Bigg Boss Telugu6: సూర్య నా క్రష్ ఎందుకో బాగా నచ్చేస్తున్నాడు... బిగ్ బాస్ ముందు ఓపెన్ అయిన ఇనయా సుల్తానా!

Published : Oct 05, 2022, 11:44 PM IST

బుధవారం ఎపిసోడ్ లో కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీక్రెట్ రూమ్ కి ఇనయాను పిలిచిన బిగ్ బాస్ ఇంటి సభ్యుల విశేషాలు చెప్పమంటే తన లవ్ మ్యాటర్ లీక్ చేసింది.   

PREV
18
Bigg Boss Telugu6: సూర్య నా క్రష్ ఎందుకో బాగా నచ్చేస్తున్నాడు... బిగ్ బాస్ ముందు ఓపెన్ అయిన ఇనయా సుల్తానా!
Bigg Boss Telugu 6


సెప్టెంబర్ 5వ తేదీ ఎపిసోడ్ అర్థ రాత్రి స్టార్ట్ అయ్యింది. బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ పూర్తి చేయడం కోసం ఫైమా మేల్కొని ఉంది. అయితే వాసంతి, మెరీనా సైతం మేల్కొని ఉన్నారు. దెయ్యాల గెటప్స్ లో వారిద్దరూ ఫైమా, రాజశేఖర్, గీతూలను భయపెట్టారు. 
 

28
Bigg Boss Telugu 6


అనంతరం బిగ్ బాస్ కేక్ పంపారు. ఆ కేక్ కేవలం నలుగురు ఇంటి సభ్యులు మాత్రమే తినాలని ఆదేశించాడు. ఎవరు తినాలని నిర్ణయించుకునే లోపు సమయం ముగిసింది. దాంతో బిగ్ బాస్ కేక్ ని వెనక్కి తీసుకున్నాడు. అనంతరం బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ లోకి ఇనయా సుల్తానాను పిలిచాడు. ఆమె ముందు కేక్ ఉంచి, అది తినాలంటే ఇంటి సభ్యుల గురించి చెప్పాలని కండీషన్ పెట్టాడు. 
 

38
Bigg Boss Telugu 6

ఈ క్రమంలో ఇనయా తన లవ్ మేటర్ బయటపెట్టింది. కొందరు నాకు రాజ్ అంటే ఇష్టం అంటున్నారు. కానీ సూర్య నా క్రష్. అతడు ఎందుకో నచ్చేస్తున్నాడని చెప్పింది. ఇక మొదట్లో శ్రీసత్యకు దగ్గర అవ్వాలని అర్జున్ చూశాడు. కానీ ఈ మధ్య అతని ఫోకస్ వాసంతి వైపుకు మళ్లింది. వాసంతి కూడా అతడి పట్ల ఇంట్రెస్ట్ గా ఉన్నట్లు అనిపిస్తుందని రెండు విషయాలు చెప్పింది. ఇక ఇంటి సభ్యులు నన్ను వేరుగా చూస్తున్నారు. తొక్కేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అయినా నేను ఎదిరించి నిలబడతా, ఆట ఆడతా అంటూ ఎమోషనల్ అయ్యింది. ఆమెకు బిగ్ బాస్ కేక్ ఇచ్చాడు. 
 

48
Bigg Boss Telugu 6

తర్వాత  కొంచెం జుగుప్స కలిగించే సన్నివేశం చోటు చేసుకుంది. మేల్ కంటెస్టెంట్స్ వెంట్రుకలు పీకే కార్యక్రమాన్ని అమ్మాయిలు తలకెత్తుకున్నారు. అదేదో సమాజ సేవ అన్నట్లు పోటీపడి మరీ ఆ పని పూర్తి చేశారు. కంటెస్టెంట్స్ చలాకీ చంటి, శ్రీహాన్ రెండు కాళ్లకు పూర్తిగా వాక్స్ చేయించుకోవాలని బిగ్ బాస్ డిసైడ్ చేశాడు. ఈ విషయాన్ని బాల ఆదిత్య చదివి కంటెస్టెంట్స్ కి చెప్పారు. దీంతో శ్రీహాన్, చంటిలను గార్డెన్ ఏరియాలోకి తీసుకెళ్లారు. ఇద్దరినీ పడుకోబెట్టి వాక్స్(కాళ్ళ వెంట్రుకలు పీకడం) చేయడం స్టార్ట్ చేశారు. ఈ పనికి లేడీ కంటెస్టెంట్స్ ఆసక్తి చూపించారు. 
 

58
Bigg Boss Telugu 6

శ్రీసత్య, గీతూ, ఇనయ, వాసంతి, కీర్తి వాళ్ళిద్దరి చుట్టూ చేరారు. శ్రీహాన్, చంటి కాళ్ళ వెంట్రుకలు పీకేందుకు ఉత్సాహం చూపించారు.గమ్ ఉన్న పట్టీలు కాళ్లకు అంటించి లాగుతుంటే వెంట్రుకలు ఊడుతున్న బాధను వారిద్దరూ అనుభవించారు. ఏమాత్రం బిడియ పడకుండా ఆ కార్యక్రమం లేడీ కంటెస్టెంట్స్ పూర్తి చేశారు. ఇలాంటి కాన్సెప్ట్ వినడమే ఇబ్బందిగా ఉంటే అది ఆడవాళ్ల చేత చేయించడం మరింత దారుణం అనిపించింది. 
 

68
Bigg Boss Telugu 6


అనంతరం కంటెస్టెంట్స్ ని  స్కూల్  చిల్డ్రన్స్ గా మార్చేశారు. ఆ స్కూల్ కి మాస్టర్ గా బాల ఆదిత్యను నియమించారు. ఈ స్కూల్ కాన్సెప్ట్ లో టీచర్ బాల ఆదిత్యకు కంటెస్టెంట్స్ చుక్కలు చూపించారు. స్కూల్ పిల్లల్లా నటించే క్రమంలో బాల ఆదిత్యతో ఆడుకున్నారు. 

78
Bigg Boss Telugu 6

అనంతరం మీకేమి వచ్చో చూపించండి అని బాల ఆదిత్య అడుగగా... కపుల్ మెరీనా-రోహిత్ ఫన్నీ గేమ్ ఆడారు. వారిద్దరూ చిన్న రొమాన్స్ చేశారు. మొత్తంగా హౌస్ ని ఎంటర్టైనింగ్ నడిపే ప్రయత్నం చేస్తున్నారు నిర్వాహకులు. ఇక ఈ వారం ఎలిమినేషన్స్ లో ఎనిమిది మంది ఉన్నారు. వారిలో ఒకరు వచ్చే ఆదివారం హౌస్ వీడనున్నారు.

88
Bigg Boss Telugu 6

  మెరీనా, ఇనయా, వాసంతి, అర్జున్, ఆది రెడ్డి, ఫైమా, ఆదిత్య, చంటి నామిషన్ లో ఉండగా సోషల్ మీడియా ఓటింగ్ ప్రకారంఇనయా టాప్ లో ఉన్నట్లు సమాచారం. ఆమెకు ప్రేక్షకులు బాగా ఓట్లు వేస్తున్నారట. టాప్ కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ లో ఉండగా ఎవరు బయటికి వస్తారో చూడాలి. 
 

Read more Photos on
click me!

Recommended Stories