నాగార్జునను ప్రత్యేకంగా ఆకర్షించిన ఈ హమీదా ఎవరు? ఆమె గురించి మీకు తెలియని ఇంట్రెస్టింగ్ డిటైల్స్

Published : Sep 06, 2021, 01:25 PM IST

బిగ్ బాస్ సీజన్ 5 లాంచింగ్ ఎపిసోడ్ నిన్న గ్రాండ్ ఆ ముగియగా... హౌస్ లోకి మొత్తం 19 మంది సెలెబ్రిటీలు ఎంట్రీ ఇచ్చారు. వీరిలో 11వ కంటెస్టెంట్ గా వేదికపైకి వచ్చిన  హమీదా ఖాతూన్ పట్ల హోస్ట్ నాగార్జున ప్రత్యేక ఇంట్రెస్ట్ చూపించారు. 

PREV
17
నాగార్జునను ప్రత్యేకంగా ఆకర్షించిన ఈ హమీదా ఎవరు? ఆమె గురించి మీకు తెలియని ఇంట్రెస్టింగ్ డిటైల్స్

తెలుగు ప్రేక్షకుల మదిలో పెద్దగా రిజిస్టర్ కానీ.. ఈ హమీదా ఎవరు అనే సందేహం బిగ్ బాస్ ఆడియన్స్ లో కలిగింది. అయితే హమీదా ఎప్పుడో టాలీవుడ్ లో అడుగుపెట్టారని ఆమె డీటెయిల్స్ పరిశీలిస్తే తెలుస్తుంది..

27


హమీదా జూన్ 6, 1993 ఆదివారం పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో జన్మించింది. ఆమె కోల్‌కతాలోని సెయింట్ థామస్ డే స్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించింది.కోల్‌కతాలోని కలకత్తా విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆమె చదువు తర్వాత, హమీదా తన కుటుంబంతో కలిసి 2013 లో హైదరాబాద్‌కు షిఫ్ట్ అయింది.

37

 

హీరోయిన్ గా ప్రయత్నాలు మొదలుపెట్టిన హమీదాకు  సాహసం చేయరా డింభకా మూవీలో నటించే అవకాశం దక్కింది. 2015లో ఈ సినిమా విడుదల కావడం జరిగింది. చిన్న సినిమా కావడంతో ఎవరూ పట్టించుకోలేదు.  
ఈ సినిమా అనంతరం  భద్రం బీ కేర్ ఫుల్ బ్రదర్ సినిమాలో నటించింది. 

47


మోడలింగ్, యాక్టింగ్ తో పాటు ఆమె ఇంటీరియర్ డిజైనర్ కూడా. సినిమా అవకాశాలు లేకున్నా ఇంటీరియర్ డిజైనర్ గా ఆమెకు మంచి కెరీర్ ఉంది. కాని నటిగా ఎదగాలి అన్నది ఆమె లక్ష్యంగా తెలుస్తుంది. 


 

57


హమీదా ఇప్పుడు మళ్ళీ టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తోంది. అలా క్యారెక్టర్ రోల్స్ చేయడం మీద ఎక్కువ దృష్టి పెట్టడానికి ఆసక్తి చూపుతోంది. ఆసక్తికరంగా, హమీదా ఇంటీరియర్ డిజైనర్‌గా బిజీగా ఉన్నప్పుడు కూడా నటన పట్ల తన అభిరుచి మరియు ప్రాధాన్యతను కొనసాగించింది. ప్రస్తుతానికి, హమీదా ఖాతూన్ తన రెండు వృత్తుల పై అంటే ఒక పక్క నటన మరో పక్క ఇంటీరియర్ డిజైనింగ్ మీద కూడా దృష్టి సారించింది.

67


ఇక హమీదా అభిరుచులు, ఇష్టాయిష్టాలు గురించి చెప్పాలంటే...  ప్రయాణం చేయడానికి ఇష్టపడుతుంది, అలాగే  ఫిట్‌నెస్ ఫ్రీక్ కూడాను. మనిషికి ఆర్యోగం ఎంతో ముఖ్యం అని నమ్మిన హమీదా క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తారట. మంచి ఆరోగ్యం, వ్యాయామం ఆమె దిన చర్యలో భాగమట. 


 

77


వృత్తిలో భాగంగా ఇండియా మొత్తం చక్కర్లు కొట్టే హమీదా,  సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్ వంటి ప్రదేశాలకు కూడా వెళుతూ ఉంటారు. బిగ్ బాస్ షో తన కెరీర్ కి ఎంతో కొంత మేలు చేస్తుందని హమీదా నమ్మకం. టైటిల్ కొట్టాలనే లక్ష్యంతో హౌస్లోకి అడుగుపెట్టిన హమీదా బిగ్ బాస్ జర్నీ ఎలా సాగుతుందో చూడాలి. 

click me!

Recommended Stories