అలా పిలిచాడని వేదికపై కమెడియన్ ని కాలితో తన్నిన ఆషురెడ్డి

First Published Mar 22, 2021, 1:54 PM IST


సోషల్ మీడియా స్టార్ అండ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆషురెడ్డి తరచుగా వివాదాలతో వార్తలలో ఉంటారు. తాజాగా ఆమె చర్య అందరినీ షాక్ కి గురిచేసింది. ఆషురెడ్డి వేదికపై అందరూ చూస్తుండగానే ఓ కమెడియన్ ని కాలితో తన్నింది. 

ఈ మధ్య పవన్ కళ్యాణ్ నాలుగో భార్యగా ఉంటానని కామెంట్ చేసి వార్తలలో నిలిచింది ఆషురెడ్డి. సోషల్ మీడియా ఛాట్ లో పవన్ కి నాలుగో భార్యగా ఉండడం మీకు ఇష్టమేనా, అని ఓ నెటిజెన్ అడిగారు. దాని ఓ.. ఎస్ అని ఆమె సమాధానం చెప్పారు.
undefined
దీనితో ఆషురెడ్డి కామెంట్ పై వరుస కథనాలు రావడం జరిగింది. అయితే ఆషురెడ్డి మీడియాపై మండిపడ్డారు. తన వ్యాఖ్యలు వక్రీకరించి తప్పుగా కథనాలు రాస్తున్నారని ఆమె ఆరోపించారు.
undefined
ఇలాంటి కథనాలు పవన్ కళ్యాణ్ ని ఫ్యాన్స్ కి దూరం చేస్తాయని, ఆయన మరలా ఏ లేడీ ఫ్యాన్ ని దగ్గరకు రానివ్వరని.. ఇకనైనా తప్పుడు కథనాలు ఆపాలని, వీడియో సందేశం ద్వారా గట్టి వార్నింగ్ ఇచ్చారు.
undefined
ఆ వివాదం అలా ముగిసిపోగా.. కామెడీ స్టార్స్ వేదికపై ఆషురెడ్డి ఓ కమెడియన్ ని కాలితో తన్నారు. తనను చెల్లి అని పిలివడంతో... ఎవర్రా నీకు చెల్లి అంటూ గట్టిగా కాలితో తన్నడం జరిగింది.
undefined
స్టార్ మాలో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ ప్రోగ్రాం లో ఆషురెడ్డి కమెడియన్ గా చేస్తున్నారు. లేటెస్ట్ స్కిట్ లో తాగిన మైకంలో పెళ్ళాన్ని మర్చిపోయిన భర్త పాత్రను ఓ కమెడియన్ చేశారు.
undefined
మిత్రులతో కలిసి తాగుతున్న భర్త వద్దకు వచ్చి... తెల్లార్లు తాగుతూనే ఉంటావా.. నీకు పిల్లలు, పెళ్ళాం గుర్తుకు రారా? అని ఆషురెడ్డి అడుగుతుంది. దానికి సదరు కమెడియన్, నువ్వు నాకు చెల్లి అంటాడు.
undefined
ఆ మాటకు ఆషురెడ్డి కాలితో ఎగిరి తన్నింది. కామెడీ స్టార్స్ లేటెస్ట్ ప్రోమోలో ఈ సంఘటన జరిగింది. ఇది స్కిట్ లో భాగమైనప్పటికీ.. ఓ అమ్మాయి  అబ్బాయిని అలా తన్నడం చూడడానికి ఇబ్బందిగా ఉంది.
undefined
ఇక జబర్ధస్త్ కి పోటీగా మొదలైన కామెడీ స్టార్స్ లో శ్రీదేవి, శేఖర్ మాస్టర్  జడ్జెస్ గా ఉండగా, ముక్కు అవినాష్, చమ్మక్ చంద్ర వంటి కమెడియన్స్ టీమ్ లీడర్స్ గా ఉన్నారు.
undefined
click me!