మేకప్ లేకున్నా మెరిసిపోతున్న ‘కేజీఎఫ్’ బ్యూటీ.. క్యూట్ సెల్ఫీలతో కవ్విస్తున్న శ్రీనిధి శెట్టి

First Published | Aug 23, 2023, 10:22 AM IST

‘కేజీఎఫ్’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి సినిమాల పరంగా ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకున్నా.. సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానులకు చాలా దగ్గరగానే ఉంటోంది. వరుస పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది.
 

కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty)  తొలుత మోడల్ గా తన కెరీర్ ను ప్రారంించింది. 2016లో మిస్ సుప్రనేషనల్ పోటీల్లో ఫైనల్ వరకు వెళ్లింది. ఈ ఏడాది సుప్ర ఐకాన్ వరల్డ్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. 
 

‘కేజీఎఫ్’తో పాన్ ఇండియా హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి గుర్తింపు  దక్కించుకుంది. ప్రశాంత్ నీల్ - యష్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం భారీ సక్సెస్ ను అందుకోవడంతో శ్రీనిధి కి కూడా కావాల్సినంత క్రేజ్ వచ్చింది. మరోవైపు ఈ ముద్దుగుమ్మ పెర్ఫామెన్స్ కూ ఆడియెన్స్ ఫిదా అయ్యారు. 


అయితే, కేజీఎఫ్ 1, 2 ఛాప్టర్ల తర్వాత శ్రీనిధి కేవలం తమిళ స్టార్ చియాన్ విక్రమ్ సరసన ‘కోబ్రా’లో మెరిసింది. ఆ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక నెక్ట్స్ సినిమాలతోనైనా అలరిస్తుందని ఫ్యాన్స్ భావించారు. కానీ ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లే అందకపోవడం గమనార్హం.

తదుపరి చిత్రాలపై శ్రీనిధి ఎప్పుడు అప్డేట్ ఇస్తుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తొలిచిత్రంతోనే భారీ సక్సెస్ ను అందుకున్న ఈ ముద్దుగుమ్మ  ఇప్పుడు ఏమాత్రం సందడి చేయడం లేదు. సినిమాల గురించి అప్డేట్స్ ఇవ్వడం లేదు.
 

కానీ సోషల్ మీడియాలోనూ మాత్రం శ్రీనిధి నిత్యం యాక్టివ్ గానే కనిపిస్తోంది. తన బ్యూటీఫుల్ ఫొటోలను పంచుకుంటూ ఆకట్టుకుంటోంది. తాజాగా మేకప్ లేకుండా నేచురల్ బ్యూటీతో కట్టిపడేసింది. బ్యూటీఫుల్  స్మైల్ తో, ఊరించే పెదాలతో కిస్సులు ఇస్తూ కలవరపెట్టింది. ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను ఫిదా చేసింది. 
 

గ్లామర్ షోకు దూరంగా ఉండే ఈ ముద్దుగుమ్మ.. క్యూట్ ఫొటోషూట్లతో ఇలా ఆకట్టుకుంటోంది. అయితే, తనకు నచ్చిన పాత్రలు లభించకపోవడం వల్లే శ్రీనిధి నుంచి సినిమా అప్డేట్స్ రావడం లేదని తెలుస్తోంది. గ్లామర్ రోల్స్ లో కాకుండా ప్రాధాన్యత ఉన్న రోల్స్ లో మెరిసేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. 
 

Latest Videos

click me!