నావల్ల కావడం లేదంటూ... పవన్ కోసం ఏడ్చేసిన బిగ్ బాస్ ఆషురెడ్డి!

First Published Apr 17, 2021, 1:19 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కరోనా సోకిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 16న దీనిపై అధికారిక ప్రకటన రావడం జరిగింది. కోవిడ్ పాజిటివ్ అని తెలిసిన వెంటనే పవన్ క్వారంటైన్ కావడంతో పాటు, చికిత్స తీసుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ కరోనా బారినపడ్డారన్న వార్త ఆయన అభిమానులను కలవరపెట్టింది. ఒక్కసారిగా వారు షాక్ కి గురయ్యారు. పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా, ఆయన త్వరగా కోలుకోవాలని విషెస్ తెలియజేశారు.
undefined
అయితే పవన్ డై హార్డ్ ఫ్యాన్స్ లో ఒకరైన ఆషురెడ్డి  కన్నీటి పర్యంతం అయ్యారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలంటూ ఆమె ఓ వీడియో చేయడం జరిగింది.
undefined
పవన్ కళ్యాణ్ కి కరోనా సోకిందన్న వార్త డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాని ఆషురెడ్డి అన్నారు. ఆ వార్త విన్న తరువాత తనకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
undefined
పైన దేవుడు ఉన్నాడు, తొందరగా కోలుకొని మన కోసం ఆయన తిరిగి వస్తారని, తిరిగి షూటింగ్స్ లో పాల్గొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే పవన్ త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్ధనలు చేయాలని, ఆమె అభ్యర్ధించారు.
undefined
అదే సమయంలో తప్పకుండా మాస్క్ ధరించండి. సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యింది. మీపై కుటుంబ సభ్యులు ఆధారపడి ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని ఆషురెడ్డి ఫ్యాన్స్ ని కోరారు.
undefined
పవన్ త్వరగా కోలుకోవాలంటూ ఆషురెడ్డి ఓ లేఖ కూడా రాయడం విశేషం. ఆ లేఖతో పాటు వీడియోను ఆషురెడ్డి తన అధికారిక ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేయగా, వైరల్ అవుతుంది.
undefined
కొద్దిరోజుల క్రితం ఆషురెడ్డి చేసిన కామెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పవన్ నాలుగో భార్యగా ఉండడానికి నాకు ఇష్టమే అని ఆమె చెప్పినట్లు కథనాలు ప్రచురితం అయ్యాయి.
undefined
అయితే తన మాటలు వక్రీకరించారని, ఇలాంటి వార్తలు రాసి నాలాంటి ఫ్యాన్స్ ని పవన్ కి దూరం చేస్తున్నారని ఆషురెడ్డి విరుచుకుపడ్డారు. ఇకపై అలాంటి కథనాలు రాయవద్దని వార్నింగ్ ఇచ్చారు.
undefined
ఇక పవన్ ఫ్యాన్ గా ఆషురెడ్డి ఆయన పేరు టాటూగా సీక్రెట్ ప్లేస్ లో వేయించుకున్నారు. ఏమైనా స్టార్స్ కూడా పడిసచ్చే స్టార్డం పవన్ సొంతం.
undefined
click me!