ఇక ఎలిమినేషన్స్ విషయానికి వస్తే... నిన్న సన్నీ సేవ్ కాగా కాజల్, సిరి, రవి, మానస్ ఎలిమినేషన్స్ లో మిగిలారు. వీరిలో మొదటగా సిరి (Siri) సేవ్ కావడం జరిగింది. అనంతరం రవి సేవ్ అయ్యాడు. చివరిగా కాజల్, మానస్ మిగిలారు. గార్డెన్ ఏరియాలో ఉంచిన రెండు బాక్స్ లలో ఇద్దరూ చేతులు ఉంచాలని, ఎవరి చేతికి రెడ్ కలర్ అవుతుందో వాళ్ళు ఎలిమినేట్, పసుపు రంగు ఉన్నవాళ్లు సేఫ్ అని చెప్పాడు. బాక్స్ లనుండి చేతులు తీయగా ఇద్దరికీ పసుపు రంగు అంటి ఉంది. దీనితో నాగార్జున అసలు విషయం చెప్పాడు.