ్ బాస్ తెలిపారు. ఇమ్మాన్యుయేల్ వద్ద 45 నిమిషాల టైం ఉంది. దీనితో సంజనకి 15 నిమిషాలు ఇవ్వడానికి ఇమ్మాన్యుయేల్ అంగీకరించారు. కళ్యాణ్ 5 నిమిషాలు ఇవ్వడానికి అంగీకరించాడు. కళ్యాణ్ వద్ద ఉన్నది తక్కువ సమయం కావడంతో అతడి నుంచి సంజన కేవలం 1 నిమిషం మాత్రమే తీసుకుంది. దీనితో సంజనకి మొత్తం 16 నిమిషాల టైం దక్కింది. ఇంతలో సంజన భర్త పిల్లలు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. 

45
భర్త, పిల్లలని చూసి ఎమోషనల్ అయిన సంజన 

సంజన తన భర్త పిల్లలని చూడగానే ఎంతో ఎమోషనల్ అయ్యారు. కొడుకు కూతురితో కాసేపు ఆడుకున్నారు. ఆ తర్వాత భర్తతో ఏకాంతంగా మాట్లాడారు. సంజన కొడుకు హౌస్ మేట్స్ అందరితో సరదాగా కనిపించాడు. అమ్మ గెలిచి రా అంటూ ఆమె కొడుకు సంజనకు ముద్దుగా చెప్పాడు. 16 నిమిషాలు పూర్తి కావడంతో సంజన భర్త పిల్లలు హౌస్ ని వీడి వెళ్లారు. 

55
హౌస్ లో హంగామా చేసిన దివ్య తల్లి 

చివరగా హౌస్ లోకి వచ్చింది దివ్య తల్లి. దివ్య తల్లి హౌస్ లోకి రాగానే చాలా హుషారుగా కనిపించారు. గలగలా మాట్లాడుతూ హౌస్ లో సందడి చేశారు. హౌస్ లో ఏడవద్దు అని దివ్య తల్లి కూతురికి చెప్పింది. నువ్వు ఏడుస్తుంటే నాన్న టీవీ చూడకుండా వెళ్ళిపోతున్నాడు అని పేర్కొంది. ఆ తర్వాత దివ్య తల్లి ఇంటి సభ్యులందరితో మాట్లాడింది. మీరెవ్వరూ మీ క్యారెక్టర్ మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి అని తెలిపారు. హౌస్ లో ఉన్న ఒక్కొక్కరి గురించి చెబుతూ.. పవన్, రీతూ గురించి సెటైర్లు వేసింది. మీ ఇద్దరిదీ ఒక ట్రాక్ అందిస్తోంది. బిగ్ బాస్ అయ్యాక మీరిద్దరూ ఎవరి దారి వారిదే అంటూ వెళ్ళిపోతారు అని దివ్య తల్లి ఫన్నీగా చెప్పారు. అనంతరం భరణి గురించి చెబుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. భరణి గారిని చూస్తుంటే చనిపోయిన తన అన్నయ్య గుర్తుకు వస్తున్నారని ఆమె ఎమోషనల్ గా చెప్పారు. దీనితో భరణి కూడా ఆమెని హగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories