సీరియల్ నటి కీర్తి భట్, ఆరోహి రావు, గీతూ రాయల్, నేహా చౌదరి,ఫైమా లుక్స్ పై విపరీతమైన జోక్స్ పేలుతున్నాయి. ఫస్ట్ ఎపిసోడ్ లో చూసింది వీళ్లేనా అని కన్ఫ్యూజ్ అవుతున్నాం , వాళ్లకు కొంచెం మేకప్ వేయండయ్యా అంటూ సెటైర్లు వేస్తున్నారు. వాస్తవంగా కూడా మేకప్ లెస్ లుక్ లో కొందరు లేడీ కంటెస్టెంట్స్ ని గుర్తుపట్టడం కష్టంగా మారింది. అయితే సహజమైన అందాలను గౌరవించాల్సిందే. ప్రొఫెషన్ కోసం మేకప్, హౌస్ లో అవసరం లేదు. వీకెండ్ మాత్రం చక్కగా రెడీ అవుతారు.