ప్రియుడితో బుల్లితెర తార కీర్తిభట్ ఎంగేజ్ మెంట్, వైరల్ అవుతున్న ఫోటోస్..

Published : Aug 22, 2023, 05:00 PM IST

ఎట్టకేలకు ఎంగేజ్మెంట్ తో.. తన ప్రియుడిని సొంతం చేసుకుంది  ప్రముఖ కన్నడ నటి.. బిగ్ బాస్ ఫేమ్.. కార్తీకదీపం తార కీర్తి భట్.  త్వరలో పెళ్ళి పీఠలు ఎక్కబోతోంది. 

PREV
17
ప్రియుడితో బుల్లితెర తార కీర్తిభట్ ఎంగేజ్ మెంట్, వైరల్ అవుతున్న ఫోటోస్..

తెలుగు టెలివిజన్ చరిత్రలో సూపర్ రెస్పాన్స్ తో దూసుకువెళ్తున్న సీరియల్ లో  కార్తీక దీపం కూడా ఒకటి. ఈసీరియర్ జనాల మీద ఎంత ప్రభావం చూపించిందంటే.. ప్రత్యేకంగా ఆడవారు ఈ సిరియల్ కు బాగా అడిక్ట్ అయ్యారు. ఇక ఈ సీరియల్ తో బాగా ఫేమస్ అయ్యింది కీర్తి భట్. అంతకుముందు చాలా సీరియల్స్ ఆమె చేసినా.. కార్తీకదీపం గుర్తింపు వేరు. 

27

ఇక కీర్తీ భట్ తెలుగులో మచి గుర్తింపు సాధించింది. అంతే కాదు  బిగ్ బాస్ సీజన్ 6 లో కూడా అవకాశం సాధించి..  సీజన్ 6 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి అందరి మనసు దోచింది. రోడ్డు ప్రమాదంలో తన కుటుంబాన్ని మొత్తం పోగొట్టుకున్నపటికీ ధైర్యం, పట్టుదలతో ఇండస్ట్రీల రాణిస్తూ అందరి మన్ననలు అందుకుంది. కీర్తి. ఈ విషయం బిగ్ బాస్ లో కూడా చాలా సార్దు వెల్లడించింది. 

37

ఇక  తాజాగా కీర్తి భట్ నిశ్చితార్థాదం ఎంతో ఘనంగా జరిగింది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మనసిచ్చి చూడు సీరియల్ తో తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి. ఆ తర్వాత కార్తీకదీపం సీరియల్ లో పెద్దైన హిమ పాత్రలో నటించింది. కన్నడ అమ్మాయిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈ సీరియల్స్ తో అచ్చమైన తెలుగు అమ్మాయిగా బాగా గుర్తింపు తెచ్చుకుంది. 

47

బిగ్ బాస్ పుణ్యమా అని తెలుగు ప్రేక్షకులందరికీ బాగా తగ్గరయ్యింది. కీర్తి భట్. అయితే తనకు పిల్లలు పుట్టరని నిరాశలో ఉంది కీర్తి. తనను ఎవరు ఇష్టపడి పెళ్ళి చేసుకుంటారు అంటూ.. అప్పడప్పుడు బాధపడేది. కాని తాజాగా ఆమెకు పరేమించే వ్యాక్తి తోడుగా దోరికాడు. ఇక  త్వరలో పెళ్లికి సిద్దమైంది కీర్తి. 
 

57

తన సహ నటుడు కార్తీక్ ని ప్రేమించి పెళ్లి చేసుకోబోతుంది. ఇద్దరు పీకల్లతు ప్రేమలో ఉన్నారు.  ఇక వీరి నిశ్చితార్ధం మధురానగరిలో  ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బుల్లితెర నటీనటులు, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ హాజరై సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

67

ఆ మధ్య తనకు కాబోయే భర్త కార్తీక్ ని స్టార్ మా ఛానల్ లో  మా బోనాల జాతర స్పెషట్ ఈవెంట్ లో అందరికి  పరిచయం చేసింది కీర్గి భట్. అదే వేదికపై ఇద్దరూ రింగులు కూడా మార్చుకున్నారు. అయితే అది స్కిట్ కాదని.. నిజంగానే కీర్తి భట్, కార్తీక్ తో ఎంగేజ్ మెంట్ జరుపుకుంది. 
 

77
Keerthi Bhat

కీర్తి గురించి అన్నీ తెలిసి ఆమెన మనస్పూర్తి ప్రేమించి.. పెళ్లాడబోతుననాడు కార్తీక్. అంతే కాదు తన కుటుంబ సభ్యులను ఒప్పించి మరీ పెళ్లికి రెడీ అయ్యాడు  కార్తీక్. ఇలాంటి గొప్ప భర్త, అత్తమామలు దొరకడం తన అదృష్టం అని ఆనందం వ్యక్తం చేస్తుంది కీర్తి భట్. ఇక ప్రస్థుతం ఆమె ఎంగేజ్ మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

click me!

Recommended Stories