పల్లవి ప్రశాంత్ విజయంలో శివాజీ, ప్రిన్స్ యావర్ సపోర్ట్ ఎంతగానో ఉంది. ముఖ్యంగా శివాజీ అతనికి గురువుగా వ్యవహరించాడు. శివాజీ, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ ఒక గ్రూప్. వీరికి స్పై బ్యాచ్ అంటారు. ఇక షో ముగిశాక కూడా పల్లవి ప్రశాంత్, శివాజీ, యావర్ తరచుగా కలుస్తున్నారు.