మాజీ కంటెస్టెంట్ల ముందు తేలిపోయిన తనూజ, సుమన్ శెట్టి.. మానస్ ని ఓడించిన పవన్

Published : Nov 26, 2025, 11:08 PM IST

బిగ్ బాస్ తెలుగు 9 షోలో 80వ రోజు హౌస్ లో మాజీ కంటెస్టెంట్స్ సందడి చేశారు. మాజీ కంటెస్టెంట్లతో జరిగి పోటీలో పవన్ ఒక్కడే పై చేయి సాధించాడు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15
బిగ్ బాస్ తెలుగు 9

బిగ్ బాస్ తెలుగు 9 షోలో 80వ రోజు ఆసక్తికరంగా సాగింది. హౌస్ లోకి మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ప్రేరణ, దేత్తడి హారిక, మానస్ లాంటి వాళ్ళు ఒక్కొక్కరుగా ఎంట్రీ ఇచ్చారు. వీరంతా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లలో తమకి నచ్చిన వారిని పోటీగా ఎంచుకున్నారు. వీరితో పోటీలో విజయం సాధించిన కంటెస్టెంట్లకు బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ కంటెండర్లుగా అవకాశం దక్కుతుంది. అలా అవకాశం దక్కించుకున్న వారు హౌస్ లో చివరి కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 

25
హౌస్ లో ప్రేరణ కంబం

సందడి  ముందుగా హౌస్ లోకి ప్రేరణ ఎంట్రీ ఇచ్చింది. ప్రేరణ బిగ్ బాస్ తెలుగు 8లో టాప్ 5 కంటెస్టెంట్ గా నిలిచింది. ప్రేరణ హౌస్ లోకి వచ్చి కంటెస్టెంట్స్ తో సరదాగా ముచ్చటించింది. ఆ తర్వాత ప్రేరణ తనతో పోటీ పడే కంటెస్టెంట్ ని ఎంచుకుంది. హౌస్ మేట్స్ అంతా తమకే అవకాశం ఇవ్వాలని ప్రేరణని రిక్వస్ట్ చేసుకున్నారు. తనూజ తెలివిగా.. ప్రేరణ నువ్వు చాలా బలమైన వ్యక్తిని, కాబట్టి నీతో పోటీ పడాలని అనుకుంటున్నా అంటూ బిస్కెట్ వేసింది. తనూజ పొగడ్తలకు పడిపోయిందో ఏమో కానీ ప్రేరణ ఆమెకే అవకాశం ఇచ్చింది. 

35
తేలిపోయిన తనూజ 

దీనితో తనూజ, ప్రేరణ పోటీ షురూ అయింది. బిగ్ బాస్ చెప్పినట్లుగా టేబుల్ పై ఉన్న హొల్స్ లో బాల్స్ ని వేయాలి. ఈ టాస్క్ లో తనూజ తేలిపోయింది. ప్రేరణ విజయం సాధించింది. దీనితో తనూజకి కెప్టెన్సీ కంటెండర్ గా అవకాశం పోయింది. ఆ తర్వాత హౌస్ లో భరణి, దివ్య మధ్య ఎప్పటిలాగే గిల్లికజ్జాలు మొదలయ్యాయి. ఇకపై నుంచి తాను తక్కువ మాట్లాడడానికి ట్రై చేస్తాను అని భరణి అన్నాడు. దివ్య బదులిస్తూ అలాగే ట్రై చేయండి.. ఎక్కువ మాట్లాడమని నేనేమైన ఫోర్స్ చేస్తున్నానా అని తెలిపింది. సంబంధం లేకుండా మాట్లాడకు దివ్య అని భరణి ఫైర్ అయ్యారు. 

45
నీకొక నమస్కారం

అంటూ దివ్యతో భరణి గొడవ  దివ్య నీకొక నమస్కారం అని భరణి అన్నారు. అలాంటి మాటలు మాట్లాడవద్దు అని దివ్య కూడా ఫైర్ అయింది. ప్రతిసారీ హౌస్ లో నా ఏజ్ గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నావ్ అని భరణి అడిగారు. మీరంతా నాపై జోకులు వేస్తే నేను భరించాలి.. నేను జోకు వేస్తే మాత్రం గొడవ పెట్టుకుంటారు అని దివ్య బాధపడింది. 

55
కెప్టెన్సీ కంటెండర్ గా పవన్ 

ఆ తర్వాత హౌస్ లోకి దేత్తడి హారిక వచ్చింది. హారిక తనకి పోటీదారుగా సుమన్ శెట్టిని ఎంచుకుంది. టవర్ ఆకారాన్ని నిర్మించే టాస్క్ లో హారిక విజయం సాధించింది. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు 5 టాప్ 5 కంటెస్టెంట్ మానస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు మానస్ తన ప్రత్యర్థిగా డిమాన్ పవన్ ని ఎంచుకున్నాడు. ఈ టాస్క్ లో బంతులని మేకులకు గుచ్చుకునేలా విసిరి కొట్టాలి. ఎవరు ఎక్కువ బంతులు అలా విసిరి కొడితే వారే విజేతలు. ఈ పోటీలో మానస్ పై పవన్ విజయం సాధించాడు. దీనితో పవన్ కి కెప్టెన్సీ కంటెండర్ గా అవకాశం దక్కింది. 

Read more Photos on
click me!

Recommended Stories